28 songs found
గగనము చీల్చుకొని ఘనులను తీసుకొని / నన్ను కొనిపోవ రానైయున్న / ప్రాణప్రియుడా యేసయ్యా (2) / నిన్ను చూడాలని… / నా హృదయమెంతో ఉల్లసించుచున్నది (2) / ఉల్లసించుచున్నది… ||గగనము|| / నీ దయా సంకల్పమే – నీ ప్రేమను పంచినది / నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది (2) / పవిత్రురాలైన కన్యకగా – నీ యెదుట నేను నిలిచెదను (2) / నీ కౌగిలిలో నేను విశ్రమింతును (2) ||గగనము|| / నీ మహిమైశ్వర్యమే – జ్ఞాన సంపదనిచ్చినది / మర్మమైయున్న నీవలె రూపించుచున్నది (2) / కళంకములేని వధువునై – నిరీక్షణతో నిన్ను చేరెదను (2) / యుగయుగాలు నీతో ఏలెదను (2) ||గగనము|| / నీ కృపా బాహుళ్యమే – ఐశ్వర్యమునిచ్చినది / తేజోవాసుల స్వాస్థ్యం అనుగ్రహించినది (2) / అక్షయమైన దేహముతో – అనాది ప్రణాళికతో (2) / సీయోనులో నీతో నేనుందును (2) ||గగనము||
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2) / గడచిన కాలము కృపలో మమ్ము / దాచిన దేవా నీకే స్తోత్రము / పగలూ రేయి కనుపాపవలె / కాచిన దేవా నీకే స్తోత్రము (2) / మము దాచిన దేవా నీకే స్తోత్రము / కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన|| / కలత చెందిన కష్టకాలమున / కన్న తండ్రివై నను ఆదరించిన / కలుషము నాలో కానవచ్చినా / కాదనక నను కరుణించిన (2) / కరుణించిన దేవా నీకే స్తోత్రము / కాపాడిన దేవా నీకే స్తోత్రము (2) ||గడచిన|| / లోపములెన్నో దాగి ఉన్నను / ధాతృత్వముతో నను నడిపించినా / అవిధేయతలే ఆవరించినా / దీవెనలెన్నో దయచేసిన (2) / దీవించిన దేవా నీకే స్తోత్రము / దయచూపిన తండ్రి నీకే స్తోత్రము (2) ||గడచిన||
గడిచిన కాలమంతా – నను నడిపిన నా దేవా / నీ కంటి పాప లాగా – కాపాడిన నా ప్రభువా (2) / మరో యేడు నాకొసగినందుకు – నీకేమి నే చెల్లింతును / నీ ప్రేమను పంచినందుకు – నిన్నేమని కీర్తింతును (2) ||గడిచిన|| / ఇచ్చిన వాగ్ధానం మరువక – నిలుపు దేవుడవు / శూన్యమందైనా సకలం – సాధ్యపరచెదవు (2) / నా మేలు కోరి నీ ప్రేమతో – నను దండించితివి / చెలరేగుతున్న డంభమును – నిర్మూలపరచితివి (2) ||మరో యేడు|| / నాదు కష్ట కాలములోన – కంట నీరు రాకుండా / నాదు ఇరుకు దారుల్లోన – నేను అలసిపోకుండా (2) / నా సిలువ భారం తగ్గించి – నీవేగా మోసితివి / నీ ప్రేమతో పోషించి – సత్తువ నింపితివి (2) ||మరో యేడు||
గత కాలమంత నిను కాచిన దేవుడు / ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను / ఇయ్యి నీ మనసియ్యి – చెయ్యి స్తోత్రము చెయ్యి / ఇయ్యి కానుకలియ్యి – చెయ్యి ప్రార్థన చెయ్యి / మట్టి కుండగా పుట్టించి నిన్ను / కంటి పాపగా కాపాడినాడు (2) / అందాలాలెన్నో ఎక్కించువాడు / అందరిలో నిన్ను మెప్పించుతాడు (2) ||ఇయ్యి|| / యేసుని హత్తుకో ఈ లోకమందు / ఓపిక తెచ్చుకో యేసు రాక ముందు (2) / తలను ఎత్తుకొని పైకెత్తి చూడు / మరలా యేసు రాజు దిగి వస్తున్నాడు (2) ||ఇయ్యి|| / కష్టాలలో నిన్ను కాపాడినాడు / నష్టాలలో నిన్ను కాపాడినాడు (2) / నీవు నమ్ముకుంటే నిను వదులలేడు / నిన్ను ఎప్పుడూ ఎడబాసి పోడు (2) ||ఇయ్యి||
