340 songs found
నేనంటే నీకెందుకో ఈ ప్రేమా / నన్ను మరచి పొవెందుకు (2) / నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా / నన్ను విడిచిపోవెందుకు / కష్టాలలో నష్టాలలో / వ్యాధులలో బాధలలో / కన్నీళ్ళలో కడగండ్లలో / వేదనలో శోధనలో / నా ప్రాణమైనావు నీవు / ప్రాణమా.. నా ప్రాణమా – (2) ||నేనంటే|| / నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు / నిన్ను వీడిపోయినా – నన్ను వీడిపోలేవు (2) / ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4) / ఏ ఋణమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి / తాళలేను నీ ప్రేమను ||నేనంటే|| / ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు / మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2) / ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4) / ఏ బలమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి / తాళలేను నీ ప్రేమను ||నేనంటే||
నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా – (2) / నేను ఓడిపోనయా – నా పక్షానుండగా / నేను కృంగిపోనయా – నీవు నా తోడుండగా (2) / నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా (2) / నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా (2) ||నేను ఓడిపోనయా|| / అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే / వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే (2) / ఖ్యాతినిచ్చి ఘనతా నిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) / శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా|| / నిందలన్ని పొందిన చోటే ఘనతనిచ్చినావే / నా శత్రువులేదుటే నాకు విందు చేసినావే (2) / ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) / శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా|| / నన్ను చూచి నవ్వినచోటే నా తలపైకెత్తినావే / నన్ను దూషించిన చోటే దీవించినావే (2) / ఖ్యాతినిచ్చి ఘనతానిచ్చి మంచి పేరు నాకిచ్చావే (2) / శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే ||నేను ఓడిపోనయా||
నేను కూడా ఉన్నానయ్యా / నన్ను వాడుకో యేసయ్యా (2) / పనికిరాని పాత్రనని / నను పారవేయకు యేసయ్యా (2) / జ్ఞానమేమి లేదుగాని / నీ సేవ చేయ ఆశ ఉన్నది (2) / నీవే నా జ్ఞానమని (2) / నీ సేవ చేయ వచ్చినానయ్య (2) ||నేను|| / ఘనతలొద్దు మెప్పులొద్దు / ధనము నాకు వద్దే వద్దు (2) / నీవే నాకు ఉంటే చాలు (2) / నా బ్రతుకులోన ఎంతో మేలు (2) ||నేను|| / రాళ్లతో నన్ను కొట్టిన గాని / రక్తము కారిన మరువలేనయ్యా (2) / ఊపిరి నాలో ఉన్నంత వరకు (2) / నీ సేవలో నేను సాగిపోదునయా (2) ||నేను|| / మోషే యెహోషువాను పిలిచావు / ఏలీయా ఎలీషాను నిలిపావు (2) / పేతురు యోహాను యాకోబులను (2) / అభిషేకించి వాడుకున్నావు (2) ||నేను||
నేను తగ్గాలి యేసు – నీవే హెచ్చాలి (2) / నేను పూర్తిగా మరుగై – నీవే కనబడాలి (2) / ఇదియే నా ప్రార్థన – నీ చిత్తము (2) ||నేను|| / నేను యేసుతో కూడా సిలువ వేయబడాలి (2) / నా స్వార్ధ్య జీవితమంతా లయమైపోవాలి (2) / యేసూ నీ స్వభావము నాలో అధికమౌతు ఉండాలి (2) / పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి (2) ||ఇదియే|| / ఆదాము పాపము నాలో వసియించియుండగా (2) / యేసూ నీ రక్తమే దాని నశియింప చేయును (2) / ఆటంకమేమియు లేక జీవధారలుండాలి (2) / యేసూ నీ జీవము నాలో నింపబడుతు పోవాలి (2) ||ఇదియే||
నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు / నేను స్తుతిస్తే నా ప్రార్థనాలకిస్తారు / నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు / ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే|| / నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు / అల కరుణతో నన్ను నడిపిస్తారు (2) / శక్తినిస్తారు నాకు సౌఖ్యమిస్తారు / ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే|| / నన్ను వెంబడించమని యేసు పిలిచారు / తానే వెలుగై నాకు మార్గమయ్యారు (2) / కాంతినిచ్చి నాకు శాంతినిస్తున్నారు / ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది – (2) ||నేను పిలిస్తే||
నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును / శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను (2) ||నేను|| / కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున (2) / గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు / హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2) / జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు (2) / అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు / హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2) / విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు (2) / సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు / హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ (2) ||నేను||
నేనునూ నా ఇంటి వారును / యెహోవాను సేవించెదము / ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2) / సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని ||నేనునూ|| / శ్రమలో శోధనలో మరణ బంధకంలో / శాంతి సమాధానం దయచేసి దేవుడు (2) / ఆశా నిరాశలలో ఆవేదన వలయంలో (2) / ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2) ||నేనునూ|| / ఏ పాపము నన్ను ఏలనీయని వాడు / ఏ అపాయమును రాకుండా కాపాడును (2) / కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు (2) / నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు (2) ||నేనునూ|| / దీర్ఘాయువు చేత దీవించు దేవుడు / దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును (2) / మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు (2) / మేలు చేత కీడునెలా జయించాలో నేర్పును (2) ||నేనునూ||
