6 songs found

ఊరుకో నా ప్రాణమా|Ooruko Naa Praanamaa

ఊరుకో నా ప్రాణమా కలత చెందకు / ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా (2) / ఎడారి దారిలోన – కన్నీటి లోయలోన (2) / నా పక్షమందు నిలిచే నా ముందురే నడిచే / నీ శక్తినే చాట నన్నుంచెనే చోట / నిన్నెరుగుటే మా ధనం / ఆరాధనే మా ఆయుధం / ఎర్రసముద్రాలు నా ముందు పొర్లుచున్నా / ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా (2) / నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా / నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా (2) ||ఊరుకో|| / ఇంతవరకు నడిపించిన దాక్షిణ్యపూర్ణుడు / అన్యాయము చేయుట అసంభవమేగా (2) / వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు / దుష్కార్యము చేయుట అసంభవమేగా (2) ||ఊరుకో|| / అవరోధాలెన్నో నా చుట్టు అలుముకున్నా / అవరోధాల్లోనే అవకాశాలను దాచెగా (2) / యెహోవా సెలవిచ్చిన ఒక్కమాటయైనను / చరిత్రలో ఎన్నటికీ తప్పియుండలేదుగా (2) ||ఊరుకో||

ఊహకు అందని కార్యముల్|Oohaku Andani Kaaryamul

ఊహకు అందని కార్యముల్ / ఊహించని రీతిలో నాకై చేసిన దేవా / ఊహకు అందని వేళలో / ఊహించని మేలులన్ నాకై చేసిన దేవా / ఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్ / నీదు నామ గీతము నాదు జీవితాంతము / కొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్ ||ఊహకు|| / కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకు / ఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2) / అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెను / అద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యము / అసాధ్యమైనదేది నీకు లేనే లేదు / ఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2) ||ఉత్సహించి|| / బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగా / ఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగా / కనుపాప లాగ నన్ను కాచే దైవం నీవు / నడి సంద్రమైన నన్ను నడిపే తోడే నీవు (2) ||ఉత్సహించి||

ఊహించలేని కార్యములు|Oohinchaleni Kaaryamulu

ఊహించలేని కార్యములు దేవుడు జరిగించినాడు / కానానులో మహిమను చూపి కార్యము జరిగించినాడు (2) / దంపతులను దీవించగా బంధువులు విచ్చేసినారు / ఘనమైన కార్యము తిలకించగా ఆత్మీయులే వచ్చినారు / ఆనందమే ఆనందమే ఈ పెళ్లి సంతోషమే / కళ్యాణము కమనీయము కళ్యాణ వైభోగము ||ఊహించలేని|| / ఒకరికి ఒకరు ముడి వేసుకొనే బంధం / ఒకరంటే ఒకరికి ప్రేమను పంచే తరుణం (2) / కలవాలి హృదయాలు ఒకటై / పండాలి నూరేళ్లు ఇకపై (2) / వెయ్యేళ్ళు వర్ధిల్లాలని ఇస్తున్నాము ఇవ్వాళ ||ఊహించలేని|| / దేవుని సముఖములో బ్రతకాలి మీరు / మీ జీవిత పయనం సాగాలి ఆ దేవునితో (2) / లోబడి ఉండాలి వధువు / ప్రేమను పంచాలి వరుడు (2) / దేవుడిచ్చే బహుమానం మీ కన్నుల పంట కావాలి ||ఊహించలేని||