71 songs found
దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసా / నీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి (2) / అవసరాలకు దేవుని నమ్మక / ఆత్మకు తండ్రని నమ్మాలి (2) / నీ ఆత్మకు తండ్రని నమ్మాలి ||దేవుడు|| / నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక / నలు దిక్కులకు సువార్తను ప్రకటించు (2) / ప్రభువా ప్రభువని పిలువక – ప్రార్ధనతో విసిగించక / పాపిని రక్షించు పరలోకానికి నడిపించు / నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడు / నా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు ||దేవుడు|| / నామకార్ధ భక్తి దేవునికే అది విరక్తి / సువార్త భారం కలిగి నీవు బ్రతికితేనే ముక్తి (2) / ప్రజలందరికి ఇదే బైబిల్ సూక్తి (2) / దేవుని చేయి వెతకకుంటే అగ్నితోనే శాస్తి (2) / దేవునికిష్టమైనది తెలుసుకోవాలి ముందు / దేహానికిష్టమైనది అడగకూడదు ముందు ||దేవుడు||
దేవుడు మనకు ఎల్లప్పుడు (2) / తోడుగ నున్నాడు (3) / ఏదేనులో ఆదాముతో నుండెన్ (2) / హానోకు తోడనేగెను (2) / దీర్ఘ దర్శకులతో నుండెన్ (2) / ధన్యులు దేవుని గలవారు – తోడుగనున్నాడు / దైవాజ్ఞను శిరసావహించి (2) / దివ్యముగ నా బ్రాహాము (2) / కన్న కొమరుని ఖండించుటకు (2) / ఖడ్గము నెత్తిన యపుడు – తోడుగనున్నాడు / యోసేపు ద్వేషించ బడినపుడు (2) / గోతిలో త్రోయబడినపుడు (2) / శోధనలో చెరసాలయందు (2) / సింహాసనమెక్కిన యపుడు – తోడుగనున్నాడు / ఎర్ర సముద్రపు తీరమునందు (2) / ఫరో తరిమిన దినమందు (2) / యోర్దాను దాటిన దినమందు (2) / యెరికో కూలిన దినమందు – తోడుగనున్నాడు / దావీదు సింహము నెదిరించి (2) / ధైర్యాన చీల్చినయపుడు (2) / గొల్యాతును హతమార్చినయపుడు (2) / సౌలుచే తరుమబడినపుడు – తోడుగనున్నాడు / సింహపు బోనులో దానియేలు (2) / షద్రకు మేషా కబేద్నెగో (2) / అగ్ని గుండములో వేయబడెన్ (2) / నల్గురిగా కనబడినపుడు – తోడుగనున్నాడు / పౌలు బంధించబడినపుడు (2) / పేతురు చెరలో నున్నపుడు (2) / అపోస్తలులు విశ్వాసులు (2) / హింసించ బడినయపుడు – తోడుగనున్నాడు ||దేవుడు||
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను (2) / నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని (2) / ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను ।।దేవుడు।। / పరలోక ప్రేమ ఈ ధరలో / ప్రత్యక్షమాయె ప్రతివానికై (2) / ఆదియందున్న ఆ దేవుడు / ఏతెంచె నరుడై ఈ భువికి (2) / ఈ ప్రేమ నీ కొరకే – జన్మించే ఇల యేసు నీ కొరకే (2) ।।దేవుడు।। / పాపంధకారములో అంధులుగా / చీకటి త్రోవలో తిరుగాడగా (2) / జీవపు వెలుగైన ఆ ప్రభువు / వెలిగించగా వచ్చెను ప్రతి వారిని (2) / ఈ వెలుగు నీ కొరకే – యేసు నిన్నిల వెలిగించును (2) ।।దేవుడు।।
