40 songs found
రండి ఉత్సాహించి పాడుదము / రక్షణ దుర్గము మన ప్రభువే (2) / రండి కృతజ్ఞత స్తోత్రముతో / రారాజు సన్నిధికేగుదము (2) / సత్ప్రభు నామము కీర్తనలన్ / సంతోష గానము చేయుదము ||రండి|| / మన ప్రభువే మహా దేవుండు / ఘన మహాత్యము గల రాజు (2) / భూమ్యాగాధపు లోయలును / భూధర శిఖరములాయనవే ||రండి|| / సముద్రము సృష్టించెనాయనదే / సత్యుని హస్తమే భువిజేసెన్ (2) / ఆయన దైవము పాలితుల / ఆయన మేపెడి గొర్రెలము ||రండి|| / ఆ ప్రభు సన్నిధి మోకరించి / ఆయన ముందర మ్రొక్కుదము (2) / ఆయన మాటలు గైకొనిన / అయ్యవి మనకెంతో మేలగును ||రండి|| / తండ్రి కుమార శుద్దాత్మకును / తగు స్తుతి మహిమలు కల్గు గాక (2) / ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ / అయినట్లు యుగములనౌను ఆమెన్ ||రండి||
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు / ప్రయాసపడి భారము మోయువారలు / ప్రభుని చెంతకు పరుగిడి వేగమే / యేసుని పిలుపు వినియు నింక – యోచింపరేల / అవనిలో అగచాట్ల పాలైన / అబ్బదు శాంతి ఆత్మకు నిలలో ||రండి|| / కరువు రణము మరణము చూచి – కలుగదు మారుమనస్సు / ప్రవచనములు సంపూర్ణములాయెను / యూదులు తిరిగి వచ్చుచున్నారు ||రండి|| / ప్రభు యేసు నీ కొరకై తనదు – ప్రాణము నిచ్చె గదా / సిలువను రక్తము చిందించియును / బలియాయెను యా ఘనుడు మనకై ||రండి|| / యేసుని నామమునందె పరమ – నివాసము దొరకును / ముక్తిని పాప విమోచనమును / శక్తిమంతుడు యేసే యిచ్చును ||రండి|| / నేనే మార్గము నేనే సత్యము – నేనే జీవమును / నేను గాకింకెవరు లేరని / యెంచి చెప్పిన యేసుని వద్దకు ||రండి||
రండి రండి రండయో రక్షకుడు పుట్టెను (2) / రక్షకుని చూడను రక్షణాలు పొందను (2) ||రండి|| / యూదుల యూదట రాజుల రాజట (2) / రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) / యూదుల యూదట రాజుల రాజట (2) / రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట (2) ||రండి|| / బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2) / పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) / బెత్లెహేము ఊరిలో బీద కన్య మరియకు (2) / పశువుల శాలలో శిశువుగా పుట్టెను (2) ||రండి|| / సాతాను సంతలో సంతోషమేదిరా (2) / సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2) / సాతాను సంతలో సంతోషమేదిరా (2) / సంతోషం కలదురా శ్రీ యేసుని రాకలో (2) ||రండి||
రండి సువార్త సునాదముతో / రంజిలు సిలువ నినాదముతో / తంబుర సితార నాదముతో / ప్రభు యేసు దయానిధి సన్నిధికి (2) ||రండి|| / యేసే మానవ జాతి వికాసం / యేసే మానవ నీతి విలాసం / యేసే పతీత పావన నామం / భాసుర క్రైస్తవ శుభ నామం ||రండి|| / యేసే దేవుని ప్రేమ స్వరూపం / యేసే సర్వేశ్వర ప్రతిరూపం / యేసే ప్రజాపతి పరమేశం / ఆశ్రిత జనముల సుఖవాసం ||రండి|| / యేసే సిలువను మోసిన దైవం / యేసే ఆత్మల శాశ్వత జీవం / యేసే క్షమాపణ అధికారం / దాసుల ప్రార్ధన సహకారం ||రండి|| / యేసే సంఘములో మన కాంతి / యేసే హృదయములో ఘన శాంతి / యేసే కుటుంబ జీవన జ్యోతి / పసిపాపల దీవెన మూర్తి ||రండి|| / యేసే జీవన ముక్తికి మార్గం / యేసే భక్తుల భూతల స్వర్గం / యేసే ప్రపంచ శాంతికి సూత్రం / వాసిగ నమ్మిన జన స్తోత్రం ||రండి||
