14 songs found
ఈ ఉదయం – శుభ ఉదయం / ప్రభువే నాకొసగిన – ఆనంద సమయం / ఆశ్రయించెదన్ – దివ్య వాక్యమున్ / ప్రేమతోడ సరిచేసే – శ్రేష్ఠ సత్యమున్ ||ఈ ఉదయం|| / బలహీనమైతి నేను – బలపరచుము తండ్రి / ఫలహీనమైతి నేను – ఫలియింపజేయుము / వాక్య ధ్యానమే – నీ ముఖ దర్శనము / పరిశుద్ధ పరచెడి – పరమతండ్రి మార్గము ||ఈ ఉదయం|| / అస్థిరమునైతి నేను – స్థిరపరచుము తండ్రి / అల్పవిశ్వాసి నేను – అద్దరికి జేర్చుము / నీ పాదసన్నిధే – నాకు శరణము / అభయంబునిచ్చెడి – ఆశ్రయపురము ||ఈ ఉదయం||
ఈ ఉదయమున నీవు లేచి ఏమి తలచుచున్నావు / నీ మనసులోన ఏమి తలచి కలవరపడుచున్నావు / ఈ దినమే భారమా – నీ బ్రతుకే భారమా – (2) ||ఈ ఉదయమున|| / తోడు లేని జీవ యాత్ర / చేరలేని కడలి తీరం (2) / బ్రతుకే బరువై పోవగా / క్రీస్తు దరికి సాగి రమ్ము / చేరుకొనుము తీరము ||ఈ ఉదయమున|| / అలల వలె వ్యధలు రాగా / కనుల నీరే తోడు కాగా (2) / అండగా క్రీస్తేసుడుండ / చింత ఏల భీతి ఏల / బంధాలెల్ల వీడెగా / ఈ ఉదయమున నీవు లేచి కలవరపడనేలనో / నీ కనుల నీరు ప్రభువు తుడిచి వెంట నడుచును / ప్రభుదే ఈ దినం – జయమే ఈ దినం – (2)
ఈ జీవితం విలువైనది / నరులారా రండని సెలవైనది (2) / సిద్ధపడినావా చివరి యాత్రకు / యుగయుగాలు దేవునితో ఉండుటకు / నీవుండుటకు ||ఈ జీవితం|| / సంపాదన కోసమే పుట్టలేదు నీవు / పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు (2) / పోతున్నవారిని నువు చుచుటలేదా (2) / బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా (2) ||ఈ జీవితం|| / మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు / కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు (2) / చిన్న పెద్ద తేడా లేదు మరణానికి (2) / కులమతాలు అడ్డం కాదు స్మశానానికి (2) ||ఈ జీవితం|| / పాపులకు చోటు లేదు పరలోకమునందు / అందుకే మార్పుచెందు మరణానికి ముందు (2) / యేసు రక్తమే నీ పాపానికి మందు (2) / కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు (2) ||ఈ జీవితం||
ఈ తరం యువతరం / ప్రభు యేసుకే అంకితం / నా బలం యవ్వనం / ప్రభు యేసుకే సొంతము / రా సోదరీ రారా సోదరా / ప్రభు యేసు వార్త చాటుదాం / రా సోదరీ రారా సోదరా / ప్రభు యేసు రాజ్యము స్థాపిద్దాం ||ఈ తరం|| / సువార్త సేవ నానాటికి చల్లారిపోయెగా / ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయెగా / దేవుని సేవ వ్యాపారమాయే / ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే / నీవు కాకపోతే ఇంకెవ్వరు / నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ|| / నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా / యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయెగా / యేసయ్య రాకడ సామీపమాయే / ఆ వార్త చాటను వేగిర రావే / నీవు కాకపోతే ఇంకెవ్వరు / నేడు కాకపోతే ఇంకెన్నడు ||రా సోదరీ||
ఈ దినం క్రీస్తు జన్మ దినం / శుభకరం లోక కళ్యాణం / పరమును విడచి ఇలకు చేరిన / మహిమ అవతారం (2) / ఆడుము పాడుము ప్రభుని నామము / నూతన గీతముతో / రక్షణ పొందుము ఈ సమయము / నూతన హృదయముతో (2) ||ఈ దినం|| / దేవ దూతలు పలికిన ప్రవచనం / జ్ఞానులకొసగిన దివ్య మార్గం (2) / ధన్యత కలిగిన దావీదు పురము / కన్య మరియకు ప్రసవ తరుణం ||ఆడుము|| / పాప దుఃఖములన్నియు పారద్రోలును / కృపయు క్షేమము కలుగజేయును (2) / రక్షణ నొసగెడి పరమ సుతునికి / ఇమ్మానుయేలని నామకరణము ||ఈ దినం||
ఈ దినం సదా నా యేసుకే సొంతం / నా నాధుని ప్రసన్నత నా తోడ నడచును (2) / రానున్న కాలము – కలత నివ్వదు (2) / నా మంచి కాపరీ సదా – నన్ను నడుపును ||ఈ దినం|| / ఎడారులు లోయలు ఎదురు నిలచినా / ఎన్నడెవరు నడువని బాటయైనను (2) / వెరవదెన్నడైనను నాదు హృదయము (2) / గాయపడిన యేసుపాదం అందు నడచెను (2) ||ఈ దినం|| / ప్రవాహం వోలె శోదకుండు ఎదురు వచ్చినా / యుద్ధకేక నా నోట యేసు నామమే / విరోదమైన ఆయుధాలు యేవి ఫలించవు / యెహోవా నిస్సియే నాదు విజయము ||ఈ దినం||
