49 songs found

వందనం|Vandanam

నా ప్రతి అవసరము / తీర్చువాడవు నీవే… యేసయ్యా / నా ప్రతి ఆశ / నెరవేర్చువాడవు నీవే… యేసయ్యా / ఆకలితో నే అలమటించినప్పుడు / అక్కరనెరిగి ఆదుకొన్నావు (2) / వందనం యేసయ్యా / నీకే వందనం యేసయ్యా / నా ప్రతి అవసరము / తీర్చువాడవు నీవే… యేసయ్యా / నా ప్రతి ఆశ / నెరవేర్చువాడవు నీవే… యేసయ్యా / ఊహించలేని ఆశ్చర్య కార్యములతో / ఏ కొదువ లేక నను కాచుచుంటివి (2) / కష్టాలెన్ని వచ్చినా – కరువులెన్ని కలిగినా / నీ చేతి నీడ ఎప్పుడూ నను దాటిపోదు ||వందనం|| / తప్పిపోయినా త్రోవ మరచినా / నీ కృప నన్ను విడచి వెళ్ళదు (2) / నీ కృప – విడచి వెళ్ళదు నన్నెప్పుడు (2) / యేసయ్యా.. / నా ప్రతి విన్నపం / నీ చెంత చేరునేసయ్యా – యేసయ్యా / నా ప్రతి ప్రార్థనకు / జవాబు నీవే యేసయ్యా – యేసయ్యా (2) / వందనం యేసయ్యా / నీకే వందనం యేసయ్యా / ఏమివ్వగలను ఎనలేని ప్రేమకై / యేసయ్యా… వందనం

వందనంబొనర్తుమో ప్రభో|Vandanambonarthumo prabho

వందనంబొనర్తుమో ప్రభో ప్రభో / వందనంబొనర్తుమో ప్రభో ప్రభో / వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా / వందనంబు లందుకో ప్రభో ||వందనం|| / ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు / గన్న తండ్రి మించి ఎపుడు గాచియు / ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా / యన్ని రెట్లు స్తోత్రములివిగో ||వందనం|| / ప్రాత వత్సరంపు బాప మంతయు / బ్రీతిని మన్నించి మమ్ము గావుము / నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా / దాత క్రీస్తు నాథ రక్షకా ||వందనం|| / దేవ మాదు కాలుసేతు లెల్లను / సేవకాలి తనువు దినములన్నియు / నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ / సేవకై యంగీకరించుమా ||వందనం|| / కోతకొరకు దాసజనము నంపుము / ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము / పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము / ఖ్యాతి నొందు నీతి సూర్యుడా ||వందనం|| / మా సభలను పెద్దజేసి పెంచుము / నీ సువార్త జెప్ప శక్తి నీయుము / మోసపుచ్చు నందకార మంత ద్రోయుము / యేసు కృపన్ గుమ్మరించుము ||వందనం||

వందనము నీకే నా|Vandanamu Neeke Naa

వందనము నీకే నా వందనము (2) / వర్ణనకందని నీకే నా వందనము (2) ||వందనము|| / నీ ప్రేమ నేనేల మరతు / నీ ప్రేమ వర్ణింతునా (2) / దాని లోతు ఎత్తునే గ్రహించి (2) / నీ ప్రాణ త్యాగమునే తలంచి (2) ||వందనము|| / సర్వ కృపానిధి నీవే / సర్వాధిపతియును నీవే (2) / సంఘానికి శిరస్సు నీవే (2) / నా సంగీత సాహిత్యము నీవే (2) ||వందనము|| / పరిశుద్ధమైన నీ నామం / పరిమళ తైలము వలె (2) / పరము నుండి పోయబడి (2) / పరవశించి నేను పాడెదను (2) ||వందనము|| / మృతి వచ్చెనే ఒకని నుండి / కృప వచ్చెనే నీలో నుండి (2) / కృషి లేక నీ కృప రక్షించెను (2) / కృతజ్ఞతార్పణలర్పింతును (2) ||వందనము|| / తండ్రియైన దేవునికే / కుమారుడైన దేవునికే (2) / పరిశుద్ధాత్మ దేవునికే (2) / వందన వందన వందనము (2) ||వందనము||

