14 songs found

ఈలాటిదా యేసు ప్రేమ|Eelaatidaa Yesu Prema

ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను / తూలనాడక తనదు జాలి చూపినదా ||ఈలాటిదా|| / ఎనలేని పాప కూపమున – నేను / తనికి మిణుకుచును నే దరి గానకుండన్ / కనికరము పెంచి నాయందు – వేగ / గొనిపోవ నా మేలు కొరికిందు వచ్చె ||ఈలాటిదా|| / పెనుగొన్న దుఃఖాబ్ధిలోన – నేను / మునిగి కుములుచు నేడు పునగుండు నపుడు / నను నీచుడని త్రోయలేక – తనదు / నెనరు నా కగుపరచి నీతి జూపించె ||ఈలాటిదా|| / నెమ్మి రవ్వంతైనా లేక – చింత / క్రమ్మిపొగలుచు నుండ-గా నన్ను జూచి / సమ్మతిని నను బ్రోవ దలచి – కరము / జాచి నా చేయి బట్టి చక్కగా పిలిచె ||ఈలాటిదా|| / పనికిమాలిన వాడనైన – నేను / కనపరచు నా దోష కపటవర్తనము / మనసు నుంచక తాపపడక యింత / ఘనమైన రక్షణ-మును నాకు చూపె ||ఈలాటిదా|| / నా కోర్కెలెల్ల సమయములన్ – క్రింది / లోక వాంఛల భ్రమసి లొంగెడు వేళన్ / చేకూర్చి ధృడము చిత్తమునన్ – శుభము / నా కొసంగె జీవింప నా రక్షకుండు ||ఈలాటిదా|| / శోధనలు నను చుట్టినప్పుడు – నీతి / బోధ నా మనసులో పుట్టించి పెంచి / బాధలెల్లను బాపి మాపి – యిట్టి / యాదరణ జూపిన యహాఁహాఁ యేమందు ||ఈలాటిదా||

ఈస్టర్ మెడ్లీ|Easter Medley

యూదా రాజ సింహం తిరిగి లేచెను / తిరిగి లేచెను మృతిని గెలిచి లేచెను (2) / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) / హల్లెలూయా హల్లెలూయా / ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ (2) / మరణము జయించి లేచెన్ / మరణపు ముల్లును విరచెన్ (2) / మధురం యేసుని నామం / మరువకు యేసుని ధ్యానం (2) / హే ప్రభు యేసు – హే ప్రభు యేసు / హే ప్రభు దేవా సుతా / సిల్వ ధరా, పాప హరా, శాంతి కరా / హే ప్రభు యేసు – హే ప్రభు యేసు / ఖాళీ సమాధిలో మరణమును / ఖైదీగా జేసిన నీవే గదా (2) / ఖాలమయుడగు సాతానుని గర్వము (2) / ఖండనమాయె గదా / సిల్వధరా పాపహరా శాంతికరా / హే ప్రభు యేసు – హే ప్రభు యేసు / గీతం గీతం జయ జయ గీతం / చెయ్యి తట్టి పాడెదము (2) / యేసు రాజు లేచెను హల్లెలూయా / జయ మార్భటించెదము (2) / చూడు సమాధిని మోసిన రాయి దొరలింపబడెను / అందు వేసిన ముద్ర కావలి నిల్చెను / దైవ సుతుని ముందు / జయ జయ యేసు – జయ యేసు / జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు (2) / జయ జయ రాజా – జయ రాజా (2) / జయ జయ స్తోత్రం – జయ స్తోత్రం / సమాధి గెల్చిన జయ యేసు / సమాధి ఓడెను జయ క్రీస్తు (2) / సమరము గెల్చిన జయ యేసు (2) / అమరముర్తివి జయ యేసు / జయ జయ యేసు – జయ యేసు / జయ జయ క్రీస్తు – జయ క్రీస్తు / పరమ జీవము నాకు నివ్వ / తిరిగి లేచెను నాతో నుండ (2) / నిరంతరము నన్ను నడిపించును / మరల వచ్చి యేసు కొనిపోవును (2) / యేసు చాలును – యేసు చాలును / యే సమయమైన యే స్థితికైన / నా జీవితములో యేసు చాలును / ముక్తినిచ్చె యేసు నామం / శాంతినిచ్చె యేసు నామం (2) / జై జై ప్రభు యేసుకు / జై జై క్రీస్తు రాజుకే / మరణమును గెల్చి మము రక్షించి / విజయము నిచ్చెనుగా / హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా / ప్రాణము పెట్టిన దేవుడు / రక్షణనిచ్చిన దేవుడు / మరణము గెల్చిన దేవుడు / మృతులను లేపిన దేవుడు / దేవుడు దేవుడు యేసే దేవుడు / మన దేవుడు దేవుడు యేసే దేవుడు / సిలువలో ప్రాణం పెట్టాడన్నా / మరణం గెలిచి లేచాడన్నా (2) / మహిమ ప్రభు మృత్యుంజయుడు / క్షమియించును జయమిచ్చును (2) / ఓరన్న… ఓరన్న / యేసుకు సాటి వేరే లేరన్న… లేరన్న / యేసే ఆ దైవం చూడన్నా… చూడన్నా / యేసే ఆ దైవం చూడన్నా (2) / యేసే ఆ దైవం చూడన్నా – (2)