93 songs found
మారని దేవుడవు నీవేనయ్యా / మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2) / సుడులైనా సుడిగుండాలైనా – వ్యధలైనా వ్యాధి బాధలైనా / మరుగై ఉండలేదు నీకు యేసయ్యా (2) ||మారని|| / చిగురాకుల కొసల నుండి జారిపడే మంచులా / నిలకడలేని నా బ్రతుకును మార్చితివే (2) / మధురమైన నీ ప్రేమను నే మరువలేనయ్యా (2) / మరువని దేవుడవయ్యా మారని యేసయ్యా (2) ||మారని|| / నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగినా / నిత్య జీవ గమ్యానికి నను నడిపించితివే (2) / నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు (2) / నన్ను చూచినావయ్యా నన్ను కాచినావయ్యా (2) ||మరని||
మారా గయా సులీ పర్ / మేరా యీషు మసీహ్ (2) / మేరా యీషు మసీహ్ (2) / మారా గయా సులీ పర్ / మేరా యీషు మసీహ్ (2) / మేరా యీషు మసీహ్ ||మారా|| / యీషు సులీ చడా హై / మేరే గుణా కే ఖాతిర్ (2) / ఉస్నే దీ జాన్ అప్ నీ / మేరే గుణా కే ఖాతిర్ (2) / లాఖో మే ఏక్ హై వో / మేరా యీషు మసీహ్ (2) ||మారా|| / మేరే గుణావో కా భోజ్ / యీషు తూ నే లియా హై (2) / మేరే లియే సభీ దర్ద్ / యీషు తూ నే సహా హై (2) / ఏక్ నామ్ అనోఖా హై వో / మేరా యీషు మసీహ్ (2) ||మారా|| / యీషు తేరే లాహూ సే / ముజ్కో మిలీ హై ముక్తి (2) / పాపోన్ సే దూర్ కే రెహ్కర్ / ముజ్కో మిలీ హై శాంతి (2) / ముక్తి కా దాతా హై వో / మేరా యీషు మసీహ్ (2) ||మారా||
మారిన మనసులు మధురం మీకు / అర్పించెద నా హృదయం ఇప్పుడే మీకు (2) / ఇహ లోక కానుకలు అల్పములు మీకు / పరలోక ఫలములు ఇచ్చెద మీకు (2) ||మారిన|| / నా హృదయ కుసుమమును అప్పము చేసి / నా జీవన ప్రవాహమును రసముగ మార్చి (2) / సమర్పింతు దేవా నా సర్వస్వమును / కరుణతో చేకొనుము ఓ నా దేవా (2) ||మారిన|| / నా జయము అపజయము నీవే దేవా / నా సుఖ దుఃఖములన్నియు నీవే కావా (2) / సమర్పింతు దేవా నా సర్వస్వమును / కరుణతో చేకొనుము ఓ నా దేవా (2) ||మారిన||
మారిపోయెనే నా పాపపు మనసు – సిలువలో నిన్ను చూడ / కరిగిపోయెనే నా కఠిన హృదయం – కలువరిలో నిన్ను చేర / యేసయ్యా యేసయ్యా… నీ ప్రేమ నాకు చాలయ్యా (2) ||మారిపోయెనే|| / సొగసైన నీ మోము ఉమ్ములతో నిండిపోయెనా / దుర్మార్గపు కొరడాలు నీ వీపుపై నాట్యమాడెనా (2) / పరిశుద్ధ దేహం మాంసపు ముద్దాయెనా / విసుకలేదయ్యా నాకై విసికి పోలేదయ్యా / ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా / ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా ||మారిపోయెనే|| / యెరూషలేము పుర వీధులు రక్తముతో తడిసిపోయెనా / స్వచ్చమైన నీ రూపం సిలువలో నలిగిపోయెనా (2) / యూదా కొదమ సింహం గొర్రెలా మౌని ఆయేనా / తెరువలేదయ్యా నీవు నోరు మెదపలేదయ్యా / ఎందుకింత ప్రేమ నా పైన యేసయ్యా / ఎందుకింత త్యాగం నా కొరకు యేసయ్యా ||మారిపోయెనే||
