71 songs found

దావీదు తనయా హోసన్నా|Daaveedu Thanayaa Hosannaa

హోసన్నా… / హోసన్నా హోసన్నా హోసన్నా (3) / అయ్యా.. దావీదు తనయా హోసన్నా / యూదుల రాజా యేసన్నా (2) / హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా ||దావీదు|| / గిరులు తరులు సాగరులు / నీకై వీచెను వింధ్యామరలు / హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా / గిరులు తరులు సాగరులు / నీకై వీచెను వింధ్యామరలు / పిల్లలు పెద్దలు జగమంతా (2) / నీకై వేచెను బ్రతుకంతా ||దావీదు|| / కరుణా రసమయ నీ నయనాలు / సమతా మమతల సంకేతాలు / హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా / కరుణా రసమయ నీ నయనాలు / సమతా మమతల సంకేతాలు / కంచర వాహన నీ పయనాలు (2) / జనావాహినికే సుబోధకాలు ||దావీదు|| / పేదల పాలిటి పెన్నిధివై / పాపుల రక్షకుడైనావు / హోసన్నా హోసన్నా – యేసన్నా యేసన్నా / పేదల పాలిటి పెన్నిధివై / పాపుల రక్షకుడైనావు / మకుటము లేని ఓ మహరాజా (2) / పరిచితిమివిగో మా హృదయాలు ||దావీదు||

దావీదు వంశంలో|Daaveedu Vamshamlo

దావీదు వంశంలో – బెత్లేము గ్రామములో యేసయ్యా జన్మించెను / యేసయ్య కథ వింటే రక్షణ కలుగును – మార్గము సత్యం జీవము (2) / ఇది ఇమ్మనుయేలుని ధన్య చరితం / పరిశుద్ధ దేవుని దివ్య రచితం / నమ్మిన వారికి కలుగును జీవము / పరిశుద్ధ ఆత్ముని కార్య ఫలితం / గొల్లలు జ్ఞానులు చాటారు రక్షకుని / మహిమ పరిచిరి సాక్ష్యములు ఇచ్చిరి / హల్లెలూయ హల్లెలూయ దూతల గానాలు / హల్లెలూయ హల్లెలూయ / హల్లెలూయ హల్లెలూయ రక్షణ స్తోత్రాలు / అరె హల్లెలూయ హల్లెలూయ / క్రీస్తు జన్మము మార్చింది చరితను – క్రీస్తు శకముగ ప్రారంభము / చీకటి రాజ్యముకు అంతము కలిగెను – దైవ రాజ్యము ఆరంభము (2) / పాత బ్రతుకును క్రొత్తదిగా మార్చును / మరణచ్చాయలు అంతమగును / అంతమే లేని జీవము నీకిచ్చును / ఆది అంతము ఆ ప్రభువు ||గొల్లలు|| / జీవాహారమును జీవజలమును నేనే – మంచి కాపరిని నేనన్నాడు / భారమంతయు నాపైన మోపితే – నిత్యం భరియిస్తా నేనన్నాడు (2) / దిగులుచెందకు ఆనందించు నాలో / నీ స్నేహితుడ నేనన్నాడు / మరల హృదయంలో తిరిగి నీవు జన్మిస్తే / దేవుని రాజ్యంలో చోటన్నాడు ||గొల్లలు||

దిక్కులెన్ని తిరిగినా|Dikkulenni Thiriginaa

దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2) / మనకు దిక్కు ఈ బాల యేసుడే / ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో / ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2) / కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2) / స్థలము లేక తిరిగి వేసారెను / నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2) / కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2) / నేడు నోవాహు ఓడ జోరేబు కొండ / గుర్తుగా ఉన్నాయి చూడండి ||దిక్కులెన్ని|| / దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల (2) / తన మార్గమందు నడుప బుట్టెను / ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2) / జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2) / నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి / హృదయాలు అర్పించినారయ్యో ||దిక్కులెన్ని||

దినదినంబు యేసుకు|Dinadinambu Yesuku

దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా / అణుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా (2) / ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా (2) / పరమ తండ్రి నీదు మాట బలము తోడ చాటుతా (2) ||దినదినంబు|| / మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా (2) / మారునా ప్రభు యేసు ప్రేమ ఆశ తోడ చేరనా (2) ||దినదినంబు|| / ఎన్నడూ ఎడబాయడు నన్ను విడువడు ఏ మాత్రము (2) / ప్రభువే నాకు అభయము భయపడను నేనే మాత్రము (2) ||దినదినంబు|| / దైవ వాక్యం జీవ వాక్యం అనుదినంబు చదువుతా (2) / ప్రభువు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా (2) ||దినదినంబు|| / పరిశుద్ధముగా అనుకూలముగా జీవయాగమై నిలచెదా (2) / సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా (2) ||దినదినంబు||

దివి నుండి భువికి|Divi Nundi Bhuviki

దివి నుండి భువికి రారాజుగా / బేత్లెహేము పురముకు ఏతెంచెను (2) / గ్రామమంతా చిరునవ్వు లొలికె / పట్టణమంతా పండుగ చేసె (2) / సర్వలోకము సంబరమాయె (2) / ఆశ్చర్యకరుడు హల్లెలూయ / ఆలోచనకర్త హల్లెలూయ / బలమైన దేవుడు హల్లెలూయ / నిత్యుడగు తండ్రి హల్లెలూయ / సమాధానకర్త హల్లెలూయ / గొల్లలు జ్ఞానులు పరవశులై / బంగారం సాంబ్రాణి బోళమును (2) / సాష్టాంగపడి తమ హృదయములన్ / ప్రభువుకు కానుకలర్పించిరి / మనము కూడా అర్పించెదం / ప్రభువు నామము ఘనపరచెదం / మనము కుడా సాష్టాంగపడుచు / పరవశించుచు పాడెదము ||ఆశ్చర్యకరుడు|| / పాపము శాపము బాపగను / వేదన శోధన తీర్చగను (2) / పరిశుద్ధుడు జన్మించెనని / ఇహమున పరమున కొనియాడెదం / మనము కూడా కొనియాడెదం / ప్రభువు నామం ఘనపరచెదం / మనము కూడా హోసన్నయనుచు / కరములెత్తి పాడెదము ||ఆశ్చర్యకరుడు|| ||గ్రామమంతా||