116 songs found

యేసుని నా మదిలో|Yesuni Naa Madilo

యేసుని నా మదిలో స్వీకరించాను / ఆయన నామములో రక్షణ పొందాను (2) / నేను నేనే కాను… నాలో నా యేసే… (2) / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ / హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ||యేసుని|| / పాతవి గతియించెను / క్రొత్తవి మొదలాయెను (2) / నా పాప హృదయింలో రారాజు జన్మించె / నా పాపం తొలగి పోయెను – నా దుఃఖం కరిగి పోయెను (2) / యేసే నా జీవం… / ఆ ప్రభువే నా దైవం (2) ||హల్లెలూయ|| / నీ పాపం తొలగాలన్నా / నీ దుఃఖం కరగాలన్నా (2) / యేసుని నీ మదిలోకి స్వీకరించాలి / ఆయన నామములోనే రక్షణ పొందాలి (2) / యేసే మన జీవం… / ఆ ప్రభువే మన దైవం (2) ||హల్లెలూయ|| / నీవు నమ్మితే రక్షణ / నమ్మకున్నచో శిక్షయే (2) / ఎత్తబడే గుంపులో నీవు ఉంటావో / విడువబడే రొంపిలో నీవు ఉంటావో (2) / ఈ క్షణమే నీవు తేల్చుకో… / ఇదియే అనుకూల సమయము (2) ||హల్లెలూయ||

యేసుని నామములో|Yesuni Naamamulo

యేసుని నామములో – మన బాధలు పోవును / దుష్టాత్మలు పారిపోవును / శోధనలో జయమొచ్చును / మృతులకు నిండు జీవమొచ్చును / హృదయములో నెమ్మదొచ్చును / యేసు రక్తముకే – యేసు నామముకే / యుగయుగములకూ మహిమే / అభిషిక్తులగు తన దాసులకు / ప్రతి సమయమునా జయమే ||యేసుని|| / ఘోరమైన వ్యాధులెన్నైనా / మార్పులేని వ్యసనపరులైనా / ఆర్ధికముగా లోటులెన్నున్నా / ఆశలు నిరాశలే ఐనా / ప్రభుయేసుని నమ్మినచో – నీవు విడుదలనొందెదవు / పరివర్తన చెందినచో – పరలోకం చేరెదవు ||యేసు రక్తముకే || / రాజువైనా యాజకుడవైనా / నిరుపేదవైనా బ్రతుకు చెడివున్నా / ఆశ్రయముగా గృహములెన్నున్నా / నిలువ నీడే నీకు లేకున్నా / శ్రీ యేసుని నామమున – విశ్వాసము నీకున్నా / నీ స్థితి నేడేదైనా – నిత్యజీవము పొందెదవు ||యేసు రక్తముకే ||

యేసూ నన్ను ప్రేమించినావు|Yesu Nannu Preminchinaavu

యేసూ నన్ను ప్రేమించినావు / పాపినైన – నన్ను ప్రేమించినావు (2) / నన్ను ప్రేమింప మా-నవ రూపమెత్తి / దా-నముగా జీవము సిలువపై (2) / ఇచ్చి – కన్న తల్లిదండ్రుల – అన్నదమ్ముల ప్రేమ / కన్న మించిన ప్రేమతో (2) ||యేసూ|| / తల్లి గర్భమున నే – ధరియింపబడి నపుడే / దురుతుండనై యుంటిని (2) / నా – వల్ల జేయబడెడు – నెల్ల కార్యము లెప్పు / డేహ్యంబులై యుండగ (2) ||యేసూ|| / మంచి నాలో పుట్ట – దంచు నీ విరిగి నన్ / మించ ప్రేమించి-నావు (2) / ఆహా – యెంచ శక్యముగాని – మంచి నాలో బెంచ / నెంచి ప్రేమించినావు (2) ||యేసూ|| / నన్ను ప్రేమింప నీ-కున్న కష్టములన్ని / మున్నై తెలిసియుంటివి (2) / తెలిసి – నన్ను ప్రేమింప నీ-కున్న కారణమేమో / యన్నా తెలియదు చిత్రము (2) ||యేసూ|| / నా వంటి నరుడొకడు – నన్ను ప్రేమించిన / నా వలన ఫలము కోరు (2) / ఆహా – నీవంటి పుణ్యునికి – నా వంటి పాపితో / కేవలంబేమీ లేక (2) ||యేసూ||

యేసూ నీకు కావాలని|Yesu Neeku Kaavaalani

యేసూ… నీకు కావాలని / నన్ను కోరుకున్నావా (2) / నే ఘోర పాపిని ప్రభువా / ఆ.. ఆ.. ఎందుకయ్యా నాపై నీ ప్రేమ (2) / కలుషాల్ని కడిగిన కరుణామయుడా / కన్నీటి గాథను మలిచావా ప్రభువా (2) / ఈ పేద బ్రతుకును అరచేతులలో / చెక్కావు నిలిపావు నా యేసు ప్రభువా (2) / నేను నేనే కానయ్యా / నాలో నీవే యేసయ్యా (2) / నీ ప్రేమకుప్పొంగిపోనా / ఆ.. ఆ.. నీ ప్రేమలో మునిగిపోనా (2) ||యేసూ|| / దాహముతో ఉన్న నా యేసు ప్రభువా / నీ దాహం తీర్చే భాగ్యమునిమ్మయా (2) / నశియించు ఆత్మల దాహముతో / నను చెక్కావు నిలిపావు నా యేసు ప్రభువా (2) / నేను నేనే కానయ్యా / నాలో నీవే యేసయ్యా (2) / నీ ప్రేమకుప్పొంగిపోనా / ఆ.. ఆ.. నీ ప్రేమలో మునిగిపోనా (2) ||యేసూ||

యేసూ ప్రభుని స్తుతించుట|Yesu Prabhuni Sthuthinchuta

యేసూ ప్రభుని స్తుతించుట / ఎంతో ఎంతో మంచిది (2) / మహోన్నతుడా నీ నామమును / స్తుతించుటయే బహు మంచిది (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / విలువైన రక్తము సిలువలో కార్చి / కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగెను (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / ఎంతో గొప్ప రక్షణనిచ్చి / వింతైన జనముగా మేము చేసెను (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / మా శైలము మా కేడెము / మా కోటయు మా ప్రభువే (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / ఉన్నత దుర్గము రక్షణ శృంగము / రక్షించువాడు మన దేవుడు (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / అతిసుందరుడు అందరిలోన / అతికాంక్షనీయుడు అతి ప్రియుడు (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని|| / రాత్రింబవళ్లు వేనోళ్లతోను / స్తుతించుటయే బహుమంచిది (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా ||యేసూ ప్రభుని||

యేసే గొప్ప దేవుడు|Yese Goppa Devudu

యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు (2) / యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు (2) / స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి / ఘనతా బలము కలుగును ఆమెన్ (2) ||యేసే|| / మహా శ్రమలలో వ్యాధి బాధలలో / సహనము చూపి స్థిరముగ నిలచిన / యోబు వలె నే జీవించెదను (2) / అద్వితీయుడు ఆదిసంభూతుడు / దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము|| / ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో / లోకమునకు ప్రభువును చాటిన / దానియేలు వలె జీవింతును (2) / మహోన్నతుడు మన రక్షకుడు / ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే (2) ||స్తోత్రము|| / జీవితమంతా ప్రభుతో నడచి / ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన / హనోకు వలె నే జీవించెదను (2) / అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు / నీతి సూర్యుడు మన ప్రభు యేసే (2) ||స్తోత్రము||

Telugu Songs Starting with "య" — Page 9 | UEC Telugu Church