వందనాలు యేసు|Vandanaalu Yesu

వందనాలు యేసు నా వందనాలో / వందనాలు శతకోటి వందనాలు (2) / అబ్రాహాము దేవా నా వందనాలు / ఇస్సాకు దేవా నా వందనాలు (2) / అబ్రాహాము దేవా – ఇస్సాకు దేవా / యాకోబు దేవా నా వందనాలు (2) / నన్ను పిలిచావు వందనాలో / నన్ను కలిసావు వందనాలు (2) / నన్ను మరువలేదు వందనాలో / నన్ను విడువలేదు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| / మహిమనే విడిచావు వందనాలు / మహిలోనికి వచ్చావు వందనాలు (2) / మహిమనే విడిచావు – మహిలోనికి వచ్చావు / మార్గమై నిలిచావు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| / మరణమే గెలిచావు వందనాలు / మహిమనే చూపావు వందనాలు (2) / మరణమే గెలిచావు – మహిమనే చూపావు / మాటనే నిలిచావు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| / సిలువనే మోసావు వందనాలు / నా బరువునే దించావు వందనాలు (2) / సిలువనే మోసి – నా బరువునే దించి / నా ఋణమునే తీర్చావు వందనాలు (2) ||నన్ను పిలిచావు|| / నా తోడు నీవే నా వందనాలు / నా నీడ నీవే నా వందనాలు (2) / నా తోడు నీవే – నా నీడ నీవే / నా వాడవు నీవే నా వందనాలు (2) ||నన్ను పిలిచావు||

వచ్చింది క్రిస్మస్ వచ్చింది|Vachchindi Christmas Vachchindi

వచ్చింది క్రిస్మస్ వచ్చింది / తెచ్చింది పండుగ తెచ్చింది / వచ్చింది క్రిస్మస్ వచ్చింది / తెచ్చింది రక్షణ తెచ్చింది / ఊరూ వాడా పల్లె పల్లెల్లోన / ఆనందమే ఎంతో సంతోషమే (2) / మన చీకటి బ్రతుకులలోన / ప్రభు యేసు జన్మించెను (2) / రారండోయ్ వేడుక చేద్దాం / కలిసి రారండోయ్ పండుగ చేద్దాం (2) ||వచ్చింది|| / దావీదు పట్టణములో / బేత్లెహేము గ్రామములో / కన్య మరియ గర్భమునందు / బాలునిగా జన్మించెను (2) / అంధకారమే తొలగిపోయెను / చీకు చింతలే తీరిపోయెను (2) ||మన చీకటి|| / ఆకాశంలో ఒక దూత / పలికింది శుభవార్త / మన కొరకు రక్షకుడేసు / దీనునిగా పుట్టాడని (2) / పాప శాపమే తొలగించుటకు / గొప్ప రక్షణ మనకిచ్ఛుటకు (2) ||మన చీకటి||

వచ్చింది వచ్చింది వచ్చింది|Vachchindi Vachchindi Vachchindi

వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా / మార్పులేకుండ చేస్తే శుద్ద దండగా / వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ / యేసయ్య కోరింది మనలో మార్పునే కదా / ఇంటికి రంగులు కాదు – వంటికి హంగులు కాదు / అల్లరి ఆటలు కాదు – త్రాగుబోతు విందులు కాదు (2) / మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్ / అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్ / దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్ / ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్ ||వచ్చింది|| / రంగురంగు వస్త్రాలు – మురికిగుడ్డల మనస్సులు / మెరిసిపోతున్న ఇళ్ళు – మాసిపోయాయి హృదయాలు / ఇంటిపైన నక్షత్రాలు – ఇంటిలో మద్యపానులు / పేరుకేమో క్రైస్తవులు – తీరుమారని జనులు (2) ||ఇంటికి|| / విద్యలేని పామరులు – విధేయులై బ్రతికారు / విద్యవున్న సోమరులు – మందిరాలకే రారు / తూర్పుదేశపు జ్ఞానులే – మోకాళ్ళు వంచినారు / చదువు పదవుంటే చాలు – మోకరించరు వీరు (2) ||ఇంటికి|| / దినములు చెడ్డవి గనుక – సమయమును పోనియ్యక / అజ్ఞానులవలె కాక – జ్ఞానులవలె నడవాలి / పాపము తీయుట కొరకే – ప్రభు పుట్టాడని తెలిసి / పాపము వీడక నీవు – ఉత్సవ ఉల్లాసాలా (2) ||ఇంటికి||