మారిపోవాలి ఈ లోకమంతా / చేరరావాలి ప్రభుయేసు చెంత (2) / మంచి మనలోన పెంచాలి ఎప్పుడూ (2) / పంచుకోవాలి పరవారితో ||మారిపోవాలి|| / మనము వెలగాలి ఒక దివ్య వెలుగై (2) / వెలిగించాలి ఈ జగతినంతా (2) / కదలి రావాలి కరుణంత మనలో (2) / కరిగిపోవాలి కఠినాత్ములంతా (2) ||మారిపోవాలి|| / మనము బ్రతకాలి విలువైన బ్రతుకు (2) / బ్రతికించాలి ప్రభుయేసు బోధ (2) / ఆదుకోవాలి నర జాతినంతా (2) / అందించాలి ప్రభు వాక్యమెంతో (2) ||మారిపోవాలి|| / మనము నిలవాలి మాదిరిగా ఎప్పుడూ (2) / మహిమ పొందాలి ప్రభు యేసు అప్పుడూ (2) / వినిపించాలి మన సాక్ష్యమంతా (2) / కదిలించాలి హృదయాలనంతా (2) ||మారిపోవాలి||
మార్గం సత్యం జీవం నీవే యేసు / సర్వం సకలం నీవే క్రీస్తు (2) / మా ఆధారం నీవేనయ్యా / మా అనుబంధం నీతోనేనయ్యా (2) / వధియింపబడిన ఓ గొర్రెపిల్ల / ప్రభువైన మా యేసువా / మా స్తుతి స్తోత్రముల్ నీకే / మహిమా ప్రభావముల్ నీకే (2) ||మార్గం|| / పరమును విడిచావు మాకై / నరునిగా పుట్టావు ధరపై (2) / ఆహా నీదెంత ప్రేమ / ఎవరికైనా వర్ణింప తరమా (2) ||వధియింప|| / కలువరిలో రక్తమును కార్చి / విలువగు ప్రాణమును ఇచ్చి (2) / తెచ్చావు భువికి రక్షణ / ఇచ్చావు పాప క్షమాపణ (2) ||వధియింప||
మార్గము చూపుము ఇంటికి – నా తండ్రి ఇంటికి / మాధుర్య ప్రేమా ప్రపంచమో – చూపించు కంటికి (2) / పాప మమతల చేత – పారిపోయిన నాకు / ప్రాప్తించె క్షామము / పశ్చాత్తాప్పమునొంది – తండ్రి క్షమ కోరుచు / పంపుము క్షేమము (2) / ప్రభు నీదు సిలువ – ముఖము చెల్లని నాకు / పుట్టించె ధైర్యము (2) ||మార్గము|| / ధనమే సర్వంబనుచు- సుఖమే స్వర్గంబనుచు / తండ్రిని వీడితి / ధరణి భోగములెల్ల – బ్రతుకు ధ్వంసము జేయ / దేహీ నిను చేరితి (2) / దేహీ అని నీ వైపు – చేతులెత్తిన నాకు / దారిని జూపుము (2) ||మార్గము|| / దూర దేశములోన – బాగుందుననుకొనుచు / తప్పితి మార్గము / తరలిపోయిరి నేను – నమ్మిన హితులెల్ల / తరిమే దారిద్య్రము (2) / దాక్షిణ్య మూర్తి నీ – దయ నాపై కురిపించి / ధన్యుని చేయుము (2) ||మార్గము|| / అమ్ముకొంటిని నేను – అధముడొకనికి నాడు / ఆకలి బాధలో / అన్యాయమయిపోయే – పందులు సహ వెలివేయ / అలవడెను వేదన (2) / అడుగంటె అవినీతి – మేల్కొనియె మానవత / ఆశ్రయము గూర్చుము (2) ||మార్గము|| / కొడుకునే కాదనుచు – గృహమే చెరసాలనుచు / కోపించి వెళ్ళితి / కూలివానిగనైన – నీ యింట పని చేసి / కనికరమే కోరుదు (2) / కాదనకు నా తండ్రి – దిక్కెవ్వరును లేరు / క్షమియించి బ్రోవుము (2) ||మార్గము|| / నా తండ్రి నను జూచి – పరుగిడిచూ ఏతెంచి / నాపైబడి ఏడ్చెను / నవ జీవమును గూర్చి – ఇంటికి తోడ్కొని వెళ్లి / నన్నూ దీవించెను (2) / నా జీవిత కథయంత – యేసు ప్రేమకు ధరలో / సాక్ష్యమై యుండును (2) ||మార్గము||
మార్గము నీవని – గమ్యము నీవని – (2) / నమ్మితి గనుక ఓ యేసు నాథా / సుగమమాయెనే జీవ యాత్ర / ప్రాణము నీవని – దేహము నీదని – (2) / నమ్మితి గనుక ఓ యేసు నాథా / చైతన్యమొందెనే జీవ యాత్ర / బాధల బరువులో – నిత్య నిరాశలో / శోధన వేళలో సత్య సాక్ష్యమునీయగా (2) / శాంతము నీవని – స్వస్థత నీవని (2) / నమ్మితి గనుక ఓ యేసు నాథా / ఆనందమాయెనే జీవ యాత్ర ||మార్గము|| / ప్రార్థన వేళలో – ఆద్రత మీరగా / గొంతు మూగదై – భక్తి కన్నుల జాలగా (2) / ధాత్రము నీవని – స్తోత్రము నీవని (2) / నమ్మితి గనుక ఓ యేసు నాథా / సంగీతమాయెనే జీవ యాత్ర ||మార్గము||
