16 songs found
ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది / యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు – (2) ||ఓ ఇశ్రాయేలు|| / భయపడకు నేను నీ / కేడెమును బహుమానమున్ (2) / అత్యధికముగా చేతునని (2) / యెహోవా దేవుడే పల్కెన్ (2) ||ఓ ఇశ్రాయేలు|| / సర్వోన్నతుని రాజ్యము / శాశ్వతంబు నిక్కము (2) / తొలగిపోదు ఎన్నడూ (2) / లయము కాదు ఎన్నడూ (2) ||ఓ ఇశ్రాయేలు|| / నీవు భయపడకుము / బాధించువారు రాకుండను (2) / దూరముగా నుంచి యున్నాను (2) / నీకు తోడైయున్నాను (2) ||ఓ ఇశ్రాయేలు||
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా / ప్రభువు నామములో సాగే అనుబంధమా / ఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమా / ఓ కంట కన్నీరు తగదు సహవాసమా / ప్రతి కష్టము మనము పంచుకుందాము / కలిసి అందరము వేడుకుందాము (2) ||ఓ క్రీస్తు|| / మనమంతా కలిసి ఆ దేవుని దేహము / తండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2) / ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదన / ఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ (2) ||ప్రతి కష్టము|| / సాటి సోదరులు శ్రమల పాలైనపుడు / సాతాను శక్తులచే శోధింపబడినపుడు (2) / ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలి / ఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి (2) ||ప్రతి కష్టము|| / శ్రమలు పొందేవారు అవిధేయులు కారు / విశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు (2) / శాంతమును పాటించి, దేవునిలో వీక్షించి / పంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు (2) ||ప్రతి కష్టము||
ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా (2) / నీ బ్రతుకంతా మారుటే మేలు / కోరుము జీవమునే ||ఓ క్రైస్తవ|| / పాププు చీకటి బ్రతుకేలా / శాపము భారము నీకేలా (2) / పావన యేసుని పాదము చేరిన / జీవము నీదగురా ||ఓ క్రైస్తవ|| / మారిన జీవిత తీరులలో / మానక నీప్రభు సేవకురా (2) / మహిమ కిరీటము మనకొసగును / ఘనమే నీదగురా ||ఓ క్రైస్తవ|| / భయపడి వెనుకకు పరుగిడక / బలమగు వైరిని గెలిచెదవా (2) / బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన / గెలుపే నీదగురా ||ఓ క్రైస్తవ||
ఓ దేవా దయ చూపుమయ్యా / దేశాన్ని బాగుచేయుమయ్యా / నీ ప్రజల మొరను అలకించుమా / నీ కృపలో మమ్మును నడిపించుమా / మన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించు ||ఓ దేవా|| / సర్వలోక రక్షకా – కరుణించుమయ్యా / నీ వాక్య శక్తిని – కనుపరచుమయ్యా / అంధకార ప్రజలను – వెలిగించుమయ్యా / పునరుత్ధాన శక్తితో – విడిపించుమయ్యా / ఒకసారి చూడు – ఈ పాప లోకం / నీ రక్తంతో కడిగి – పరిశుద్ధపరచు / దేశాన్ని క్షమియించు – ప్రేమతో రక్షించు ||ఓ దేవా||
ఓ నాదు యేసు రాజా / నిన్ను నే నుతించెదను (2) / నీ నామమును సదా / నే సన్నుతించుచుండును (2) ||ఓ నాదు|| / అనుదినము నిను స్తుతియించెదను (2) / ఘనంబు చేయుచుండును నేను (2) ||ఓ నాదు|| / వర్ణించెద నే నీ క్రియలను (2) / స్మరియించెద నీ మంచితనంబున్ (2) ||ఓ నాదు|| / రక్షణ గీతము నే పాడెదను (2) / నిశ్చయ జయధ్వని నే చేసెదను (2) ||ఓ నాదు|| / విజయ గీతము వినిపించెదను (2) / భజియించెద జీవితమంతయును (2) ||ఓ నాదు|| / నిరీక్షణ పూర్ణత కలిగి (2) / పరికించెద నా ప్రభు రాకడను (2) ||ఓ నాదు||