రక్షకుండుదయించినాడట – మన కొరకు పరమ / రక్షకుండుదయించినాడట / రక్షకుండుదయించినాడు – రారే గొల్ల బోయలార / తక్షనమున బోయి మన ని – రీక్షణ ఫల మొందెదము ||రక్షకుండు|| / దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు (2) / దేవుడగు యెహోవా మన – దిక్కు దేరి చూచినాడు ||రక్షకుండు|| / గగనము నుండి డిగ్గి – ఘనుడు గాబ్రియేలు దూత (2) / తగినట్టు చెప్పే వారికి – మిగుల సంతోష వార్త ||రక్షకుండు|| / వర్తమానము జెప్పి దూత – వైభవమున పోవుచున్నాడు (2) / కర్తను జూచిన వెనుక – కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు|| / పశువుల తొట్టిలోన – భాసిల్లు వస్త్రముల జుట్టి (2) / శిశువును గనుగొందురని – శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు|| / అనుచు గొల్ల లొకరి కొకరు – ఆనవాలు జెప్పుకొనుచు (2) / అనుమతించి కడకు క్రీస్తు – నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||
రక్షకుడా యేసు ప్రభో స్తోత్రము దేవా / స్వచ్చమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2) ||రక్షకుడా|| / సర్వ లోక రక్షణకై సిలువనెక్కెను (2) / శ్రమ అయిననూ బాధ అయిననూ (2) / ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా / క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా / రక్షకుడా… ||రక్షకుడా|| / ఎంచలేని యేసు నాకై హింస పొందెనే (2) / హింస అయిననూ హీనత అయిననూ (2) / ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా / క్రీస్తు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా / రక్షకుడా… ||రక్షకుడా|| / ఎన్నడైన మారని మా యేసుడుండగా (2) / ఉన్నవైననూ రానున్నవైననూ (2) / ప్రభువు ప్రేమ నుండి నన్ను వేరు చేయునా / హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ / రక్షకుడా… ||రక్షకుడా||
రక్షకుడు వచ్చినాడు వచ్చినాడమ్మా / నిన్ను నన్ను పరముకు చేర్చ భువికొచ్చాడమ్మా (2) / పాపమే లేనోడమ్మా పాపుల రక్షకుడమ్మా / ప్రాణమియ్య వెనుకాడని ప్రేమామయుడోయమ్మా / మన కోసం ఇలకొచ్చిన యేసురాజు ఇతడమ్మా / జగమంతా కొలిచేటి ఇమ్మానుయేలమ్మా (2) / ప్రవక్తల ప్రవచనాలు నేరవేర్చాడమ్మా / మోడుబారిన బ్రతుకులలో దావీదు చిగురమ్మా (2) / బాలుడై వచ్చాడమ్మా భారమే మోసాడమ్మా / విడుదలనే ఇచ్చిన దేవుని గొర్రెపిల్లమ్మా ||మన కోసం|| / వినరే ప్రేమామయుని చరితం వినరే జనులారా / నమ్మితే చాలు మోక్షమునిచ్చును నమ్ము మనసారా (2) / వెల తానే చెల్లించి తన వారసులుగ ఎంచి / నిత్యం తనతో ఉండే భాగ్యమునిచ్చాడమ్మా ||మన కోసం||
రక్షింపబడిన నీవు – లోకాశలపైనే నీదు / గురి నిలిపి పయనిస్తున్నావా / రక్షకుని ఎరిగిన నీవు – తానెవరో తెలియదు నాకు / అన్నట్టు జీవిస్తున్నావా (2) / యేసే లేని నీ బ్రతుకులో / వెలుగే లేదని తెలుసుకో / యేసే లేని జీవితానికి / విలువే లేదని తెలుసుకో (2) ||రక్షింపబడిన|| / మంటితోనే నిను చేసినా / కంటి పాపగా కాపాడెనే / మాటి మాటికి పడిపోయినా / శాశ్వత ప్రేమతో ప్రేమించెనే (2) / ఆ ప్రేమను కాదని – అవసరమే లేదని / ఈ లోకం నాదని – ప్రభు మార్గం విడచితివా / యేసే లేనిదే – పరలోకానికి / ప్రవేశం లేదనే – పరమార్ధం మరచితివా ||యేసే|| / యేసులోనే నీ రక్షణ / యేసులోనే నిరీక్షణ / యేసులోనే క్షమాపణ / చేసుకో మరి ప్రక్షాళన (2) / ఎంతో ప్రేమను – నీపై చూపించెను / తన ప్రాణము సహితము – నీకై అర్పించెనుగా / ఇప్పటికైననూ – మార్చుకో మనస్సునూ / ప్రభువును చేరగా – వేగిరమే పరుగిడిరా ||యేసే||
రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు / వాంఛతో తన కరము చాపి / రమ్మనుచున్నాడు (2) / ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని (2) / గ్రహించి నీవు యేసుని చూచిన / హద్దు లేని ఇంపు పొందెదవు (2) ||రమ్మను|| / కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ (2) / కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ / కనికరించి నిన్ను కాపాడును (2) ||రమ్మను|| / సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును (2) / ఆయన నీ వెలుగు రక్షణనై యుండును / ఆలసింపక త్వరపడి రమ్ము (2) ||రమ్మను|| / సకల వ్యాధులను స్వస్థత పరచుటకు (2) / శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో / అందరికి తన కృపలనిచ్చున్ (2) ||రమ్మను||
నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు / నా దేవుడే నాకు మార్గ దర్శకుడు / నా దేవుడే నాకు నిత్య పోషకుడు / నా దేవుడే నాకు జీవన దాయకుడు / గతి లేని నన్ను వెదకిన – అతి కాంక్షనీయుడాయనే / మితి లేని ప్రేమ చూపిన – రవికోటి తేజుడాయనే ||నా దేవుడే|| / శ్రమలలో నా తోడుగా నన్ను నడిపించెను / నా నీడగా వెన్నంటియున్న నా ప్రాణనాథుడు / మరణపు సంకెళ్ళ నుండి నన్ను విడిపించెను / నా బంధకాలన్ని తెంచి వేసిన నా నీతిసూర్యుడు / క్షణమైన మరువని వీడని నా క్షేమా శిఖరము / క్షమియించి నాకు అందించెను ఈ రక్షణానందము / క్షయమైన బ్రతుకు మార్చి అక్షయతనొసగెను ||గతి లేని|| / వాక్యమే నా జీవమై నన్ను బ్రతికించెను / నా పాదములకు చిరు దీపమైన నా దివ్య తేజము / ఆత్మయే పరిపూర్ణమై నన్ను బలపరచెను / నా అడుగు జాడలను స్థిరము చేసిన నా జీవ మార్గము / నా గమ్యమేమిటో తెలియక నా పరుగు ఆగిపోగా / నా చేయి పట్టి నను నడిపిన నా మార్గదర్శి యేసే / విలువైన ప్రేమ నాపై నిలువెల్ల కురిసెను ||గతి లేని||
రాకడ ప్రభుని రాకడ / రాకడ రెండవ రాకడ / ఏ దినమో ఏ ఘడియో (2) ఎవ్వరు ఎరుగనిది / రెప్పపాటున కాలమున తప్పక వచ్చునది ||రాకడ|| / నోవాహు దినములలో జరిగినట్లుగా / లోతు కాలమున సాగినట్లుగా (2) / పాపమందు ప్రజలంతా మునిగి తేలగా / లోకమంతా దేవుని మరచియుండగా (2) / మధ్యాకాశమునకు ప్రభువు వచ్చుగా / మహిమతో తన ప్రజల చేర పిలుచుగా (2) ||రాకడ|| / దేవుని మరచిన ప్రజలందరిని / సువార్తకు లోబడని జనులందరిని (2) / శ్రమల పాలు చేయను ప్రభువు వచ్చును / అగ్ని జ్వాలలతో అవని కాల్చును (2) / వేదనతో భూమినంత బాధపరచును / తన మహిమను ప్రజలకు తెలియపరచును (2) ||రాకడ||
రాకడ సమయంలో – కడబూర శబ్ధంతో / యేసుని చేరుకునే – విశ్వాసం నీకుందా? (2) / రావయ్య యేసయ్య – వేగరావయ్యా / రావయ్య యేసునాథా – వేగమెరావయ్యా (2) ||రాకడ|| / యేసయ్య రాకడ సమయంలో / ఎదురేగె రక్షణ నీకుందా? (2) / లోకాశలపై విజయం నీకుందా? (2) ||రావయ్య|| / ఇంపైన ధూపవేదికగా / ఏకాంత ప్రార్థన నీకుందా? (2) / యేసు ఆశించే దీన మనస్సుందా? (2) ||రావయ్య|| / దినమంతా దేవుని సన్నధిలో / వాక్యం కొరకు ఆకలి నీకుందా? (2) / యేసునాథునితో సహవాసం నీకుందా? (2) ||రావయ్య|| / శ్రమలోన సహనం నీకుందా? / స్తుతియించే నాలుక నీకుందా? (2) / ఆత్మలకొరకైన భారం నీకుందా? (2) ||రావయ్య|| / నీ పాత రోత జీవితము / నీ పాప హృదయం మారిందా? (2) / నూతన హృదయంతో ఆరాధన నీకుందా? (2) ||రావయ్య|| / అన్నీటికన్నా మిన్నగను / కన్నీటి ప్రార్థన నీకుందా? (2) / ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా? (2) ||రావయ్య||