93 songs found
మేలు చేయక నీవు ఉండలేవయ్యా / ఆరాధించక నేను ఉండలేనయ్యా (2) / యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..యేసయ్యా (2) ||మేలు చేయక|| / నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా / నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండ లేక (2) / నా ఆనందం కోరేవాడా – నా ఆశలు తీర్చేవాడా (2) / క్రియలున్న ప్రేమ నీది నిజమైన ధన్యత నాది ||యేసయ్యా|| / ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను / పశ్చాత్తాపం కలిగే నాలో నేను పాపినని గ్రహియించగానే (2) / నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్ (2) / నీ కిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి ||యేసయ్యా|| / పాపములు చేసాను నేను నీ ముందర నా తల ఎత్తలేను / క్షమియించ గల్గె నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో (2) / నా హృదయము నీతో అంది నీకు వేరై మనలేనని (2) / అతిశయించెద నిత్యమూ నిన్నే కలిగి ఉన్నందుకు ||యేసయ్యా||
మేలుకో! మహిమ రాజు / వేగమే రానై యున్నాడు (2) / పరమునుండి – బూర ధ్వనితో / అరయు నేసు – ఆర్భాటముతో (2) / సర్వలోకము – తేరిచూచును / త్వరపడు ఓ ప్రియుండా (2) ||మేలుకో|| / గురుతులెల్ల – ధరణియందు / సరిగ చూడ – జరుగుచుండ (2) / చిరునవ్వుతో – చేరి ప్రభుని / త్వరపడు ఓ ప్రియుండా (2) ||మేలుకో|| / క్రీస్తునందు – మృతులెల్లరు / కడబూర – మ్రోగగానే (2) / క్రీస్తువలె – తిరిగి లేతురు / లేతువా? నీవు ప్రియుడా (2) ||మేలుకో|| / అరయంగ – పరిశుద్ధులు / మురిసెదరు – అక్షయ దేహులై (2) / పరమందు – ప్రభుక్రీస్తు / నిరతము – ఓ ప్రియుండా (2) ||మేలుకో|| / కరుణలేని – ఓ మరణమా / నిరతము నీకు జయమగునా (2) / మరణ సంహా – రుండేసు / త్వరగా – రానై యున్నాడు (2) ||మేలుకో|| / మాంసలోక – పిశాచాదులు / హింస పరచ – విజృంభించిన (2) / లేశమైనను – జడియకుము / ఆశతో – కాచుకొనుము (2) ||మేలుకో|| / పాపమును – చేయకుమా / రేపకుమా – దైవ కోపమును (2) / శాపమును – తప్పుకొని / శ్రద్ధతో – కాచుకొనుమా (2) ||మేలుకో||
మేలుకో విశ్వాసి మేలుకో / చూచుకో నీ స్థితిని కాచుకో (2) / మేలుకో విశ్వాసి మేలుకో / ఇది అంత్య కాలం.. భ్రష్టత్వ కాలం (2) / ఇహ లోక మాలిన్యం దూరపరచుకో / మదిలోని మురికినంత కడిగివేసికో ||మేలుకో|| / నిన్ను గూర్చి సేవ గూర్చి జాగ్రత్త / మంద యొక్క సాక్ష్యమెంతో జాగ్రత్త (2) / విశ్వాసం లేని దుష్ట హృదయము / చేదు వేరు నీవేనేమో చూడు జాగ్రత్త ||మేలుకో|| / ప్రేమ లేక పరిశుద్ధత కలుగునా / ధర్మశాస్త్ర సారమే ప్రేమ కదా (2) / ప్రేమ లేక ద్వేషింప బూనితే / క్రీస్తు ప్రేమ సిలువలో వ్యర్ధమే కదా ||మేలుకో||
మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా (2) / నా ప్రాణమున్నంత వరకు / విడచిపోలేనయ్యా ||మేలులు|| / కొండలలో ఉన్ననూ (నీవు) మరచిపోలేదయ్యా / శ్రమలలో ఉన్ననూ (నీవు) విడచిపోలేదయ్యా (2) / నీది గొర్రెపిల్ల మనస్సయ్యా / యేసయ్యా.. గొర్రెపిల్ల మనస్సయ్యా – (3) / అగ్నిలో ఉన్ననూ (నేను) కాలిపోలేదయ్యా / జలములలో వెళ్లినా (నేను) మునిగిపోలేదయ్యా (2) / నీది పావురము మనస్సయ్యా / యేసయ్యా.. పావురము మనస్సయ్యా – (3) / చీకటిలో ఉన్ననూ (నన్ను) మరచిపోలేదయ్యా / దుఃఖములో ఉన్ననూ (మంచి) స్నేహితుడయ్యావయ్యా (2) / నీది ప్రేమించే మనస్సయ్యా / యేసయ్యా.. ప్రేమించే మనస్సయ్యా – (3)
