13 songs found

లివింగ్ హోప్ (తెలుగు)|Living Hope Telugu

మన మధ్యన దూరం ఎంతో ఎత్తైనది / మేమెక్కలేనంత ఎత్తైన పర్వతం / నిరాశలో మేము నీ వైపు చూచి / నీ నామములో విడుదలను ప్రకటించితిమి / అంధకారము తొలగించి / మా ఆత్మను రక్షించి / నీ ప్రేమతో మమ్ము నింపినావయ్యా / పరిపూర్ణమైనది నీవు రచియించిన అంతం / యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ / ఊహలకు అందనిది నీ కరుణ కటాక్షం / మాపై కురిపించితివి సమృద్ధిగను / యుగయుగములకు రాజా నీ మహిమను విడచి / మా శాప భారము నీవే భరియించితివి / నీ సిలువలో మేము పొందితిమి క్షమాపణ / మేము నీవారిగా మార్చబడితిమి / సుందరుడా యేసయ్యా మేము నీ వారము / యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ / హల్లెలూయా ప్రభువా నిన్నే స్తుతియింతున్ / హల్లెలూయా నీవు మరణము గెలిచితివి / నీ నామంలో రక్షణను / మాకు విజయమునిచ్చితివి / యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ (2) / నీవు లేచిన ఉదయాన నెరవేరెను వాగ్ధానం / నిర్జీవ శరీరం శ్వాసించెనుగా / నిశ్శబ్దములో నుండి నీవు పలికిన జయభేరి / "ఓ మరణమా నీ జయమెక్కడ?" (2) / యేషువా నీకే జయమెప్పుడు / హల్లెలూయా ప్రభువా నిన్నే స్తుతియింతున్ / హల్లెలూయా నీవు మరణము గెలిచితివి / నీ నామంలో రక్షణను / మాకు విజయమునిచ్చితివి / యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ (2) / యేసు ప్రభూ నీవే మా నిరీక్షణ – (2)

లెమ్ము తేజరిల్లుము అని|Lemmu Thejarillumu Ani

లెమ్ము తేజరిల్లుము అని / నను ఉత్తేజ పరచిన నా యేసయ్య (2) / నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు / రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని / నిను వేనోళ్ళ ప్రకటించెద (2) / ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక / నీతో నడుచుటే నా భాగ్యము (2) / శాశ్వత ప్రేమతో నను ప్రేమించి / నీ కృప చూపితివి (2) / ఇదియే భాగ్యమూ… ఇదియే భాగ్యమూ… / ఇదియే నా భాగ్యమూ ||లెమ్ము|| / శ్రమలలో నేను ఇంతవరకును / నీతో నిలుచుటే నా ధన్యత (2) / జీవకిరీటము నే పొందుటకే / నను చేరదీసితివి (2) / ఇదియే ధన్యత…. ఇదియే ధన్యత…. / ఇదియే నా ధన్యత ||లెమ్ము|| / తేజోవాసుల స్వాస్థ్యము నేను / అనుభవించుటే నా దర్శనము (2) / తేజోమయమైన షాలోము నగరులో / నిను చూసి తరింతునే (2) / ఇదియే దర్శనము… ఇదియే దర్శనము… / ఇదియే నా దర్శనము ||లెమ్ము||

లెమ్ము తేజరిల్లుము నీకు|Lemmu Thejarillumu Neeku

లెమ్ము తేజరిల్లుము నీకు / వెలుగు వచ్చియున్నది (2) / యెహోవా మహిమ నీపై / ప్రకాశముగా నుదయించె (2) ||లెమ్ము|| / యేసే యీ లోకమునకు / వెలుగై యున్నానని చెప్పెన్ (2) / యేసుని నమ్మువారు (2) / వెలుగులో నడుచువారు (2) ||లెమ్ము|| / అంధకార మందుండి / బంధింప బడిన వారిన్ (2) / ఆశ్చర్యమైన వెలుగు (2) / నందించి విమోచించెన్ (2) ||లెమ్ము|| / దాత ప్రభు యేసుని నమ్మి / నీతిగా నడుచువారు (2) / జాతి భేదములు లేక (2) / జ్యోతుల వలె నుందురు (2) ||లెమ్ము|| / మనుజులు మీ సత్క్రియలను / జూచి బహు సంతోషించి (2) / మనసారా పరమ తండ్రిన్ (2) / మహిమ పరచెదరు (2) ||లెమ్ము|| / జనములు నీ వెలుగునకు / పరుగెత్తి వచ్చెదరు (2) / రాజులు నీదు ఉదయ (2) / కాంతికి వచ్చెదరు (2) ||లెమ్ము||