ఓ నావికా.. ఓ నావికా.. / ఓ నావికా.. యేసు సామి ఊసు వినవా.. / ఓ నావికా…. ఓ నావికా…. / శ్రమలలో శ్రామికా… (2) / ఊసు వింటివా వింత గంటివా / యేసు సామి ఊసు నీవు వింటివా (2) / హైలెస్సో హైలెస్సా / హైలెస్సో హైలెస్సా (2) / వలేసావు రాతిరంతా / ధార పోసావు కష్టమంతా (2) / చిక్కలేదు చేప ఒక్కటైనా / దక్కలేదు ఫలము కొంతైనా (2) / అడుగడుగో యేసు వచ్చెనయ్యా / వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా (2) / నింపాడు నీ నావ అద్భుత రీతితో / తృప్తిపరిచె నీ బ్రతుకు గొప్ప మేళ్ళతో (2) / వెంబడించు యేసును పూర్ణ శక్తితో / యేసే ఈ జగతికి సర్వాధికారి / యేసే నీ నావకి చూపించు దారి (2) / చేస్తాడు నిన్ను అసలైన జాలరి / మనుషుల పట్టే జాలరి (2) ||ఓ నావికా|| / విరిగి నలిగిన మనస్సుతో / చేసావు నీ సమరం (2) / శయనించక ఎడతెగక / ఈదావు ఈ భవ సాగరం (2) / అడుగడుగో యేసు వచ్చెనయ్యా / వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా (2) / కరుణించాడు నిన్ను చల్లని చూపుతో / నిర్మలమయ్యె బ్రతుకు యేసుని ప్రేమతో (2) / వెంబడించు యేసును పూర్ణ శక్తితో / యేసే ఈ జగతికి సర్వాధికారి / యేసే నీ నావకి చూపించు దారి (2) / చేస్తాడు నిన్ను అసలైన జాలరి / మనుషుల పట్టే జాలరి (2) ||ఓ నావికా||
ఓ ప్రభువా… ఓ ప్రభువా… / నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| / దారి తప్పిన నన్నును నీవు / వెదకి వచ్చి రక్షించితివి (2) / నిత్య జీవము నిచ్చిన దేవా (2) / నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| / నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని / ఎల్లపుడు చేయి విడువక (2) / అంతము వరకు కాపాడు దేవా (2) / నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా|| / ప్రధాన కాపరిగా నీవు నాకై / ప్రత్యక్షమగు ఆ ఘడియలలో (2) / నన్ను నీవు మరువని దేవా (2) / నీవే నా మంచి కాపరివి (4) ||ఓ ప్రభువా||
ఓ ప్రార్ధనా సుప్రార్ధనా / నీ ప్రాభావంబున్ మరతునా / నా ప్రభువున్ ముఖా ముఖిన్ / నే బ్రణుతింతు నీ ప్రభన్ / నా ప్రాణమా సు ప్రార్ధనా / నీ ప్రేరణంబుచే గదా / నీ ప్రేమధార గ్రోలుదు / నో ప్రార్ధనా సుప్రార్ధనా / పిశాచి నన్ను యుక్తితో / వశంబు చేయ జూచుచో / నీ శాంతమైన దీప్తియే / నా శంక లెల్ల మానుపున్ / నీ శక్తి నేను మరతునా / నా శైలమున ప్రార్ధనా / నా శోక మెల్ల దీర్చెడు / విశేషమైన ప్రార్ధనా / నీ దివ్యమైన రెక్కలే / నా దుఃఖ భార మెల్లను / నా దేవుడేసు చెంతకు / మోదంబు గొంచు బోవును / సదా శుభంబు లొందను / విధంబు జూప నీవెగా / నా ధైర్యమిచ్చుఁ ప్రార్ధనా / సుధా సుధార ప్రార్ధనా / అరణ్యమైన భూమిలో / నా రమ్యమౌ పిస్గా నగం / బు రంగుగాను నెక్కి నా / చిర గృహంబు జూతును / శరీరమున్ విదల్చి నే / బరంబు బోవు వేళలో / కరంబు నిన్ను మెచ్చెదన్ / పరేశు ధ్యాన ప్రార్ధనా
ఓ మానవా.. నిజమేదో ఎరుగవా / ఓ మానవా.. ఇకనైనా మారవా / మన పాపములను క్షమియించుటకే / సిలువ మరణము పొందెనని (2) / గ్రహియించి నేడు – ఆ యేసు ప్రభుని వేడు (2) / ఈ దినమే అనుకూలం… / లేదిక వేరే ఏ సమయం (2) / నిజమేదో తెలియకనే / చనిపోతే నీ గతి ఏమి? (2) ||ఓ మానవా|| / సిలువను గూర్చిన శుభ వార్త / వెర్రితనముగా ఉన్నదా? / దేవుని శక్తని తెలుసుకొని / ప్రభు మార్గమును చేరెదవా (2) ||ఈ దినమే|| / ప్రయాసముతో భారము మోసే / నిన్నే దేవుడు పిలిచెనుగా / ప్రయత్నము వీడి విశ్రాంతిని పొంద / వేగిరమే పరుగిడి రావా (2) ||ఈ దినమే|| / నీ ధనము నీ ఘనము / నీ సర్వస్వము చితి వరకే / అర్పించుము నీ హృదయమును / (నిజ) రక్షకుడైన ప్రభు కొరకే (2) ||ఈ దినమే||
