85 songs found
ఆకాశం నీ సింహాసనం / భూమి నీ పాదపీఠం (2) / సర్వోన్నతుడా సర్వాధికారి / అందుకో ఇల నా హృదయ వందనం / అల్ఫయు నీవే ఒమేగయు నీవే – (2) / మార్గము నీవే – జీవము నీవే ||ఆకాశం|| / పరలోక తెరపైట తొలగించగా / స్తుతి గీత పాటలు వినిపించగా (2) / పరిశుద్ద ఆత్ముడు నను తాకగా / రగిలింది నా మనస్సు ఒక జ్వాలగా ||ఆకాశం|| / నీ స్వరము ఉరుమై వినిపించగా / అదిరింది నా గుండె ఒకసారిగా (2) / నీ కిరణాలు మెరుపై నను తాకగా / వెలిగింది నా మనస్సు ఒక జ్యోతిగా ||ఆకాశం|| / భువిలోని సృష్ఠంత నీ మాటగా / దివిలోని ఊపిరి నీ శ్వాసగా (2) / పరలోక రాజ్యానికి నువ్వు దారిగా / వెలిసావు ధరపైన నా యేసుగా ||ఆకాశం||
ఆకాశంబున్ దూతలు / ఉత్సాహించి పాడిరి / పుట్టె రక్షకుండని / సంతసించి ఆడిరి / సర్వోన్నతమైన స్థలములలో / ప్రభుకే మహిమలు కలుగును గాక / భూమి పై సమాధానం (2) / బెత్లెహేము నందున / క్రీస్తు రాజున్ చుడుడి / దేవుని కుమారుని / మోకరించి మ్రొక్కుడి ||సర్వోన్నతమైన||
ఆకాశమందు నీవుండగా / నేను ఎవరికి భయపడను / నీవీ లోకములో నాకుండగా / నేను దేనికి భయపడను (2) / శత్రుసమూహము నన్ను చుట్టినా / సైతనుడు సంహరింపజూసినా (2) / నా సహవాసిగా నీవుండగా / నేను ఎవరికి భయపడను (2) ||ఆకాశమందు|| / వ్యాధులు కరువులు శోధనలు / బాధలు దుఃఖము వేదనలు (2) / మరణము మ్రింగగ కాంక్షించినా / నేను దేనికి భయపడను (2) ||ఆకాశమందు|| / పడిపోయిన వెనుకంజ వేయక / పశ్చాత్తాపము పడి అడుగు (2) / నిను క్షమియించును నీ ప్రభువే / నీవు ఎవరికి భయపడకు (2) ||ఆకాశమందు||
ఆకాశమందున్న ఆసీనుడా / నీ తట్టు కనులెత్తుచున్నాను / నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ|| / దారి తప్పిన గొర్రెను నేను / దారి కానక తిరుగుచున్నాను (2) / కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| / గాయపడిన గొర్రెను నేను / బాగు చేయుమా పరమ వైద్యుడా (2) / కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| / పాప ఊభిలో పడియున్నాను / లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2) / కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||
ఆకాశమా ఆలకించుమా / భూమీ చెవియొగ్గుమా (2) / అని దేవుడు మాటలడుచున్నాడు / తన వేదన నీతో చెబుతున్నాడు (2) ||ఆకాశమా|| / నేను పెంచిన నా పిల్లలే / నా మీదనే తిరగబడిరనీ (2) / అరచేతిలో చెక్కుకున్నవారే / నా అరచేతిపై మేకులు కొడుతూ (2) / నను దూరంగా ఉంచారని / నా పిల్లలు బహు చెడిపోతున్నారని (2) ||దేవుడు|| / విస్తారమైన బలులు నాకేల / క్రొవ్విన దూడా నాకు వెక్కసమాయే (2) / కోడెల రక్తం గొర్రె పిల్లల రక్తం / మేకల రక్తం నాకిష్టము లేదు (2) / కీడు చేయ మానాలని / బహు మేలు చేయ నేర్వాలని (2) ||దేవుడు|| / పాపిష్టి జనమా, దుష్టసంతానమా / చెరుపు చేయు పిల్లలారా మీకు శ్రమ / అక్కరలో మీ చేతులు నా వైపుకు చాచినపుడు / మిమ్మును నే చూడకనే కనులు కప్పుకొందును / ఆపదలో మీ గొంతులు నా సన్నిధి అరచినపుడు / మీ మాటలు వినకుండా చెవులు మూసుకొందును / నన్ను విసర్జించువారు లయమగుదురని / నీరులేని తోటలా నశియింతురని (2) ||దేవుడు|| / ఆకాశమా భువికి చెప్పుమా / భూమీ లోకాన చాటుమా (2)
ఆకాశము నీ సింహాసనం / భూలోకము నీ పాద పీఠము / మహోన్నతుడా – మహా ఘనుడా / నీకే నా స్తోత్రము – నీకే నా స్తోత్రము / స్తుతులకు పాత్రుడా యేసయ్యా / స్తోత్రార్హుడవు నీవేనయ్యా / జీవాధిపతివి నీవయ్యా / జీవము గల మా యేసయ్యా / పాపుల రక్షకా యేసయ్యా / రక్షించుటకు పుట్టావయ్యా / నీ సిలువే నా మరణమును / తప్పించి రక్షించెనయ్యా / అద్భుతకారుడా మహనీయా / ఆశ్చర్యకరుడా ఓ ఘనుడా / దయగల మా ప్రభు యేసయ్యా / కృపగల మా ప్రభు నీవయ్యా / రానైయున్న యేసయ్యా / బూరధ్వనితో నీవేనయ్యా / మధ్యాకాశంలో విందయ్యా / ఎంతో ధన్యత మాకయ్యా