గతకాలమంత నీ నీడలోన / దాచావు దేవా వందనం / కృప చూపినావు – కాపాడినావు / ఎలా తీర్చగలను నీ ఋణం / పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన – (2) / వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత|| / ఎన్నెన్నో అవమానాలెదురైననూ / నీ ప్రేమ నన్ను విడిచి పోలేదయ్యా / ఇక్కట్లతో నేను కృంగిననూ / నీ చేయి నను తాకి లేపెనయ్యా / నిజమైన నీ ప్రేమ నిష్కళంకము / నీవిచ్చు హస్తము నిండు ధైర్యము (2) / వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2) ||గతకాలమంత|| / మాటలే ముళ్ళుగ మారిన వేళ / నీ మాట నన్ను పలకరించెనయా / నిందలతో నేను నిండిన వేళ / నీ దక్షిణ హస్తం నను తాకెనయా / నీ మాట చక్కటి జీవపు ఊట / మరువనెన్నడు నిన్ను స్తుతియించుట (2) / వందనం యేసయ్యా – ఘనుడవు నీవయ్యా (2) / గతకాలమంత నీ నీడలోన – దాచావు దేవా వందనం / కృప చూపినావు – కాపాడినావు / ఎలా తీర్చగలను నీ ఋణం / పాడనా నీ కీర్తన – పొగడనా వేనోళ్ళన – (2) / వందనం యేసయ్యా – విభుడవు నీవయ్యా (2) ||గతకాలమంత||
గమ్యం చేరాలని నీతో ఉండాలని / పగలూ రేయి పరవశించాలని / ఈ నింగి నేలా కనుమరుగైనా / శాశ్వత జీవం పొందాలని / సాగిపోతున్నాను నిన్ను చూడాలని / నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం చేరాలని|| / భువి అంతా తిరిగి జగమంతా నడచి / నీ జ్ఞానముకు స్పందించాలని / నాకున్నవన్ని సమస్తం వెచ్చించి / నీ ప్రేమ ఎంతో కొలవాలని / అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో / అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను|| / అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా / శిరమును వంచి సహించాలని / వేదన బాధలు గుండెను పిండినా / నీదు సిలువనే మోయాలని / నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి / నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని ||సాగిపోతున్నాను||
గలిలయ తీరాన చిన్న నావ / యేసయ్య ఏర్పరచు-కున్న నావ (2) / యేసయ్య సేవలో వాడబడిన / యేసయ్య బోధకు ఉపయోగపడిన / ఆ నావలా నేనుంటే చాలునయ్యా ||గలిలయ|| / యేసయ్య రాకకై ఎదురు చూసిన / యేసయ్యను మోస్తూ పరవశించిన (2) / ఆత్మల సంపాదనకై వాడబడిన / ఆశ్చర్య కార్యములెన్నో చూసిన / ఆ నావలా నిన్ను మోస్తే చాలునయ్యా ||గలిలయ|| / సుడిగుండాలెన్నో ఎదురొచ్చినా / పెనుతుఫానులెన్నో అడ్డొచ్చినా (2) / ఆగకుండా ముందుకే కొనసాగిన / అలుపెరగని సేవకై సిద్ధపడిన / ఆ నావలా నన్ను కూడా వాడుమయ్యా ||గలిలయ||