పాపానికి నాకు ఏ సంబంధము లేదు / పాపానికి నాపై ఏ అధికారము లేదు / పాపానికి నాకు ఏ సంబంధము లేదు / పాపానికి నాపై ఏ అజమాయిషీ లేదు / నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించివేసాడుగా / మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాట ఇచ్చాడుగా / నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింద / నే లేను నే లేను ధర్మ శాస్త్రం క్రింద (2) ||పాపానికి|| / కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు / కృప ఉందని నీతిని విడువొచ్చా – అట్లనరాదు / కృప ఉందని పాపం చేయొచ్చా – అట్లనరాదు / కృప ఉందని నీతిని విడువొచ్చా – నో / కృప అంటే లైసెన్స్ కాదు / కృప అంటే ఫ్రీ పాస్ కాదు – పాపాన్ని చేసేందుకు / కృప అంటే దేవుని శక్తి / కృప అంటే దేవుని నీతి – పాపాన్ని గెలిచేందుకు / గ్రేస్ ఈస్ నాట్ ఎ లైసెన్స్ టు సిన్ / ఈస్ ఎ పవర్ ఆఫ్ గాడ్ టు ఓవర్ కం (4) ||నేనున్నా|| / కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా / కృప వలన క్రీస్తులో స్వాతంత్య్రం – నే పొందితినయ్యా / కృప ద్వారా ధర్మ శాస్త్రముకు – మృతుడను అయ్యా / కృప వలెనే క్రీస్తులో స్వాతంత్య్రం / క్రియల మూలముగా కాదు / కృపయే నను రక్షించినది – నా భారం తొలగించినది / కృప నను మార్చేసినది / నీతి సద్భక్తుల తోడ – బ్రతుకమని బోధించినది / గ్రేస్ టుక్ అవే బర్డెన్ ఫ్రమ్ మి / అండ్ టాట్ టు మి లివ్ రైటియస్లీ (4) ||నేనున్నా|| / పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా / కృప వలెనె ఇది నాకు సాధ్యం – అయ్యిందిరా భయ్యా / పాపానికి మృతుడను నేనయ్యా – హల్లెలూయా / కృప వలెనె ఇది నాకు సాధ్యం / కృపను రుచి చూచిన నేను / దేవునికే లోబడుతాను – పాపానికి చోటివ్వను / పరిశుద్ధత పొందిన నేను / నీతి సాధనములుగానే – దేహం ప్రభుకర్పింతును / యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్ / యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ (2) / యీల్డ్ యువర్ బాడీస్ అంటు ద లార్డ్ / యాస్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రైటియస్నెస్ (2) ||నేనున్నా|| / ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు / ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – అట్లనరాదు / ధర్మశాస్త్రం పాపం అయ్యిందా – అట్లనరాదు / ధర్మశాస్త్రం వ్యర్థం అయ్యిందా – నో / ధర్మశాస్త్రం కొంత కాలమేగా / ధర్మశాస్త్రం బాలశిక్షయేగా – ప్రభు నొద్దకు నడిపేందుకు / క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా / ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా – మనలను విడిపించేందుకు / లా హాస్ లెడ్ ది పీపుల్ టు క్రైస్ట్ / నౌ గ్రేస్ విల్ మేక్ హిస్ కాన్క్వరర్స్ (4) ||నేనున్నా||
నేనెరుగుదును ఒక స్నేహితుని / అతడెంతో పరిశుద్ధుడు / ఆ పరిశుద్ధుడే నా జీవన రక్షణ / కారణ భూతుడు (2) / అతడే యేసుడు… అతడే యేసుడు (2) ||నేనెరుగుదును|| / చీకటి దారులలో – చితికిన బ్రతుకులకు (2) / వెలుగు కలుగజేసే – జీవ జ్యోతి యేసే (2) ||నేనెరుగుదును|| / చెరిగిన మనసులతో – చెదరిన మనుజులకు (2) / శాంతి కలుగజేసే – శక్తిమంతుడేసే (2) ||నేనెరుగుదును||
నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2) / నిత్యము నా కీర్తి నా నోట నుండును (2) / మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా / చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2) ||నేనెల్లప్పుడు|| / కలిమి చేజారి నను వంచినా / స్థితిని తలకిందులే చేసినా (2) / రెండింతలుగా దయచేసెదవని (2) / నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| / పరుల ఎగతాళి శృతి మించినా / కలవరము గుండెనే పిండినా (2) / నా మొఱ విని కృప చూపెదవని (2) / నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా|| / శ్రమలు చెలరేగి బెదిరించినా / ఎముకలకు చేటునే తెచ్చినా (2) / ఆపదలలో విడిపించెదవని (2) / నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను / నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను (2) / నేనేమైయున్నానో నీ దయ వలనేనయ్యా (2) / నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా (2) ||నేనేమైనా|| / లేక లేక వృద్ధాప్యమందు / ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2) / ఇచ్చిన నీవే బలి కోరగా (2) / తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా ||నేనేమైనా|| / సర్వము పోయి శరీరము కుళ్ళిన / నా అనువారే వెలివేసినా (2) / ఆప్తులంతా శత్రువులైనా (2) / అంతము వరకు సహియించిన ఆ యోబులా ||నేనేమైనా|| / నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే / చావైనా అది నాకెంతో మేలే (2) / ఇదిగో నేను ఉన్నానయ్యా (2) / దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా ||నేనేమైనా||
నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా / మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా (2) / వేదన బాధలలో కృంగిన సమయములో / నీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావు / చీకటి తొలగించి మహిమతో నింపినావు / పరిశుద్ధాత్మతో అభిషేకించి నను విమోచించినావు ||నేస్తమా||