22 songs found

ఏ గుంపులో నున్నావో|Ae Gumpulo Nunnaavo

ఏ గుంపులో నున్నావో / ఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో (2) / జాగు చేయక వేగ మేలుకో (2) / మరణమనెడి మొదటి గుంపు / మారని గుంపు – నిర్జీవపు గుంపు (2) / దురాత్మ బలముతో తిరిగెడి గుంపు (2) / మెచ్చుఁకొనుట కిచ్చకంబు / లాడెడి గుంపు – నులివెచ్చని గుంపు (2) / చచ్చియుండిన సమాధుల గుంపు (2) / కరుణ లేక కఠినమైన / కరుగని గుంపు – గుర్తెరుగని గుంపు (2) / కరకు కల్గిన కఠోరపు గుంపు (2) / యేసు వాక్యమనగ నేమో / ఎరుగని గుంపు – విననియ్యని గుంపు (2) / ముద్ర వేసిన మూర్ఖుల గుంపు (2) / ధరణి నరుల తరిమి కొట్టు / దయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు (2) / పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు (2) / పరమ తండ్రి కడకు జేర / పరుగులెత్తెడి – నిరపరాధ జనులకు (2) / కావలి కాయు కఠినాత్ముల గుంపు (2) / సర్వ లోక మోసగాడు / ఆది సర్పము – అదే ఘట సర్పము (2) / సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు (2) / వధువు మంద మేయు మర్మ / మనగ గమనిక – గమనించి తెలుసుకో (2) / గదిలో చేరుకో పదిలపర్చుకో (2)

ఏ నామములో|Ae Naamamulo

ఏ నామములో సృష్టి అంతా సృజింపబడెనో / ఆ నామమునే స్తుతింతును / ఏ నామములో పాపమంతా క్షమించబడెనో / ఆ నామమునే పూజింతును / ఏ నామములో దావీదు గోలియాతును ఎదురించెనో / ఆ నామమునే నమ్మెదను / ఏ నామములో ఈ లోకమంతటికి రక్షణ కలుగునో / ఆ నామమునే స్మరింతును / నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను / నీ నామమే ఆధారము / నీ నామమునే ధ్వజముగ పైకెత్తెదను / నీ నామమే నా జయము / రోగము తలవంచును నీ నామము ఎదుట / శాపము తల వంగును నీ నామము ఎదుట (2) / సాటిలేని నామము – స్వస్థపరచే నామము (2) ||నీ నామమునే|| / ప్రతి మోకాలొంగును నీ నామము ఎదుట / ప్రతి నాలుక పలుకును ప్రభు యేసుకే ఘనత (2) / శ్రేష్టమైన నామము – శక్తిగలిగిన నామము (2) ||నీ నామమునే|| / హెచ్చింపబడును గాక నీ నామము యేసయ్యా / కీర్తింపబడును గాక నీ నామము యేసయ్యా / కొనియాడబడును గాక నీ నామము యేసయ్యా / అన్ని నామములకు పై నామముగా (2) / అన్ని నామములకు పై నామముగా – (3) ||నీ నామమునే||

ఏ పాపమెరుగని|Ae Paapamerugani

ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా / నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా / ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా / ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా ||ఏ పాప|| / కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా / సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా ||ఏ పాప|| / చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా / కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా ||ఏ పాప|| / ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా / నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా ||ఏ పాప|| / పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా / సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా ||ఏ పాప|| / బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా / ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము ||ఏ పాప|| / కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా / ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి ||ఏ పాప||

ఏ రీతి స్తుతియింతును|Ae Reethi Sthuthiyinthunu

ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమా / ఏ రీతి వర్ణింతును – నీ ప్రేమ మధురంబును / నీ కృపలన్ని తలపోసుకొనుచు – నీ పాదాలు చేరానయ్యా / నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో – నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి|| / ఏకాకినై నే దుఃఖార్తిలో – ఏ తోడు గానని నాకు / ఏమౌదునో ఎటు పోదునో – ఎటు తోచక నున్న నన్ను / ఏ భయము నీకేల యనుచు – అభయంబు నిచ్చావయ్యా / ఏ దారి కనబడని వేళ – నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి|| / ఈ మనుష్యులు ఈ వైరులు – ఎన్నెన్నో చేసిన గాని / నా ప్రాణము నా దేహము – నీ స్వాధీనంభేగదయ్యా / నా స్వామి నాతోనే ఉంటూ – నా కాపరిగ నిలిచావయ్యా / నాకేమి స్పృహ లేని వేళ – ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి|| / నీ ప్రేమను నీ పేరును – నేనెన్నడూ మరువలేను / నీ కరుణను నీ జాలిని – ఏ మనిషిలో చూడలేను / నిజ దైవము నీవే యనుచు – నీ వైపే నే చూచానయ్యా / యెహోవా రాఫా నేననుచు – ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి||

ఏ సమయమందైనా|Ae Samayamandainaa

ఏ సమయమందైనా ఏ స్థలమందైనా / ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడెదన్ (2) / ఆరాధనా ఆరాధనా / నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా / ఆరాధనా ఆరాధనా / గొర్రెపిల్ల క్రీస్తుకే ఆరాధనా ||ఏ సమయమందైనా|| / చెరసాలలో నేను బంధీగా ఉన్నా / సింహాల బోనులో పడవేసినా / కరువు ఖడ్గము హింస ఏదైననూ / మరణ శాసనమే పొంచున్ననూ / యేసు నామమే ఆధారము కాదా / యేసు రక్తమే నా విజయము / పగలు ఎండలలో రాత్రి వెన్నెలలో / కునుకక కాపాడు యేసు దేవునికే ||ఆరాధనా|| / నా జీవనాధారం శ్రీ యేసుడే / నా స్తుతికి పాత్రుడు ప్రభు క్రీస్తుడే / తన చేతులతో నన్ను నిర్మించెగా / నా సృష్టికర్తను కొనియాడెదన్ / యెహోవ రాఫా నను స్వస్థ పరిచెను / యెహోవ షమ్మా నాకు తోడుగా / యెహోవ నిస్సీ నా ధ్వజముగా / అల్ఫా ఒమేగా ఆది దేవునికే ||ఆరాధనా||

ఏం చేసానయ్యా నీకోసం|Em Chesaanayyaa Neekosam

ఏం చేసానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని (2) / ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని (2) / ఒక్కరినైనా ఒక ఆత్మనైనా / రక్షించానా నీకై వెలిగించానా (2) ||ఏం చేసానయ్యా|| / ప్రాణమిచ్చావయ్యా బుద్ధినిచ్చావయ్యా / మాటలిచ్చావయ్యా నాకు బ్రతుకు నేర్పావయ్యా (2) / ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరచానా / నిన్నే ఎదిరించానా (2) / ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా (2) / నాకున్నవన్ని నీ పనిలో వాడనిస్తానయ్యా (2) ||ఏం చేసానయ్యా|| / ధనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా / శ్రద్ధ నిలిపావయ్యా పోషింప జేసావయ్యా (2) / ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా / నా కడుపు నింపుకున్నానా (2) ||ఇప్పటికైనా || / ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా / భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా (2) / ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా / సోమరినైపోయానా (2) ||ఇప్పటికైనా ||