340 songs found
నా తల్లి నను మరచినా / నా వారే నను విడచినా (2) / విడువని దేవుడవయ్యా / ఎడబాయని వాడవయ్యా (2) / యేసయ్యా హల్లెలూయా (4) ||నా తల్లి|| / స్నేహితులే నన్ను బాధించినా / బంధువులే నన్ను వెలివేసినా (2) / అన్నదమ్ములే నన్ను నిందించినా / నే నమ్మినవారే గాయపరచినా (2) ||విడువని|| / లోకమంతా నన్ను ఏడ్పించినా / శత్రువులే నన్ను వేధించినా (2) / సాతానే నన్ను శోధించినా / సమాజమే నన్ను త్రోసేసినా (2) ||విడువని||
నా తోడు.. నీవే దేవా – నా బలము.. నీవే ప్రభువా / నా ధైర్యం.. నీవే దేవా – నా సర్వం.. నీవే ప్రభువా / కాపాడే దైవం నీవేగా – కనుపాపగ నన్ను కాచేగా / నీ దయలో.. నీ కృపలో.. నీ ఒడిలో.. నన్నిలలో / నాలో కన్నీరే నీ వైపే చూడగా / నీవే యేసయ్య సంతోషం నింపగా / నిట్టూర్పు లోయలలో – గాఢాంధకారములో / నీవే నా అండగా నన్ను బలపరచగా / నడిపించే వాక్యం నీవైతివే / కరుణించే దైవం నీవైతివే ||నీ దయలో|| / ఎన్నో కలతలే నా మదిలో నిండగా / నీవే యేసయ్య నా వెంటే ఉండగా / నా భయమును తొలగించి – విశ్వాసము కలిగించి / నీవే నా అండగా నన్ను స్థిరపరచగా / నీవుంటే చాలు నా యేసయ్యా / నీ ప్రేమే నాకు చూపావయ్యా ||నీ దయలో||
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు / సుడిగాలిలోనైనా జడి వానలోనైనా / ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము / నీవు వెలిగించిన దీపము – (2) / ఆరని దీపమై దేదీప్యమానమై / నా హృదయ కోవెలపై దీపాల తోరణమై (2) / చేసావు పండుగ వెలిగావు నిండుగా (2) ||నా దీపము|| / మారని నీ కృప నను వీడనన్నది / మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది (2) / మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా (2) ||నా దీపము|| / ఆగని హోరులో ఆరిన నేలపై / నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై (2) / పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా (2) ||నా దీపము||
నా దేవ ప్రభువా నీ చెంతను / సదా వసింపను నా కిష్టము / ఏవైనా శ్రమలు తటస్థమైనను / నీ చెంత నుందును నా ప్రభువా / ప్రయాణకుండను నడవిలో / నా త్రోవ జీకటి కమ్మినను / నిద్రించుచుండగా స్వప్నంబునందున / నీ చెంత నుందును నా ప్రభువా / యాకోబు రీతిగా ఆ మెట్లను / స్వర్గంబు జేరను జూడనిమ్ము / నీ దివ్య రూపము ప్రోత్సాహపర్చగా / నీ చెంత నుందును నా ప్రభువా / నే నిద్రలేవగా నా తండ్రి నే / నీకుం గృతజ్ఞత జెల్లింతును / నే చావునొందగా ఇదే నా కోరిక / నీ చెంత నుందును నా ప్రభువా
