33 songs found
ఇయ్యాల ఇంట్ల రేపు మంట్ల (2) / ఏది నీది కాదే యేసయ్య నీకు తోడే (2) ||ఇయ్యాల|| / నువ్వు తొడిగే చెప్పులకు గ్యారెంటి ఉంది / జేబుల పెన్నుకు గ్యారెంటి ఉంది (2) / గుండు సూదికి గ్యారెంటి ఉంది / నీ గుండెకు గ్యారెంటి లేదే (2) ||ఇయ్యాల|| / ఎం ఏ చదువులు చదివే అన్న / బి ఏ చదువులు చదివే అన్న (2) / ఎం ఏ చదువులు ఏటి పాలురా / బి ఏ చదువులు బీటి పాలురా (2) ||ఇయ్యాల|| / మేడలు మిద్దెలు ఎన్ని ఉన్నా / అందం చందం ఎంత ఉన్నా (2) / యేసయ్య లేనిది ఎన్ని ఉన్నా / ఎన్ని ఉన్నా అన్ని సున్నా (2) ||ఇయ్యాల|| / సబ్సే బడా రూపాయంటావు / రూపాయీ అన్నిస్తదంటావు (2) / రూపాయీ పరలోకమివ్వదు / రూపాయీ సంతోషమివ్వదు (2) ||ఇయ్యాల||
ఇరువది నలుగురు పెద్దలతో / పరిశుద్ధ దూతల సమూహముతో (2) / నాలుగు జీవుల గానముతో (2) / స్తుతియింపబడుచున్న మా దేవా ||ఇరువది|| / భూమ్యాకాశములన్నియును / పర్వత సముద్ర జల చరముల్ (2) / ఆకాశ పక్షులు అనుదినము (2) / గానము చేయుచు స్తుతియింపన్ ||ఇరువది|| / కరుణారసమగు హృదయుడవు / పరిశుద్ధ దేవ తనయుడవు (2) / మనుజుల రక్షణ కారకుడా (2) / మహిమ కలిగిన మా ప్రభువా ||ఇరువది|| / గుప్పిలి విప్పి కూర్మితోను / గొప్పగ దీవెనలిచ్చెదవు (2) / గొర్రెల కాపరి దావీదు (2) / అయ్యెను ఎంతో మహారాజు ||ఇరువది||
ఇళ్లలోన పండుగంట కళ్ళలోన కాంతులంట / ఎందుకో ఎందుకే కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా / మల్లెపూల మంచు జల్లు మందిరాన కురిసె నేడు / ఎందుకో ఎందుకే కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా / ఆ… అర్దరాత్రి కాలమందు వెన్నెల… ఆహా / ఆశ్చర్యకరుడంట వెన్నెల… ఆహా (2) / జన్మించినాడంట వెన్నెలా / ఈ అవనిలోనంట వెన్నెలా (2) ||ఇళ్లలోన|| / హా… ఏ ఊరు ఏ వాడ ఏ దిక్కు పుట్టినాడు కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా (2) / ఆ… యూదా దేశమందు వెన్నెల… ఆహా / బెత్లెహేము పురమునందు వెన్నెల… ఆహా (2) / రాజులకు రాజంట వెన్నెలా / ఆ రాజు యేసంట వెన్నెల (2) ||ఇళ్లలోన|| / ఆహ… తార చూపు దారిలోనే వచ్చినారు ఎవ్వరే కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా (2) / ఆ తూర్పు దేశ జ్ఞానులమ్మ వెన్నెల… ఆహా / దర్శింప వచ్చినారు వెన్నెల… ఆహా (2) / బంగారు సాంబ్రాణి బోళం / తెచ్చినారు ఇచ్చినారు వెన్నెలా (2) ||ఇళ్లలోన|| / ఆ… దివి నుండి ఈ భువికి వచ్చినాడు ఎందుకే కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా (2) / పాపులైన మనకోసం వెన్నెల… ఆహా / ప్రాణాన్ని అర్పించి వెన్నెల… ఆహా (2) / పరలోకానికి మార్గం వెన్నెలా / ఉచితంగా ఇచ్చినాడు వెన్నెలా (2) ||ఇళ్లలోన|| / హా.. పరలోకం చేరుటకై నేనేమి చెయ్యాలి కోయిలా / చెప్పవే చెప్పవే కోయిలా (2) / యేసయ్యను నమ్ముకో వెన్నెల… ఆహా / పాపాలను ఒప్పుకో వెన్నెల… ఆహా (2) / క్రొత్తగా జన్మించు వెన్నెలా / రక్షణను పొందుకో వెన్నెలా (2) ||ఇళ్లలోన||
ఇశ్రాయేలు దేవా నా స్తుతులమీద ఆసీనుడా / నిరంతరము స్తోత్రములకు పూజార్హుడా (2) / ఏమని నిన్ను నేను కీర్తింతును / ఏమని నిన్ను నేను పూజింతును (2) / ఏమని నిన్ను నేను ఆరాధింతును (2) / ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా / ఆరాధనా నీకు ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా / ఆరాధనా నీకే ఆరాధనా – ఆరాధనా నీకే ఆరాధనా / నా పితరులెందరో నిన్ను ఘనపరచి / దహనబలులు నీకు అర్పించగా (2) / ఇంపైన సువాసనగా అంగీకరించి / దీవెన వర్షము కురిపించితివే (2) / నా హృదయ క్షేత్రములో నిన్నారాధించి / స్తుతుల సింహాసనము నీకు వేయగా (2) / ఆనంద తైలముతో నన్నభిషేకించి / స్తోత్రగీతముతో నన్ను నింపితివే (2) / నా కొరకు సీయోనును సిద్ధపరచి / మహిమతో తిరిగి రానైయుంటివే (2) / ఆనంద ధ్వనులతో నన్నూరేగించి / శాశ్వత జీవము నాకిచ్చితివే (2)