దేవుడే ఇల చేరేటందుకు ఎన్నుకున్న మార్గం / అమ్మా అంటూ పిలుచుకొని పొందుకొనెను జన్మం / నీకంటూ ఏది లేదన్నట్లు ఎందుకంత త్యాగం / కనరాని ప్రేమకు నీవేగా కదలాడుతున్న రూపం (2) / అమ్మా నీ ఋణమును తీర్చే సిరులు లేవు ఇలలో / ఆ దైవము సైతము నేర్చె పాఠాలు చల్లని నీ ఒడిలో (2) ||దేవుడే|| / కన్న బిడ్డను పరాయి బిడ్డగా పెంచుకున్న మమకారం / తన ప్రజల విముక్తికి దేవుడు చేసిన కార్యంలో సహకారం (2) / మోషేగా మారిన పసివాడిని / దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం (2) / దాసిగా పెంచిన కన్నతల్లి సుగుణం ||అమ్మా|| / సంతతి లేక సవతి పోరుతో విసిగినట్టి దీనత్వం / దేవుని సన్నిధి హృదయము పరచి పొందుకొనెను మాతృత్వం (2) / హన్నా చేసిన ఆ త్యాగమే కాదా / సమూయేలు పొందిన న్యాయాధిపత్యము (2) / సమూయేలు పొందిన న్యాయాధిపత్యము ||అమ్మా|| / కొన ఊపిరితో సిలువపైన వేళాడుతున్న క్షణము / ఆ దేవ దేవుడు తీర్చుకొనెను తన మాతృమూర్తి ఋణము (2) / ప్రియ శిష్యుని దరికి తల్లిని చేర్చి / నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం (2) / నెరవేర్చెను ఇలలో తనయుడిగా ధర్మం ||అమ్మా||
దేవుడే నాకాశ్రయంబు – దివ్యమైన దుర్గము / మహా వినోదు డాపదల – సహాయుడై నన్ బ్రోచును / అభయ మభయ మభయ మెప్పు / డానంద మానంద మానంద మౌగ ||దేవుడే|| / పర్వతములు కదిలిన నీ – యుర్వి మారు పడినను / సర్వమున్ ఘోషించుచు నీ – సంద్ర ముప్పొంగినన్ ||అభయ|| / దేవుడెప్డు తోడుగాగ – దేశము వర్ధిల్లును / ఆ తావు నందు ప్రజలు మిగుల – ధన్యులై వసింతురు ||అభయ|| / రాజ్యముల్ కంపించిన భూ – రాష్ట్రముల్ ఘోషించిన / పూజ్యుండౌ యెహోవా వైరి – బూని సంహరించును ||అభయ|| / విల్లు విరచు నాయన తెగ – బల్లెము నరకు నాయన / చెల్ల చెదర జేసి రిపుల – నెల్లద్రుంచు నాయనే ||అభయ|| / పిశాచి పూర్ణ బలము నాతో – బెనుగులాడ జడియును / నశించి శత్రు గణము దేవు – నాజ్ఞ వలన మడియును ||అభయ|| / కోటయు నాశ్రయమునై యా – కోబు దేవు డుండగా / ఏటి కింక వెరవ వలయు – నెప్డు నాకు బండుగ ||అభయ||
దేవుడొక నగరము మన కొరకై / సిద్ధపరచుచుండె నుండుటకై (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా (2) ||దేవుడొక|| / మేలిమి బంగారము అద్భుత నగరం / విలువైన రాళ్ళతో పునాది వేసెను (2) / రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| / నగర ప్రాకారములు ఎత్తైనవి / సూర్య కాంతములచే కట్టబడెను (2) / ప్రభువే విమోచించి అధికారమిచ్చెను (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| / ముత్యాల గుమ్మములు పండ్రెండు గలవు / పన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి (2) / పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| / ఆ నగర వీధులు మేలిమి బంగారం / ద్వారములు ఎప్పటికి మూయబడవు (2) / ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| / గొర్రెపిల్ల సింహాసన మచ్చటుండును / ఆయనే దీపము నాలయమై యుండును (2) / జీవగ్రంథమందున పేరులున్నవనుచు (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| / జయవంతుల కొరకే ఆ నగరం / పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు (2) / విజయుల మౌదము క్రీస్తుని రక్తముచే (2) / మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక||
దేవుని గొప్ప మహిమను చూసి తిరిగి పాపం చేసెదవా? / ద్వంద నీతికి నిష్కృతి లేదని నీకు తెలుసా ఓ క్రైస్తవా! (2) / ఎంత అధము అన్యుల కన్న, ఎంత ఘోరము ఆ యూద కన్న / వలదు పాపం ఇకపైనన్న, తిరిగి పొందు క్రీస్తులో మన్నా (2) / మరచినవా నీ అపజయములు / గుర్తు లేదా! ఆ శోధనలు / నీవు చూపిన ఆ వినయములు / ఏడ్చి చేసిన ఆ ప్రార్థనలు / తండ్రి నీవే దిక్కంటూ, మోకరిల్లిన ఆ క్షణము / అందుకొంటివి విజయములు, విడిచి పెడితివి వాక్యములు (2) ॥ఎంత॥ / అందుకొంటివి బాప్తిస్మమును / పొందు కొంటివి ఆ రక్షణను / వదలబోకు ఆత్మీయతను / చేరనివ్వకు నిర్లక్ష్యమును / తీర్పు తీర్చే సమయంలో ఓర్పు దొరకదు గుర్తెరుగు / నిత్య జీవం లో నుండి, ఘోర నరకం చేరెదవా? (2) ॥ఎంత॥