నా దేవా నీకే వందనం / నా ప్రభువా స్తుతులూ నీకేనయా (2) / సకలాశీర్వాదముకు కారణభూతుడవు / ఆది సంభూతుడవూ (2) / హల్లెలూయా హల్లెలూయా / హల్లెలూయా హల్లెలూయా (2) / కౌగిటిలో నన్ దాచును / కను రెప్పవలె కాచును (2) ||హల్లెలూయా|| / చింతలన్ని బాపును / బాధలన్ని తీర్చును (2) ||హల్లెలూయా||
నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నా / నా యేసయ్యను నేను ప్రేమిస్తున్నా (2) / రాసాను నేనొక లేఖని / పంపాను నేనొక పాటని (2) ||నా దేవుణ్ణి|| / నిను చూడక నాకు నిదుర ఏది / నీ స్వరము వినక నేనుంటినా (2) ||నా దేవుణ్ణి|| / నీ సేవకై నన్ను ఏర్పరచావు / నీ కొరకు మరణించే ప్రాణం ఉంది (2) ||నా దేవుణ్ణి||
నా దేవుని కృపవలన / సమస్తము సమకూడి జరుగును (2) / నాకు లేమి లేనే లేదు / అపాయమేమియు రానే రాదు (2) ||నా దేవుని|| / కరువులో కష్టాలలో / ఆయనే నన్ను బలపరుచును (2) / ఆయనే నన్ను బలపరుచును / ఆయనే నన్ను ఘనపరుచును (2) ||నా దేవుని|| / శ్రమలలో శోధనలో / ఆయనే నాకు ఆశ్రయము (2) / ఆయనే నాకు ఆశ్రయము / ఆయనే నాకు అతిశయము (2) ||నా దేవుని|| / ఇరుకులో ఇబ్బందిలో / ఆయనే నన్ను విడిపించును (2) / ఆయనే నన్ను విడిపించును / ఆయనే నన్ను నడిపించును (2) ||నా దేవుని||
నా దేవుని గుడారములో – నా యేసుని నివాసములో (2) / ఎంతో సంతోషం – ఎంతో ఆనందం (2) / నా యేసుని నివాసములో (2) ||నా దేవుని|| / సీయోను మార్గములందు – సహాయకుడవు నీవే కదా / రాత్రి జాముల యందు- నా తోడు నీడవు నీవే కదా (2) / నా కొండ నీవేగా – నా కోట నీవేగా (2) / నా యేసు రక్షకా నీవే కదా (2) ||నా దేవుని|| / నా యేసు సన్నిధి యందు – నేను పరవశమొందెదను / నా యేసు స్వరమును వినుచు – నేను కాలము మరచెదను (2) / నా గానమాయెనే – నా ధ్యానమాయెనే (2) / నాదు స్వరము నా ప్రభువే (2) ||నా దేవుని|| / ఆనంద తైలము నందు – నన్ను అభిషేకించెనుగా / నాదు వస్త్రము నందు – అగరు వాసన నింపెనుగా (2) / నా ప్రాణ నాథుడా – నా ప్రేమ పాత్రుడా (2) / నా యేసు నాథుడా నీవే కదా (2) ||నా దేవుని||
నా దేహమును నీ ఆలయముగా నిర్మించి నివసించుము / నే సమర్పింతును నీకు నా దేహము సజీవయాగముగా ప్రభు / యేసు నాలో నీవు ఉంటే – నీ సంపదలు నా సొంతమే / యేసు నీలో నేను ఉంటే – నా బ్రతుకంతా సంతోషమే ||నా దేహమును|| / నాలో నీ సన్నిధి ఉందని / గ్రహియించు జ్ఞానమును కలిగుంచుము / నా దేహమును భయముతో భక్తితో / నీ కొరకు పరిశుద్ధముగా దాచెద / ఈ లోకములో జనముల ఎదుట మాదిరిగా జీవింతును / నా దేహముతో నీ నామమును ఘనపరతును నిత్యము ||నా దేహమును|| / నీ జీవ ప్రవాహము ప్రవహించనీ / నాలోని అణువణువు చిగురించును / ఫలియించు ద్రాక్షావల్లి వలె నేను / విస్తారముగా దేవా ఫలియింతును / నా దీవెనగా నీవు ఉంటే నాకేమైనా కొదువుండునా / ఈ లోకముకు నన్ను నీవు దీవెనగా మార్చు ప్రభు ||నా దేహమును||