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా / చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా (2) / నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2) / నిత్యము నీ కీర్తి నా నోట నుండును (2) ||మేలైనా|| / కలిమి చేజారి నను ముంచినా / స్థితిని తలక్రిందులే చేసినా (2) / రెండింతలుగా దయచేసెదవని (2) / నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా|| / పరుల ఎగతాళి శృతి మించినా / కలవరము పొంది నే కృంగినా (2) / నా మొర విని కృప చూపెదవని (2) / నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా|| / శ్రమలు చెలరేగి బెదిరించినా / ఎముకలకు చేటునే తెచ్చినా (2) / ఆపదలలో విడిపించెదవని (2) / నాకు తెలుసునయ్యా మంచి యేసయ్యా (2) ||మేలైనా||
మైటీ జీసస్ తోడుంటే భయమే లేదు / సే… భయమే లేదు / మిరాకిల్స్ కెప్పుడు కొదువ లేదు / ఎస్… కొదువ లేదు (2) / ఇశ్రాయేలు మధ్య ఎన్నో ఎన్నో వండర్స్ / వర్ణించుటకు మా వద్ద నో వర్డ్స్ (2) / ఎస్… నో వర్డ్స్ / లాలాలా… లలలల్ల లాలాలా (2) / పగలు మేఘమై ఆ… ఆ… ఆ.. నీడనిచ్చెను ఓ… ఓ… ఓ.. / అగ్ని స్తంభమై ఆ… ఆ… ఆ.. రాత్రి కాచెను ఓ… ఓ… ఓ.. / పగలు మేఘమై నీడనిచెను / అగ్ని స్తంభమై రాత్రి కాచెను ||మైటీ జీసస్|| / మధుర మన్నాతో ఆ… ఆ… ఆ.. పోషించెను ఓ… ఓ… ఓ.. / బండ చీల్చెను ఆ… ఆ… ఆ.. నీరు నిచ్చెను ఓ… ఓ… ఓ.. / మధుర మన్నాతో పోషించెను / బండ చీల్చెను నీరు నిచ్చెను ||మైటీ జీసస్||
మోకాళ్ళ అనుభవము నీకు ఉన్నదా / విసుగక ప్రార్ధించే మనసు ఉన్నదా (2) / వెలిగే దీపానికి నూనె అవసరం / నీ ఆత్మా దీపానికి ప్రార్ధనవసరం (2) / నూనె లేని దీపము ఆరిపోవును / ప్రార్ధించలేని జీవితము పతనమవ్వును (2) ||మోకాళ్ళ|| / శోధనలో పడకుండా ప్రార్ధించుము / శోధన తప్పించుటకు ప్రార్ధించుము (2) / కన్నీటితో ప్రార్ధించిన హిజ్కియాను చూడుము (2) / మరణము తప్పించబడి ఆయుష్షు నొందెను (2) ||మోకాళ్ళ|| / ప్రతి నిమిషమందు మనము ప్రార్ధించగలిగినా / పరలోక సంతోషం దేవుడిచ్చును (2) / పట్టుదలతో ప్రార్ధించిన ఏలీయాను చూడుము (2) / ఆకాశ జలములను మూసివేసెను (2) ||మోకాళ్ళ|| / అడుగుడి మీకివ్వబడును తట్టుడి మీకు తీయబడును / అన్నాడు మన యేసు అడిగి చూడుము (2) / సకల ఐశ్వర్యములకు కర్త అయిన దేవుడు (2) / అడిగిన వారందరికి తప్పక దయచేయును (2) ||మోకాళ్ళ||
మోయలేని భారమంత సిలువలో మోసావు / నీకు నాకు దూరమంత కల్వరిలో నడిచావు (2) / అంతులేని నీదు ప్రేమకు ఋజువు చూపావు / మధురమయిన నీ సన్నిధికి దారి వేశావు / నాదు గతిని మార్చావు – (2) / కడలి పై నడిచిన పాదాలు / సిలువ బరువుకు తడబడి పోయే / స్వస్థతలు చూపిన హస్తములు / సిలువలో శీలలతో వ్రేళాడే (2) / ఇంత ఘోరము మోపిన నేరము / నేను చేసిన పాప భారము (2) || మోయలేని || / జయము నీకని పలికిన జనము / మహిమ ఏదని నిను నిలదీసిరి / పాపములు క్షమియించిన నిన్ను / పాపివని పలుమారులు తెలిపిరి (2) / తాకినంతనే మహిమ నొసగిన / నీదు వస్త్రము చీట్ల పరము (2) || మోయలేని || / దైవ సుతుడవు అయినా గాని / దొంగలతో దోషిగా నిను చేర్చిరి / మధుర వాక్యము నేర్పిన నోటికి / చేదు చిరకతో దాహము తీర్చిరి (2) / ఇంత జరిగిన ఎంత కరుణ / వదలవేమయ నీ క్షమాపణ (2) || మోయలేని ||
మోసితివా నా కొరకై సిలువ వేదనను / గొల్గొతా నీవు క్రీస్తుకై నిలచితి వేదనలో / సిలువలో రక్తము పాపికి రక్షణ విలువగు మోక్షమును / పాప క్షమాపణ పాపికి ముక్తి పరమ ప్రభుని గనుము ||మోసితివా|| / అమ్మా ఇదిగో నీ సుతుడు వ్రేళాడుచు పిలిచెన్ / ఏలీ ఏలీ లామా సబక్తానీ చే విడిచి / దాహము తీర్చను చేదు చిరకను అందించిరిగా / ముండ్ల మకుట నీ శిరముపై గృచ్చిరి యూదుల రాజని / హేళన చేసిరి గుద్దిరి ఉమిసిరి కొరడా దెబ్బలతో / దేవ నా దేవా ఏల నా చేయి విడనాడితివిలలో ||మోసితివా|| / తర తరాల ఈ లోకం – యుగయుగాల నీ నామం / తరగని వేదన నీకు సిలువ విజయమునకే / కల్వరి ధారా నాథా పాపికి ప్రాణ ప్రదాత / విలువగు రక్త ప్రదాత ఆశ్రిత రక్షణ రాజా / చిందిన రక్తము విలువగు ప్రాణము లోక విమోచనకే / అందదు ఊహకు అంతము ఎప్పుడో సిద్ధపరచు ప్రభువా ||మోసితివా||