దేవుని ప్రేమ ఇదిగో – జనులార – భావంబునం దెలియరే / కేవలము నమ్ముకొనిన – పరలోక – జీవంబు మనకబ్బును ||దేవుని|| / సర్వలోకము మనలను – తన వాక్య – సత్యంబుతో జేసెను / సర్వోపకారుడుండే – మన మీద – జాలిపరుడై యుండెను ||దేవుని|| / మానవుల రక్షింపను – దేవుండు – తన కుమారుని బంపెను / మన శరీరము దాల్చెను – ఆ ప్రభువు – మన పాపమునకు దూరుడే ||దేవుని|| / యేసు క్రీస్తను పేరున – రక్షకుడు – వెలసి నాడిలలోపల / దోసకారి జనులతో – నెంతో సు – భాషలను బల్కినాడు ||దేవుని|| / పాప భారంబు తోడ – నే ప్రొద్దు – ప్రయాసముల బొందెడి / పాపులందరు నమ్మిన – విశ్రాంతి – పరిపూర్ణమిత్తు ననెను ||దేవుని|| / సతులైన పురుషులైనన్ – యా కర్త – సర్వ జనుల యెడలను / సత్ప్రేమగా నడిచెను – పరలోక – సద్బోధలిక జేసెను ||దేవుని|| / చావు నొందిన కొందరిన్ – యేసుండు – చక్కగా బ్రతికించెను / సకల వ్యాధుల రోగులు – ప్రభు నంటి – స్వస్థంబు తా మొందిరి ||దేవుని|| / గాలి సంద్రపు పొంగులన్ – సద్దణిపి – నీళ్లపై నడచినాడే / మేలు గల యద్భుతములు – ఈలాగు – వేల కొలదిగ జేసెను ||దేవుని|| / చేతుల కాళ్లలోను – రా రాజు – చేర మేకులు బొందెను / పాతకులు గొట్టినారే – పరిశుద్ధ – నీతి తా మోర్వలేకన్ ||దేవుని|| / ఒడలు రక్తము గారగ – దెబ్బలు – చెడుగు లందరు గొట్టిరి / వడిముళ్లు తల మీదను – బెట్టిరి – ఓర్చెనో రక్షకుండు ||దేవుని|| / ఇన్ని బాధలు బెట్టుచు – దను జంపు – చున్న పాప నరులను / మన్నించు మని తండ్రిని – యేసుండు – సన్నుతితో వేడెను ||దేవుని|| / రక్షకుడు శ్రమ బొందగా – దేశంబు – తక్షణము చీకటయ్యెన్ / రక్షకుడు మృతి నొందగ – తెర చినిగి – రాతి కొండలు పగిలెను ||దేవుని|| / రాతి సమాధిలోను – రక్షకుని – నీతిగల దేహంబును / పాతి పెట్టిరి భక్తులు – నమ్మిన – నాతు లందరు జూడగా ||దేవుని|| / మూడవ దినమందున – యేసుండు – మృతి గెల్చి లేచినాడు / నాడు నమ్మిన మనుజులు – చూచిరి – నలువది దినములందున్ ||దేవుని|| / పదునొకండు మారులు – వారలకు – బ్రత్యక్షు డాయె నేసు / పరలోకమున కేగెను – తన వార్త – బ్రకటించు మని పల్కెను ||దేవుని|| / నమ్మి బాప్తిస్మమొందు – నరులకు – రక్షణ మరి కల్గును / నమ్మ నొల్లక పోయెడు – నరులకు – నరకంబు సిద్ధమనెను ||దేవుని||
దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును / ఆమె చేసిన పనులే ఆమెకు – ఘనత నొసంగును ||దేవుని|| / ప్రార్ధన చేసి వీర వనితగా / ఫలమును పొంది ఘనత పొందెను / హన్నా వలె నీవు / ప్రార్ధన చేసెదవా ఉపవసించెదవా ||దేవుని|| / ప్రభు పాదములు ఆశ్రయించి / ఉత్తమమైనది కోరుకున్నది / మరియ వలె నీవు / ప్రభు సన్నిధిని కోరెదవా ||దేవుని|| / వినయ విధేయతలే సుగుణములై / తన జనమును రక్షించిన వనిత / ఎస్తేరును బోలి / దీక్షను పూణెదవా ఉపవసించెదవా ||దేవుని||
