40 songs found

రావయ్యా యేసయ్యా|Raavayyaa Yesayyaa

రావయ్యా యేసయ్యా నా ఇంటికి / నీ రాకకై నే వేచియుంటిని… / రావయ్యా యేసయ్యా నా ఇంటికి / నీ రాకకై నే వేచియుంటిని (2) / కన్నులార నిన్ను చూడాలని (2) / కాచుకొని ఉన్నాను వేచి నే ఉన్నాను (2) ||రావయ్యా|| / యదార్థ హృదయముతో నడచుకొందును / ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను (2) / భక్తిహీనుల క్రియలు నాకంటనీయను / మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును (2) ||రావయ్యా|| / దౌష్ట్యము నేనెన్నడు అనుసరింపను / నా పొరుగు వారిని దూషింపను (2) / అహంకారము గర్వము నంటనీయను / నమ్మకస్థునిగా నే నడచుకొందును (2) ||రావయ్యా|| / నిర్దోష మార్గముల నడచుకొందును / మోసము నా ఇంట నిలువనీయను (2) / అబద్ధికులెవ్వరిని ఆదరింపను / భక్తిహీనుల మార్గము నే త్రొక్కను (2) ||రావయ్యా||

రుచి చూచి ఎరిగితిని|Ruchi choochi erigithini

రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2) / రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| / గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2) / తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| / మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా (2) / మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| / మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో (2) / ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| / కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను (2) / క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| / ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి (2) / సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||

రెండే రెండే దారులు|Rende Rende Daarulu

రెండే రెండే దారులు / ఏ దారి కావాలో మానవా / ఒకటి పరలోకం మరియొకటి పాతాళం (2) / పరలోకం కావాలో పాతాళం కావాలో / తెలుసుకో మానవా (2) / పరలోకం గొప్ప వెలుగుతో / ఉన్నాది పరిశుద్ధుల కోసం (2) / సూర్యుడుండడు చంద్రుడుండడు / చీకటుండదు రాత్రియుండదు / నిత్యుడైన యేసుడే ప్రకాశించుచుండును (2) / యుగయుగములు పరలోక రాజ్యమేలుచుండును (2) / యేసు ప్రభుని నమ్ముకో పరలోకం చేరుతావు (2) ||రెండే|| / పాతాళం అగ్ని గుండము / ఉన్నాది ఘోరపాపుల కోసం (2) / అగ్ని ఆరదు పురుగు చావదు / గప్పగప్పున రగులుచుండును / ధనవంతుడు మరణించి అగ్నిలో ఉన్నాడు (2) / అబ్రహాము రొమ్ముపై లాజరును చూసాడు (2) / ధనవంతుడు చూసి ఆశ్చర్యపడ్డాడు (2) ||రెండే|| / పుడతావు నీవు దిగంబరిగా / వెళతావు నీవు దిగంబరిగా (2) / గాలి మేడలు ఎన్నో కడతావు / నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు / లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు (2) / ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి (2) / అగ్ని లో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో (2) ||రెండే||

రోజంతా ద్వేషం|Rojanthaa Dvesham

రోజంతా ద్వేషం మనుషుల కోపం / తీరని బాధ ఇది తీరము చేరనిది / అవమానం ఆవేశం / కన్నీళ్ళే ఈ దేహం / విరిగిన హృదయం నలిగిన దేహం / శవమై పోవులే ఈ జీవితము / ఊపిరి ఆహుతై మిగిలెనే / నీ కృప నాకు చాలును దేవా / నీ ప్రేమ నన్ను విడువదు ప్రభువా (2) / గర్బము లేని ఈ శరీరము / నిందై పోయిన ఈ జీవితము / నీ ప్రజలే నన్ను ద్వేషించగా / అయిన వాల్లే శోధించిగా / రావా దేవా నీ ప్రేమతో / నింపుము ప్రభువా నీ కృపతో (2) / నీ కృప నాకు చాలును దేవా / నీ ప్రేమ నన్ను విడువదు ప్రభువా (2) / రావా దేవా నీ ప్రేమతో / నింపుము ప్రభువా నీ కృపతో (2) / నిలబెట్టుము దేవా నీ ప్రజలతో / నిందైన నన్ను నీ సాక్షముతో / చేయి పట్టి నడుపుము నీ మార్గములో / పడుతున్న నన్ను నీ వాక్యముతో / ఎవరు మాట్లాడినా నీ స్వరమే అది / ఎవరు ప్రేమించినా నీ ప్రేమా అది / రావా దేవా నీ ప్రేమతో / నింపుము ప్రభువా నీ కృపతో (2) / నీ కృప నాకు చాలును దేవా / నీ ప్రేమ నన్ను విడువదు ప్రభువా (2) / రావా దేవా నీ ప్రేమతో / నింపుము ప్రభువా నీ కృపతో (2)