లే నిలబడు|Le Nilabadu

లే నిలబడు పరుగిడు తండ్రి పనికోసమే / నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషమే / సంగ్రహించు జ్ఞానమంతా – సంచరించు లోకమంతా / నిన్ను ఆపు శక్తి కలదా లోకమందునా / నీకు తోడు నీడలాగ – తండ్రి ఆత్మనివ్వలేదా / పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు / నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో / పక్షి రాజు పట్టుదలతో పౌరుషంగా సాగిపో / కదిలే.. నదిలా.. ఎదురుగ నిలబడు అలలకు జడియకు ||లే నిలబడు|| / రాళ్ళతోటి కొట్టబడిన సువార్తని ఆపకుండా / పట్టుదలతో చెప్పినట్టి స్తెఫను నీకు మాదిరి / యేసు బోద చేయకంటూ ఏలికలే ఏకమైతే / రొమ్ము విరిచి చెప్పినట్టి అపోస్తలులే మాదిరి / ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగు నేస్తమా / బెదురు పెడితే ఎవ్వడైనా నిదురపోకుమా / మనసు నిండ వాక్యముంటే మనిషి నిన్ను ఆపలేడు / ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు / సజ్జన ద్వేషులు ఇలలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణం ||లే నిలబడు|| / సొంతకన్న బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే / ఒంటరైన తల్లి మరియ నేటి స్త్రీకి మాదిరి / ఇలను సౌక్యమెంత ఉన్న పెంటతోటి పోల్చుకున్న / పరమ త్యాగి పౌలు గారి తెగువ మనకు మాదిరి / బ్రతుకు ఓడ బద్దలైనా తగ్గిపోకు తండ్రి పనిలో / తరిగిపోని స్వాస్థ్యముంది తండ్రి చెంతన / చెరను కూడ చింత మరచి కలము పట్టి రాసుకున్న / ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి / గోతిలోన దాచకు ముత్యం లెక్క అడుగుతాదిడి సత్యం ||లే నిలబడు||

లోకమంతట వెలుగు|Lokamanthata Velugu

లోకమంతట వెలుగు ప్రకాశించెను / యేసు జన్మించినపుడు / ఆకాశమునందు గొప్ప నక్షత్రంబు బుట్టెనపుడు / లోకజ్ఞానులు గొల్లలు వెళ్లి – (2) / లోక రక్షకుడేసుకు మ్రొక్కిరి ॥లోకమంతట॥ / నేను వెలుగై చీకటిలో వెలుగుచున్నాను / చీకటి దాని గ్రహింప లేదు / నేను లోకమునకు వెలుగై యున్నాను నను వెంబడించు / వాడు చీకటిలో నడువక – (2) / జీవపువెలుగై యుండుడనె యేసు ॥లోకమంతట॥ / ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనను / చంద్రుడైన నక్కరలేదు / ఆ పట్టణములో దేవుని మహిమయే ప్రకాశించుచున్నది యెపుడు / ఆ పట్టణమునకు దేవుని గొఱ్ఱె – (2) / పిల్లయే దీపమై వెలుగుచుండు ॥లోకమంతట॥ / విూరు లోకమునకు వెలుగై యున్నారు గనుక / విూరు వెలుగు సంబంధులు / విూరు కొండపైన కట్టబడిన పట్టణంబువలెనే / మరుగై యుండక నరులందరికి – (2) / వెలుగై యుందురనె యేసుండు ॥లోకమంతట॥ / చీకటిలో నడుచుజనులు గొప్ప వెలుగును / చూచిరి ధన్యులై / లోక మందు మరణచ్ఛాయగల దేశనివాసుల విూద / ప్రకాశించెను గొప్ప వెలుగు – (2) / ప్రభువు యేసుకు జేయని పాడరే ॥లోకమంతట॥