దేవుని వారసులం – ప్రేమ నివాసులము / జీవన యాత్రికులం – యేసుని దాసులము / నవ యుగ సైనికులం – పరలోక పౌరులము / హల్లెలూయ – నవ యుగ సైనికులం – పరలోక పౌరులము ||దేవుని|| / సజీవ సిలువ ప్రభు – సమాధి గెలుచుటకే / విజేత ప్రేమికులం – విధేయ బోధకులం / నిజముగ రక్షణ ప్రబలుటకై / ధ్వజముగ సిలువను నిలుపుదుము (2) ||దేవుని|| / ప్రభువును చూచుటకై ప్రజలందరు రాగా / విభు మహిమను గాంచ – విశ్వమే మేము గోల / శుభములు గూర్చుచు మాలోన / శోభిల్లు యేసుని చూపుదుము (2) ||దేవుని|| / దారుణ హింస లలో – దేవుని దూతలుగా / ఆరని జ్వాలలలో – ఆగని జయములతో / మారని ప్రేమ సమర్పణతో / సర్వత్ర యేసుని కీర్తింతుము (2) ||దేవుని|| / పరిశుద్దాత్మునికై – ప్రార్థన సలుపుదము / పరమాత్ముని రాక – బలము ప్రసాదింప / ధరణిలో ప్రభువును జూపుటకై / సర్వాంగ హోమము జేయుదము (2) ||దేవుని|| / అనుదిన కూటములు – అందరి గృహములలో / ఆనందముతోను – ఆరాధనలాయే / వీనుల విందగు పాటలతో / ధ్యానము చేయుచు మురియుదము (2) ||దేవుని|| / హత సాక్షుల కాలం – అవనిలో చెలరేగ / గతకాలపు సేవ – గొల్గొతా గిరి జేర / భీతులలో బహు రీతులలో / నూతన లోకము కాంక్షింతుము (2) ||దేవుని||
దేవుని సముఖ జీవ కవిలెలో (2) / నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| / జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే (2) / హత సాక్షుల కవిలెలో (2) / నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| / ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన (2) / విజయవీరుల కవిలెలో (2) / నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| / పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు (2) / సర్వోన్నతుని పురములలో (2) / నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| / దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన (2) / ప్రార్ధన వీరుల కవిలెలో (2) / నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| / పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా (2) / పరిశుద్ధుల కవిలెలో (2) / నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||
దేవుని స్తుతించ రండి / గత సంవత్సరమున కాపాడెన్ / కీడు మనలను చేరకను – కోటి / కీడుల నుండి కాపాడినట్టి – మహా ||దేవుని|| / కోట్లకొలది మరణించిరి / మన మిచ్చట చేరియున్నాము / కష్టముల బాపి మనల నింక / జగమున జీవితులుగా నుంచినట్టి – మహా ||దేవుని|| / ఎన్ని కీడుల మనము చేసిన / నన్ని మెల్లను చేసెనుగా / నిరతము కాచి చక్కగాను / ప్రభు ప్రేమతో కాచినందున స్తుతిచేసి ||దేవుని|| / ఏకముగా పాడి హర్షముతో / లెక్కలేని మేలులకై / ఆత్మ దేహములను బలిగా / నిపుడేసు కర్పించెద మేకముగా – చేరి ||దేవుని|| / వత్సారంభముననిను / మే మొక్కటిగా నారాధింప / దైవ కుమారా కృపనిమ్ము / మా జీవిత కాలమంతయు పాడి – మహా ||దేవుని|| / భూమి యందలి మాయల నుండి / సైతానుని వలలో నుండి / ఆత్మతో నిను సేవింప / నిపు డేలుమనుచు బ్రతిమాలెదము – కూడి ||దేవుని||| / ప్రతి సంవత్సరమును మము జూడుము / దుర్గములో మము చేర్చుమయ్యా / దాటునప్పుడు నీ సన్నిధిని – చూపి / ధైర్యమునిచ్చి ఓదార్చుమయ్యా – మహా ||దేవుని|| / స్తోత్రింతుము ప్రభువా నీ పదముల / సకలాశీర్వాదముల నిమ్ము / ప్రేమతో ప్రభుతో నుండ / నెట్టి యాపద లేక బ్రోవుమామెన్ – ప్రభు ||దేవుని||