40 songs found

చాచిన చేతులు నీవే|Chaachina Chethulu Neeve

చాచిన చేతులు నీవే / అరచేతిలో చెక్కినావే / కమ్మని అమ్మవు నీవే / కాచిన తండ్రివి నీవే / నీలా ఎవరు ప్రేమిస్తారు / నాకై ప్రాణం అర్పిస్తారు / కన్నీళ్లు తుడిచి కరుణిస్తారు / కళ్ళార్పకుండా కాపాడతారు ||చాచిన|| / కొండలు గుట్టలు చీకటి దారులు / కనిపించదే కళ్ళు చిట్లించినా / కారాలు మిరియాలు నూరేటి ప్రజలు / అన్నారు పడతావొక్క అడుగేసినా / రక్షించే వారే లేరని / నీ పనైపోయిందని (2) / అందరు ఒక్కటై అరచేసినా / అపవాదులెన్నో నాపై మోపేసినా (2) / నీ చేయి చాచేసి చీకటిని చీల్చేసి / శత్రువును కూల్చేసి నిలబెట్టినావు ||చాచిన|| / పేదోడు పిరికోడు ప్రభు సేవకొచ్చాడు / అవమానపడతాడని నవ్వేసినా / చిన్నోడు నీవంటూ అర్హత లేదంటూ / అయినోళ్లు కానోళ్లు చెప్పేసినా / నీవెంత నీ బ్రతుకెంతని / నిలువలేవు నీవని (2) / అందరు ఒక్కటై తేల్చేసినా / కూల్చేయాలని నన్ను కృషిచేసినా (2) / నీ ఆత్మతో నింపేసి నిరాశను కూల్చేసి / నా గిన్నె నింపేసి నడిపించినావు ||చాచిన||

చాటించుడి మనుష్యజాతి|Chaatinchudi Manushya Jaathi

చాటించుడి మనుష్యజాతి కేసు నామము / చాటించుడి యవశ్యమేసు – ప్రేమసారము / జనాదులు విశేష రక్షణ సునాదము – విను పర్యంతము / చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము / చాటుదాము చాటుదాము శ్రీయేసు నామము / కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతో / నెన్నడు గోయుడు రనెడి వాగ్ధత్తంబుతో / మన్నన గోరు భక్తులారా నిండు మైత్రితో మానవ ప్రేమతో / చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము / చాటుదాము చాటుదాము – చక్కని మార్గము / సమీపమందు నుండునేమో చావు కాలము / సదా నశించిపోవువారికీ సుభాగ్యము / విధంబు జూపగోరి యాశతోడ నిత్యము విన్పించు చుందము / చాటుదాము చాటుదాము – చాటుదాము చాటుదాము / చాటుదాము చాటుదాము – సత్య సువార్తను

చాలా గొప్పోడు|Chaalaa Goppodu

చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు / నేను నమ్మిన నా యేసుడు / చాలా గొప్పోడు – చాలా చాలా గొప్పోడు / నాకు దొరికిన నా యేసుడు (2) / మాటలలో చెప్పలేనంత / చేతలలో చూపలేనంత (2) / చాలా చాలా చాలా చాలా – చాలా గొప్పోడు / చాలా చాలా చాలా చాలా – చాలా మంచోడు (2) ||చాలా|| / నా పాప శిక్షను తాను మోసెను / నా కొరకు కలువారిలో త్యాగమాయెను (2) / తన ప్రేమ వర్ణనాతీతం / తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో|| / యేసయ్యకు సాటి ఎవ్వరు లేరు / జగమంతా వెదకినా కానరారులే (2) / తన ప్రేమ వర్ణనాతీతం / తన జాలి వర్ణనాతీతం (2) ||మాటలలో|| / ఈలాంటి ప్రేమ ఎక్కడ లేదు / వింతైన ప్రేమ అంతు చిక్కదు (2) / కలువరిలో చూపిన ప్రేమ / శాపమునే బాపిన ప్రేమ (2) ||మాటలలో||

చాలునయ్యా చాలునయ్యా|Chaalunayyaa Chaalunayyaa

చాలునయ్యా చాలునయ్యా / నీ కృప నాకు చాలునయ్యా (2) / ప్రేమామయుడివై ప్రేమించావు / కరుణామయుడివై కరుణించావు (2) / తల్లిగ లాలించి తండ్రిగ ప్రేమించే (2) / ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా|| / జిగటగల ఊభిలో పడియుండగా / నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా (2) / హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా / హిమము కంటెను తెల్లగ మార్చయ్యా / నీకేమి చెల్లింతు నా మంచి మేస్సీయా / నా జీవితమంతా అర్పింతు నీకయ్యా / ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా|| / బంధువులు స్నేహితులు త్రోసేసినా / తల్లిదండ్రులే నన్ను వెలివేసినా (2) / నన్ను నీవు విడువనే లేదయ్యా / మిన్నగ ప్రేమించి రక్షించినావయ్యా / నీకేమి చెల్లింతు నా మంచి మెస్సీయ / నీ సాక్షిగా నేను ఇలా జీవింతునయ్యా / ప్రేమా కరుణా నీ కృప చాలు (2) ||చాలునయ్యా||

చింత లేదిక|Chintha ledika

చింత లేదిక యేసు పుట్టెను / వింతగను బెత్లేహమందున / చెంత జేరను రండి సర్వ జనాంగమా / సంతసమొందుమా (2) / దూత తెల్పెను గొల్లలకు / శుభవార్త నా దివసంబు వింతగా / ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి / స్తుతులొనరించిరి ||చింత లేదిక|| / చుక్క గనుగొని జ్ఞానులేంతో / మక్కువతో నా ప్రభుని కనుగొన / చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి / కానుకలిచ్చిరి ||చింత లేదిక|| / కన్య గర్భమునందు పుట్టెను / కరుణగల రక్షకుడు క్రీస్తుడు / ధన్యులగుటకు రండి వేగమే దీనులై / సర్వ మాన్యులై ||చింత లేదిక|| / పాపమెల్లను పరిహరింపను / పరమ రక్షకుడవతరించెను / దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము / మోక్ష భాగ్యము ||చింత లేదిక||

చిందింది రక్తం|Chindindi Raktham

చిందింది రక్తం ఆ సిలువ పైన / కారింది రుధిరం కలువరిలోన (2) / కరుణ చూప లేదే కసాయి మనుష్యులు / కనికరించలేదే మానవ లోకం (2) ||చిందింది|| / ఏదేనులో పుట్టిన ఆ పాపము / శాపముగా మారి మరణ పాత్రుని చేసె (2) / ఆ మరణమును తొలగించుటకు / మరణ పాత్రను చేబూనావా (2) / నా మరణమును తప్పించినావా ||కరుణ|| / చేసింది లోకం ఘోరమైన పాపం / మోపింది నేరం నీ భుజము పైనా (2) / యెరుషలేములో పారిన నీ రక్తము / ఈ లోక విమోచన క్రయధనము (2) / ఈ లోక విమోచన క్రయధనము ||కరుణ|| / నువ్వు చేసిన త్యాగం మరువలేని యాగం / మరణపు ముల్లును విరిచిన దేవుడా (2) / జీవకిరీటము నిచ్చుటకై / ముళ్ళ కిరీటము ధరించితివా (2) / నాకు నిత్య జీవమిచ్చితివా ||కరుణ||