వధియింపబడిన గొర్రెపిల్లా|Vadhiyimpabadina Gorrepillaa

హోలీ హోలీ… హోలీ హోలీ… (2) / హోలీ హోలీ హోలీ హోలీ / హోలీ… యు ఆర్ హోలీ (2) / వధియింపబడిన గొర్రెపిల్లా – సింహాసనాసీనుడా (2) / నీ రక్తమిచ్చి… ప్రాణమిచ్చి… మమ్ములను కొన్నావే / ప్రతి జనములో… నీ ప్రజలను… నీ యాజక రాజ్యము చేసావే / రక్షణ జ్ఞానము స్తోత్రము – శక్తియు ఐశ్వర్యము నీదే / రాజ్యము బలము ప్రభావము – మహిమ ఘనత నీదే / అర్హుడా.. యోగ్యుడా.. కృతజ్ఞతకు పాత్రుడా (2) ||వధియింప|| / అన్నిటికి పైనున్నావు – అందరిని చూస్తున్నావు / అధికారం ఇచ్చే మహా దేవుడవు / ఆకాశ భూములయందు ఈ సృష్టి సర్వమునందు / నీ చిత్తము జరిగించే మహారాజు నువ్వు / నీ రాజ్యము నిలుచును నిరతము / నీదేగా సర్వాధికారము / నీవెవ్వరికి ఇత్తువో వారిదే ఔను భూ రాజ్యము / మహోన్నతుడు యేసుని శుద్ధులదే ఈ అధికారము ||రక్షణ|| / దృశ్యములు అదృశ్యములు – ఆకాశ భూజల జీవులు / అన్నియును నీ యందే సృజియింపబడెన్ / సింహాసన ప్రభుత్వములు – ప్రధానులు అధికారములు / అందరును నీ శాసనముకు లోబడును / నీ మాటతో ఏలెడి ప్రభుడవు / నీవొకడివే సృష్టికి కర్తవు / పరలోక పెద్దలందరు తమ కిరీటము తీసి నిన్ను కొలుతురే / భూ రాజులు నివాసులు తమ మహిమనంతా తెచ్చి పూజింతురే ||రక్షణ||

వర్ణించలేను|Varninchalenu

వర్ణించలేను వివరించలేను / అతి శ్రేష్టమైన నీ నామమున్ / యేసు నీ నామమున్ – (2) / కొనియాడెదన్ కీర్తించెదన్ (2) / అత్యంతమైన నీ ప్రేమను / యేసు నీ ప్రేమను (2) ||వర్ణించలేను|| / మహోన్నతుడ నీవే – పరిశుద్ధుడ నీవే / పాపినేని చూడక ప్రేమించితివే (2) / హల్లెలూయా హల్లెలూయా (2) / అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| / సర్వాధికారి సర్వోన్నతుడా (2) / హీనుడైన నన్ను కరుణించితివే (2) / హల్లెలూయా హల్లెలూయా (2) / అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను|| / రత్న వర్ణుడవు అతి సుందరుడవు (2) / నీ మహిమ నాకిచ్చి వెలిగించితివే (2) / హల్లెలూయా హల్లెలూయా (2) / అర్పింతు స్తుతులను ఆరాధ్యుడా (2) ||వర్ణించలేను||