మార్గములను సృజించువాడు – జీవితాలను వెలిగించువాడు / బ్రతుకు నావ నడిపించువాడు – యెహోవాయే నాకుండగా (2) / నేను సాధించలేనిది లేనే లేదు – జయించలేనిది లేనే లేదు / అసాధ్యమైనది లేనే లేదు – విజయమెప్పుడూ నాదే (2) / ఎన్ని ఇక్కట్లు నాకెదురైననూ / జలములు నాపైకి లేచిననూ (2) / సంకెళ్లు నను బిగదీసిననూ / శత్రు గోడలు అడ్డుగా నిలచిననూ (2) ||నేను|| / జీవితమంతా శూన్యమైననూ / బంధువులందరు నను విడచిననూ (2) / వ్యాధులెన్నో నను చుట్టిననూ / అడ్డంకులెన్నో నాకెదురైననూ (2) ||నేను||
మార్పుచెందవా నీవు మర్పుచెందవా / నీ బ్రతుకు మార్చుకోవా (2) / అనుకూల సమయం ఇదియేనని ఎరిగి / మారు మనసునూ పొందవా (2) / ఎన్నాళ్ళు నీవు జీవించినాగాని / ఏమున్నది ఈ లోకంలో / ఇన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికి / తీర్పున్నది పై లోకంలో (2) / తీర్పు దినమునందున ఆయన ముందు నీవు / నిలిచే ధైర్యం నీకుందా (2) / నిలిచే ధైర్యం నీకుందా ||మార్పుచెందవా|| / దిగంబరిగానే వచ్చావు నీవు / దిగంబరిగా పోతావు / మన్నైన నీవు మన్నై పోతావు / ఏదో ఒక దినమందున (2) / నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు / నీవెంట రావెన్నడు (2) / నీవెంట రావెన్నడు ||మార్పుచెందవా|| / ఆత్మని కాక దేహాన్ని చంపే / మనుషులకే భయపడకయ్యా / ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే / దేవునికే భయపడవయ్యా (2) / దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకే చేరు / నీకంటూ ఏముందిలే (2) / నీకంటూ ఏముందిలే ||మార్పుచెందవా||
మార్పులేని తండ్రివి నీవే / చేయి వీడని స్నేహితుడవు నీవే (2) / వాక్యమై నను నడిపించే / ఆత్మయై నను ఓదార్చే (2) / యెహోవా రఫా యెహోవా యీరే / యెహోవా షాలోమ్ యెహోవా నిస్సీ / యెహోవా షమ్మా ఎలోహిం యావే / ఆకాశము భూమియు / గతియించినా గతియించనీ (2) / మారని నీ వాక్యమే / నను నడుపును సదా / మారని నీ మాటలే / నను నిలుపును సదా ||యెహోవా|| / వాగ్ధానము నెరవేర్చుచు / నా రక్షణకరుడైతివి (2) / తండ్రి అని పిలిచినా / పలికెడి ప్రేమా (2) ||యెహోవా||
యేసువా.. యేసువా.. / యేసువా నా యేసువా (2) / మీ జ్ఞాపకార్థముగా భుజించుచున్నాము / మీ దివ్య దేహమును / తమ ఆజ్ఞానుసారముగా పానము చేసెదము / మీ తీరు రుధిరమును ||యేసువా|| / ఆనాడు మీ దేహమును హింసించి చంపితిమి (2) / ఈనాడు ఆ దేహమే మేము గాచుచుండెనుగా (2) / మేము గాచుచుండెనుగా ||యేసువా|| / ఆనాడు మీ రక్తమును చిందింప చేసితిమి (2) / ఈనాడు ఆ రక్తమే మేము శుద్ధి పరచెనుగా (2) / మేము శుద్ధి పరచెనుగా ||యేసువా|| / మా పాప భారమును సిలువగ మోసితివి (2) / మార్గము చూపితివి రక్షణ నొసగితివి (2) / రక్షణ నొసగితివి ||యేసువా||