28 songs found
గొప్పవాడు – క్రీస్తు యేసు – పుట్టినాడు నీ కోసం / పాటలు పాడి – నాట్యము చేసి – ఆరాధింప రారండి (2) / ప్రేమామయుడు మహిమాన్వితుడు / ఉన్నవాడు అనువాడు (2) / మహిమ ఘనత నిత్యం యేసుకు / హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ ||గొప్పవాడు|| / ఆశ్చర్యకార్యాలు చేసేవాడు యేసు / నీ పాప జీవితం మార్చేవాడు యేసు (2) / నీ బాధలన్ని తీర్చేవాడు యేసు / సంతోష జీవితం ఇచ్ఛేవాడు యేసు (2) ||మహిమ|| / నీ రోగాలను స్వస్థపరచునేసు / నీ శాపాలను తీసివేయునేసు (2) / నీ శోకాలను మాన్పివేయునేసు / పరలోక భాగ్యం నీకు ఇచ్చునేసు (2) ||మహిమ||
గొర్రెపిల్ల జీవ గ్రంథమందు – నీ పేరున్నదా / పరలోక రాజ్య ప్రవేశము – నీకున్నదా / ఏది గమ్యము ఏది మార్గము / యోచించుమా ఓ క్రైస్తవా (2) ||గొర్రెపిల్ల|| / ఆరాధనకు హాజరైనా / కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా (2) / ఎన్ని సభలకు నీవు వెళ్ళినా / మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల|| / సంఘములో నీవు పెద్దవైనా / పాటలెన్నో నీవు పాడినా (2) / వాక్యమును నీవు బోధించినా / మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల|| / ఉపవాసములు ఎన్ని ఉన్నా / ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా (2) / ప్రవచనములు నీవు ఎన్ని పలికినా / మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల||
గొర్రెపిల్ల రక్తములో / కడుగబడినవారే పరిశుద్ధులు (2) / పరిశుద్ధుడా యేసయ్యా.. / నను శుద్ధి చేయుమయా (2) / నను శుద్ధి చేయుమయా ||గొర్రెపిల్ల|| / ఆకాశము ఈ భూమియు / గతియించినా గతియించవు నీ మాటలు (2) / శాశ్వతమైనది నీ రాజ్యము (2) / ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా ||గొర్రెపిల్ల|| / వేవేళ దూతలు అనునిత్యము / కొనియాడుచున్న ఆ పరలోకము నీ సింహాసనం (2) / పరిశుద్ధులతో నిండిన నీ రాజ్యము (2) / ఆ రాజ్యములో నన్ను చేర్చుమయా… యేసయ్యా ||గొర్రెపిల్ల||
గొర్రెపిల్ల వివాహోత్సవ / సమయము వచ్చెను రండి (2) / సర్వాధికారియు సర్వోన్నతుండైన (2) / మన తండ్రిని ఘనపరచి మనముత్సహించెదము (2) ||గొర్రెపిల్ల|| / సిద్ధపడెను వధువు సుప్రకాశము గల (2) / నిర్మల వస్త్రములతో నలంకరించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల|| / పరిశుద్ధుల నీతి క్రియలే యా వస్త్రములు (2) / గొర్రె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు (2) ||గొర్రెపిల్ల|| / తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు (2) / నమ్మకమై యున్నట్టి పెండ్లి కుమారుండు (2) ||గొర్రెపిల్ల|| / దేవుని వాక్యమను నామము గలవాడు (2) / రక్తములో ముంచిన వస్త్రమున్ ధరియించె (2) ||గొర్రెపిల్ల|| / ప్రేమించి సంఘముకై ప్రాణంబు నిదె ప్రభువు (2) / పరిశుద్ధ పరచుట కొరకై తానప్పగించుకొనెన్ (2) ||గొర్రెపిల్ల|| / శ్రీ యేసు క్రీస్తుండే సంఘంబునకు శిరస్సు (2) / వాక్య ఉదకము తోడ శుద్ధి పరచుచుండె (2) ||గొర్రెపిల్ల||