ఈ దినమెంతో శుభ దినము / నూతన జీవితం అతి మధురం / ఆగదు కాలం మన కోసం / గతించిపోయెను చెడు కాలం / వచ్చినది వసంత కాలం ||ఈ దినమెంతో|| / నీ హృదయం ఆశలమయము / కావాలి అది ప్రేమ నిండిన మందిరము (2) / యేసుని కొరకై తెరచిన హృదయం / ఆలయం అది దేవుని నిలయం ||ఈ దినమెంతో|| / జీవితమే దేవుని వరము / తెలియాలి అది ముగియక ముందే రక్షణ మార్గం (2) / నూతన జీవము నింపుకొని / నిలవాలి అది క్రీస్తుకు సాక్ష్యం ||ఈ దినమెంతో||
ఈ మరణము కాదు శాశ్వతము / పరలోకమే మనకు నివాసము (2) / యేసు తెచ్చెను మనకు రక్షణ / ఎంత అద్బుతము ఆ నిరీక్షణ (2) ॥ఈ మరణము॥ / జగతు పునాది వేయక ముందే / మనమెవ్వరో ఎవరికి తెలియక ముందే (2) / మనలను ఏర్పరచుకొన్న ఆ దేవుడు / తిరిగి తన దరికి మనల పిలిచే వేళ (2) / తిరిగి తన దరికి మనల పిలిచే వేళ ॥ఈ మరణము॥ / యేసు నామమును ఎరిగిన వారు / పాప శ్రమలకు అర్హులు కారు (2) / తిరిగి లేచెదరు యేసు నామములో / కొలువు తీరెదరు పరలోకంలో (2) / కొలువు తీరెదరు పరలోకంలో ॥ఈ మరణము॥ / కురిసే ప్రతి కంటి నీరు ప్రభువు తుడుచును / మరణము మబ్బులను కరిగించును (2) / వేదనలు రోదనలు రద్దు చేయును / గతకాల సంగతులు గతించి పోవును (2) / గతకాల సంగతులు గతించి పోవును ॥ఈ మరణము॥
ఈ లోక యాత్రాలో నే సాగుచుండ (2) / ఒకసారి నవ్వు – ఒకసారి ఏడ్పు (2) / అయినాను క్రీస్తేసు నా తోడనుండు (2) ||ఈ లోక|| / జీవిత యాత్ర ఎంతో కఠినము (2) / ఘోరాంధకార తుఫానులున్నవి (2) / అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు (2) / కాయు వారెవరు రక్షించేదెవరు (2) ||ఈ లోక|| / నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా (2) / అనుదినము నన్ను ఆదరించెదవు (2) / నీతో ఉన్నాను విడువలేదనెడు (2) / నీ ప్రేమ మధుర స్వరము విన్నాను (2) ||ఈ లోక|| / తోడై యుండెదవు అంతము వరకు (2) / నీవు విడువవు అందరు విడచినను (2) / నూతన బలమును నాకొసగెదవు (2) / నే స్థిరముగ నుండ నీ కోరిక ఇదియే (2) ||ఈ లోక||
ఈ లోకంలో జీవించెదను / నీ కొరకే దేవా – (2) / నా ప్రియ యేసూ- నాకు లేరు ఎవ్వరు / నీలా ప్రేమించే వారు / నీవే నా ప్రాణ ప్రియుడవు – (2) ||ఈ లోకంలో|| / (నా) తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా / విడువనని నాకు వాగ్దానమిచ్ఛావు (2) / ఎంత లోతైనది నీ ప్రేమా / నిన్ను విడచి నే బ్రతుకలేను (2) ||ఈ లోకంలో|| / (నీ) అరచేతిలోనే నన్ను చెక్కు కుంటివే / నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే (2) / నీ దృష్టిలో నేనున్నాగా / ఇలలో నే జడియను (2) ||ఈ లోకంలో||
ఈ సాయంకాలమున – యేసు ప్రభో వేడెదము / నీ సుదయారస మొల్క – నిత్యంబు మముగావు ||ఈ సాయంకాలమున|| / చెడ్డ కలల్ రాకుండ – నడ్డగించుమి ప్రభో / బిడ్డలము రాత్రిలో – భీతి బాపుము తండ్రీ ||ఈ సాయంకాలమున|| / దుష్టుండౌ శోధకుని – ద్రోక్కుటకు బలమిమ్ము / భ్రష్టత్వమున మేము – పడకుండ గాపాడు ||ఈ సాయంకాలమున|| / నీ యేక పుత్రుండౌ – శ్రీయేసు నామమున / సాయం ప్రార్థన లెల్ల – సరగ నాలించుమా ||ఈ సాయంకాలమున|| / జనక సుత శుద్ధాత్మ – ఘన దేవా స్తుతియింతుం / అనిశము జీవించి – రా – జ్యంబు జేయు మామేన్ ||ఈ సాయంకాలమున||
ఈ స్తుతి నీకే మా యేసు దేవా / (మా) మనసారా నిన్నే సేవింతుము – (2) / పరలోక దూతాలి స్తోత్రాలతోనే / మా స్తోత్ర గానాలు గైకొనుమా (2) ||ఈ స్తుతి|| / జగతికి పునాది నీవని / మాలోన ఊపిరి నీదేనని (2) / మా పోషకుడవు నీవేనని / మా కాపరివి నీవేనని (2) / మా హృదయాలలో ఉండాలని / నీ సాక్షిగా మేము బ్రతకాలని ||ఈ స్తుతి|| / మనసారా నీ దరి చేరగా / మాకెంతో సంతోషమాయెగా (2) / హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో / మా హృది ప్రవహించే సెలయేరులా (2) / నీ మధుర ప్రేమను చాటాలని / నీ జీవ బాటలో నడవాలని ||ఈ స్తుతి||