ఓ మానవా.. నీ పాపం మానవా / యేసయ్య చెంత చేరి / నీ బ్రతుకు మార్చవా (2) / పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము / పాపములోనే మరణించినచో తప్పదు నరకము (2) ||ఓ మానవా|| / ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువు / ఎంత కాలము శాపములోనే కొట్టబడుదువు / ఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు / ఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువు / యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము / యేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును (2) ||ఓ మానవా|| / ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువు / ఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువు / ఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవు / ఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువు / యెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెను / యెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును (2) ||ఓ మానవా||
ఓ యాత్రికుడా ఓహో యాత్రికుడా / బ్రతుకు ప్రయాణములో గమ్యమెంత దూరమో తెలుసా.. / ఓ బాటసారి ఓహో బాటసారి / జీవిత యాత్రలో కాలమెంత విశాలమో తెలుసా / గుండె ఆగిపోగానే ఊపిరి ఆగిపొతుంది / నాడి నిలిచిపోగానే ఆత్మ ఎగిరిపోతుంది (2) / అంతా ఆ దైవ నిర్ణయం / మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| / పుట్టగానే తొట్టెలో వేస్తారు / గిట్టగానే పెట్టెలో మూస్తారు / జాగు చేయక కాటికి మోస్తారు / ఆరడుగుల గుంటలో తోస్తారు ఆ అ ఆ. ఆ.. (2) / బ్రతుకు మూల్యమింతే – మనిషికి ఉన్న విలువంతే (2) / అంతా ఆ దైవ నిర్ణయం / మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| / ఏడ్చుకుంటూ భూమిపై పుడతావు / ఏడిపిస్తూ సమాధికి పోతావు / కూడబెట్టినవి మోసుకు పోలేవు / ఆశించినవేవి నీ వెంటారావు ఓ ఒ ఓ..ఓ.. (2) / జీవిత సారము ఇంతే – మనిషి బ్రతుకు భావము అంతే (2) / అంతా ఆ దైవ నిర్ణయం / మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా|| / మరణము ఒక నిద్ర యేసునందు / అంతము అది కాదు క్రీస్తునందు / మృతులు లేచుట స్థిరము యేసునందు / నిత్య జీవము వరము క్రీస్తునందు ఆ అ ఆ.. ఆ.. (2) / నేడే రక్షన సమయము – ఇక ఆలసించిన నరకము (2) / అంతా ఆ దైవ నిర్ణయం / మనిషి కాలగత దేవుని ఆదేశం (2) ||ఓ యాత్రికుడా||
ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము / ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు|| / అగమ్య ఆనందమే హృదయము నిండెను / ప్రభుని కార్యములు గంభీరమైనవి / ప్రతి ఉదయ సాయంత్రములు / స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు|| / సంకట సమయములో సాగలేకున్నాను / దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా / వింటినంటివి నా మొర్రకు ముందే / తోడునుందునంటివి (2) ||ఓ యేసు|| / కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు / పచ్చిక బయలులో పరుండ జేయును / భోజన జలములతో తృప్తి పరచు / నాతో నుండునేసు (2) ||ఓ యేసు|| / దేవుని గృహములో సదా స్తుతించెదనూ / సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ / స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు / హల్లేలూయా ఆమేన్ (2) ||ఓ యేసు||