ఇశ్రాయేలు రాజువే / నా దేవా నా కర్తవే / నే నిన్ను కీర్తింతును / మేలులన్ తలంచుచు (2) / యేసయ్యా… యేసయ్యా… (2) / వందనం యేసు నాథా / నీ గొప్ప మేలులకై / వందనం యేసు నాథా / నీ గొప్ప ప్రేమకై / ఎన్నెన్నో శ్రమలలో / నీ చేతితో నన్నెత్తి / ముందుకు సాగుటకు / బలమును ఇచ్చితివి (2) ||యేసయ్యా|| / ఏమివ్వగలను నేను / విరిగి నలిగిన మనస్సునే / రక్షణలో సాగెదను / నా జీవితాంతము (2) ||యేసయ్యా||
ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా (2) / నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా (2) / సొలొమోను దేవాలయంలలో నీదు మేఘము రాగానే (2) / యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి (2) / పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి (2) / నన్ను వెదికిన వారికి నే దొరికితి నంటివి (2) / నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి (2) / సిలువ రక్తము చేత మమ్ము రక్షించి యుంటివి (2) / ఆది యాపొస్తలులపై నీ యాత్మ వర్షము క్రుమ్మరించి (2) / నట్లు మాపై క్రుమ్మరించి మమ్ము నడిపించుము (2)
ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది / బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది / ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది (2) / వాన కురిసి వరద వస్తే / గాలి తోడై విసిరి కొడితే (2) / మాట వినని వాని ఇల్లు కూలిపోయెను / లోబడని వాని ఇల్లు కూలిపోయెను / వాని సొగసైన ఇల్లు కూలిపోయెను (2) / బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది (2) / వాన కురిసి వరద వస్తే / గాలి తోడై విసిరి కొడితే (2) / మాట వినిన వాని ఇల్లు నీటుగుండెను / లోబడిన వాని ఇల్లు నీటుగుండెను / వాని సొగసైన ఇల్లు నిలిచియుండెను (2) / జోరు వాన హోరు గాలి వరద పోటు / ఆ ఇంట ముంగిట తెల్లబోయెగా (2) / బండ మీద ఇల్లు కట్టి / సాటి ఏదని చాటి చెప్పి (2) / బండ అయిన యేసు మీద / నీ బ్రతుకు ఇంటిని కట్టుకోవయ్యా / బండ అయిన యేసు మీద / నీ బ్రతుకు ఇంటిని కట్టుకోవమ్మా / చావు వద్ద తీర్పు వద్ద / కూలిపోని కాలిపోని (2) / నిత్య జీవం పొందరావయ్యా / సజీవుడైన యేసు దేవుని స్వీకరించయ్యా / నిత్య జీవం పొందరావమ్మా / సజీవుడైన యేసు దేవుని స్వీకరించమ్మా / ఇసుక మీద ఇల్లు కట్టకు అది కూలిపోతుంది / బండ మీద ఇల్లు కట్టుకో అది స్థిరముగ ఉంటుంది (5)
ఇహమందున ఆ పరమందు నాకు / గృహమొసగిన నా దైవమా / మితిలేని ప్రేమతో గతిలేని నాకు / స్థితినొసగిన నా స్నేహమా (2) / యేసయ్యా నీవే నా ఆద్యంతం / యేసయ్యా నీలోనే నా ఆత్మీయం / యేసయ్యా నీకై నా ఆరాటం / యేసయ్యా నీతోనే నా ఆనందం / నీవే నా ఆశీర్వాదం / నీతోనే నా అనుబంధం (2) ||ఇహమందున|| / నేనునూ నా ఇంటి వారును / యెహోవాను సేవించెదం (2) / అని యెహోషువా నిను కొనియాడినంతగా / కీర్తించనా నిను స్తుతియించనా / నీ మేలులను నే చాటించనా (2) / యేసయ్యా నీవే నా సమీపం / యేసయ్యా నీలోనే నే సంపూర్ణం / యేసయ్యా నీకై నా సామర్ధ్యం / యేసయ్యా నీతోనే నా సంతోషం / నీవే నా సర్వస్వం / నీతోనే నా సహవాసం (2) ||ఇహమందున|| / నీ ఇంటి లోనికి నను చేర్చడానికి / ఈ భువికేగి సిలువలో బలి అయితివా (2) / మరిలేచి మహిమతో ఏతెంచితివే / మధ్యాకాశమున నిను వీక్షించుటే / నీ కొరకు నాకున్న నిరీక్షణ (2) / యేసయ్యా నీవే నా ప్రస్థానం / యేసయ్యా నీలోనే నే ప్రత్యేకం / యేసయ్యా నీకై నా ప్రావీణ్యం / యేసయ్యా నీతోనే నా ప్రయాణం / నీవే నా ప్రపంచం / నీతోనే నా ప్రతి నిమిషం (2) ||ఇహమందున||
ఇహలోక పాపి కొరకు / ఎనలేని ప్రేమను చూపి / గెలిచావుగా నా ప్రేమను / నా ప్రేమ నీవే యేసు / నీ కృప నాకు చాలు / నేనెలా నిను మరతును ||ఇహలోక || / నీ శక్తియే అద్భుతం / నీ సృష్టియే అద్భుతం (2) / యేసయ్యా యేసయ్యా / యేసయ్యా యేసయ్యా (2) ||ఇహలోక ||