నా నాథుడా నా యుల్లమిచ్చితి నీకు (2) / అన్నియు నీకై వీడి – నిన్నే వెంబడించితిని (2) / పెన్నుగ నాలో నాటుమా (2) ప్రేమన్ ||నా నాథుడా|| / దేవాలయ విగ్రహముల్ – దేవతలు వేయిలక్షల్ (2) / యావత్తు పెంటయనుచు (2) నిదిగో ||నా నాథుడా|| / ఆదియంత రహితుడ – ఆత్మల నాయకుడా (2) / ఆశ కల్గించు నాలోన (2) నీవే ||నా నాథుడా|| / పరిశుద్ధ యవతరుడా – మరియు తేనె అమృతుడా (2) / కరుణతో నన్ను గావుమా (2) యిప్పుడు ||నా నాథుడా|| / భూతలమునకు వేంచేసి – పాతకుల ప్రేమించితివి (2) / పాతకుడ నేనైతిని (2) మహా ||నా నాథుడా|| / ఆద్యంతము లేనట్టి – బీదలకు ధన నిధీ (2) / సదయుడా నన్ను చూడుమా (2) యిపుడు ||నా నాథుడా|| / హల్లెలూయ గీతమును – ఎల్లెడల చాటించెదను (2) / ఉల్లమందానంద ధ్వని (2) యిదియే ||నా నాథుడా||
నా నాన్న యింటికి నేను వెళ్ళాలి / నా తండ్రి యేసుని నేను చూడాలి (2) / నా నాన్న యింటిలో ఆదరణ ఉన్నది / నా నాన్న యింటిలో సంతోషం ఉన్నది / నా నాన్న యింటిలో నాట్యమున్నది ||నా నాన్న|| / మగ్ధలేని మరియలాగా (2) / నీ పాదాలు చేరెదను (2) / కన్నీటితో నేను కడిగెదను (2) / తల వెంట్రుకలతో తుడిచెదను (2) ||నా నాన్న|| / బేతనీయ మరియలాగా / నీ సన్నిధి చేరెదను (2) / నీ వాక్యమును నేను ధ్యానింతును (2) / ఎడతెగక నీ సన్నిధి చేరెదను (2) ||నా నాన్న|| / నీ దివ్య సన్నిధి నాకు / మధురముగా ఉన్నదయ్యా (2) / పరలోక ఆనందం పొందెదను (2) / ఈ లోకమును నేను మరిచెదను (2) ||నా నాన్న||
నా నీతి నీవే నా ఖ్యాతి నీవే / నా దైవమా యేసయ్యా / నా క్రియలు కాదు నీ కృపయే దేవా / నా ప్రాణమా యేసయ్యా / నదులంత తైలం విస్తార బలులు / నీకిచ్చినా చాలవయ్యా / నీ జీవితాన్నే నాకిచ్చినావు / నీకే నా జీవమయ్యా / హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ (4) ||నా నీతి|| / నా దీన స్థితిని గమనించి నీవు / దాసునిగ వచ్చావుగా / నా దోష శిక్ష భరియించి నీవు / నను నీలో దాచావుగా / ఏమంత ప్రేమ నా మీద నీకు / నీ ప్రాణమిచ్చావుగా / నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను / యజమానుడవు నీవేగా ||హల్లెలూయ|| / నా ప్రియులే నన్ను వెలివేసినప్పుడు / నీవు చేరదీసావుగా / నా ప్రక్క నిలిచి నను ధైర్యపరచి / కన్నీరు తుడిచావుగా / నేనున్న నీకు భయమేలనంటూ / ఓదార్పునిచ్చావుగా / చాలయ్య దేవ నీ కృపయే నాకు / బ్రతుకంతయు పండుగా ||హల్లెలూయ|| / ఆ ఊభిలోనా నే చిక్కినప్పుడు / నీవు నన్ను చూసావుగా / నీ చేయి చాపి నను పైకి లేపి / నీ వాక్కునిచ్చావుగా / నా సంకటములు నా ఋణపు గిరులు / అన్నిటిని తీర్చావుగా / నీలోన నాకు నవ జీవమిచ్చి / నీ సాక్షిగా నిలిపావుగా ||హల్లెలూయ||