గాడాంధకారపు లోయలో / నే సంచరించిన వేళలో / అపాయమేమియు రానీయక / ఉన్నావు తోడుగ నా త్రోవలో (2) / యేసయ్య నీవే మా కాపరివి / ఏమి లేమి లేక కాపాడితివి (2) / నా ఆశ్రయ దుర్గము నీవే / నా బలమైన శైలము నీవే / నా రక్షణ శృంగము నీవే / నా శిక్షను భరియించితివే ||గాడాంధకారపు|| / పచ్చిక గల చోట్లలో నిలిపావు / శాంతి జలములందు నన్ను నడిపావు (2) / యేసయ్య నీవే మా కాపరివి / ఏమి లేమి లేక కాపాడితివి (2) / నా ఎత్తైన కోట నీవే / నే నడిచే ప్రతి చోట నీవే / నా రక్షణకర్తా నీవే / నా జీవన దాతా నీవే ||గాఢాంధకారపు|| / నూనెతో నా తలను అంటావు / నా గిన్నెను పొర్లి పారజేసావు (2) / యేసయ్య నీవే మా కాపరివి / ఏమి లేమి లేక కాపాడితివి (2) / నా మొరను ఆలించావే / నీ వరములు నాకొసగావే / నా పరమ తండ్రివి నీవే / నీ కరమున నను దాచావే ||గాఢాంధకారపు|| / చీకటి బ్రతుకును వెలిగించావు / మరణపు భయమును తొలగించావు (2) / యేసయ్య నీవే మా కాపరివి / ఏమి లేమి లేక కాపాడితివి (2) / నా త్రోవకు వెలుగు నీవే / నా నావకు చుక్కాని నీవే / నను కావగ ఏతెంచితివే / కొనిపోవగ రానున్నావే ||గాఢాంధకారపు||
గాఢాంధకారములో నే నడచిన వేళలో (2) / కంటి పాపవలె నన్ను కునుకక కాపాడును (2) / ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్ / జడియను బెదరను – నా యేసు నాకుండగా (2) / అలలతో కొట్టబడిన – నా నావలో నేనుండగా (2) / ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును (2) / అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును / జడియను బెదరను – నా యేసు నాకుండగా (2)
గాయపడిన నీ చేయి చాపుము దేవా / నీ సిలువ రక్తమును ప్రోక్షించుము నా ప్రభువా (2) / సిలువే నాకు విలువైనది (2) / అదియే నా బ్రతుకున గమ్యమైనది / ఎంతో రమ్యమైనది ||గాయపడిన|| / ఎండిన భూమిలో మొలచిన లేత / మొక్క వలె నీవు ఎదిగితివి (2) / సురూపమైనా ఏ సొగసైనా (2) / లేనివానిగా నాకై మారితివి ||గాయపడిన|| / మనుషులందరు చూడనొల్లని / రూపముగా నాకై మారితివి (2) / మా రోగములు మా వ్యసనములు (2) / నిశ్చయముగా నీవు భరియించితివి ||గాయపడిన|| / నీవు పొందిన దెబ్బల వలన / స్వస్థత నాకు కలిగినది (2) / నీవు కార్చిన రక్తమే (2) / మా అందరికీ ఇల ప్రాణాధారము ||గాయపడిన||
గాయాములన్ గాయములన్ / నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు (2) / నా కొరకై పొందెను క్రీస్తు ప్రభు / సురూపమైన సొగసైనా లేదు / దుఃఖ భరితుడాయెను (2) / వ్యాధిగ్రస్తుడుగా వ్యాకులమొందెన్ / వీక్షించి త్రిప్పిరి ముఖముల్ (2) ||గాయాములన్|| / మా అతిక్రమ క్రియలను బట్టి / మరి నలుగ గొట్టబడెను (2) / తాను పొందిన దెబ్బల ద్వారా / స్వస్థత కలిగె మనకు (2) ||గాయాములన్|| / క్రీస్తు ప్రేమను మరువజాలము / ఎంతో ప్రేమించే మనల (2) / సిలువపై మేము గమనించ మాకు / విలువైన విడుదల కలిగె (2) ||గాయాములన్||
గాలి సముద్రపు అలలకు నేను / కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు (2) / ఆదరించెనూ నీ వాక్యము / లేవనెత్తెనూ నీ హస్తము (2) ||గాలి|| / శ్రమలలో నాకు తోడుంటివి / మొర్రపెట్టగా నా మొర్ర వింటివి (2) / ఆదుకొంటివి నన్నాదుకొంటివి (2) / నీ కృపలో నను బ్రోచితివి (2) ||గాలి|| / వ్యాధులలో నీకు మొర్రపెట్టగా / ఆపదలలో నిన్ను ఆశ్రయించగా (2) / చూపితివి నీ మహిమన్ (2) / కొనియాడెదను ప్రభుయేసుని (2) ||గాలి||