అవనిలో ఉద్భవించె ఆది సంభూతిని చూడరే / పుడమియే పరవశించె పసిబాలుని చూడగనే… పసిబాలుని చూడగనే / ఆకాశమే పట్టనోడు – ధరణిలో పుట్టినాడు / దావీదు పురమునందు దీనుడై – వెలసినాడు రక్షకుడు (2) / ఆనందమే మహా ఆనందమే – అందరికి ఇలలో సంతోషమే / ఆశ్చర్యమే ఇది అద్భుతమే – యేసు జననం అద్భుతమే (2) / అదృశ్య దేవుని మహిమ స్వరూపుడు / ఆది అంతమైన పరలోక నాథుడు (2) / ఆదియందు వాక్యంబుగా – సృష్టి కార్యము జరిగించినాడు / అనాది నుండి జ్ఞానంబుగా – సృష్టి క్రమము నడిపించినాడు (2) / అన్నిటిని కలిగించిన మహరాజు / కన్నీటిని తుడచుటకు దిగివచ్చినాడు (2) ||ఆనందమే|| / ప్రేమను పంచే ప్రేమామయుడు / రక్షణ ఇచ్చే రక్షించే దేవుడు (2) / పాపమే లేని సుగుణాల సుందరుడు / శాపము బాపను జన్మించెను చూడు (2) / నిత్యముండు నీతి సూర్యుడు – సత్యసాక్షిగా ఇలకొచ్చినాడు / ప్రేమను పంచే పావనాత్ముడు – పశుల పాకలో పవళించినాడు (2) / సర్వాధికారియైన మహరాజు / దీనులకు దీవెనగా దిగి వచ్చినాడు (2) ||ఆనందమే|| ||ఆకాశమే||
ఆగక సాగుమా / సేవలో ఓ.. సేవకా / ఆగక సాగుమా / సేవలో సేవకా (2) / ప్రభువిచ్చిన పిలుపును / మరువక మానక (2) ||ఆగక|| / పిలిచినవాడు ప్రభు యేసుడు / ఎంతైనా నమ్మదగినవాడు (2) / విడువడు నిన్ను ఎడబాయడు / నాయకుడుగా నడిపిస్తాడు (2) ||ఆగక|| / తెల్లబారిన పొలములు చూడు / కోత కోయను సిద్ధపడుము (2) / ఆత్మల రక్షణ భారముతో / సిలువనెత్తుకొని సాగుము (2) ||ఆగక||
ఆగని పరుగులో ఎండిన ఎడారులు (2) / కృంగిన బ్రతుకులో నిండిన కొరతలు / ఉన్నపాటునా నలిగె నా వైపున / కదలిరాలేవా ఆదరించగ రావా / కన్నీరే నా మజిలీ – దరి చేరే నీ జాలి / లాలించే నీ ప్రేమ – నా ప్రాణమై / కరుణించే నీ చూపు – మన్నించే నా మనవి / అందించే నీ చేయి – నా స్నేహమై ||ఆగని|| / లోకప్రేమే సదా – కలల కడలే కదా / తరంగమై కావుమా – తిరిగి తీరమునకు (2) / నీవే కదా ఆధారం – సదా నీకే దాసోహం / యేసయ్యా… అర్పించెదా – నా జీవితం ||ఆగని|| / ఎదుట నిలిచె నీవే – ప్రేమకు రూపం నీవే / కృపామయా కావుమా – జార విడువకు నన్ను (2) / నీవే కదా నా మూలం – సదా నీపై నా భారం / యేసయ్యా… ప్రేమించెదా – కలకాలము ||ఆగని||
ఆడెదన్ పాడెదన్.. యేసుని సన్నిధిలో / నను బలపరచిన దేవుని సన్నిధిలో / స్తుతింతును ఆరాధింతును.. యేసుని సన్నిధిలో / ఉజ్జీవమిచ్చిన దేవుని సన్నిధిలో ||ఆడెదన్|| / నను దర్శించి నూతన జీవం… ఇచ్చిన సన్నిధిలో / నను బలపరచి ఆదరించిన.. యేసుని సన్నిధిలో (2) / ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో / స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో ||ఆడెదన్|| / పరిశుద్ధాత్మ జ్వాలలో రగిలించి నన్ను… మండించిన సన్నిధిలో / పరిశుద్ధాత్మలో నను అభిషేకించిన.. యేసుని సన్నిధిలో (2) / ఆడెదన్ పాడెదన్ దేవుని సన్నిధిలో / స్తుతించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో ||ఆడెదన్||
ఆత్మ దీపమును (2) / వెలిగించు యేసు ప్రభు (2) ||ఆత్మ|| / వసియించుము నా హృదయమునందు (2) / వసియించు నా నయనములందు (2) / అన్నియు నిర్వహించుచున్నావు (2) / నన్ను నిర్వహించుము ప్రభువా (2) ||ఆత్మ|| / కలుషాత్ములకై ప్రాణము బెట్టి (2) / కష్టములంతరింప జేసి (2) / కల్వరి సిలువలో కార్చిన రక్త (2) / కాలువ యందు కడుగుము నన్ను (2) ||ఆత్మ||
ఆత్మ వర్షము మాపై కురిపించుము / కడవరి ఉజ్జీవం మాలో రగిలించుము (2) / నీ ఆత్మతో సంధించుము / అభిషేకంతో నింపుము / నీ అగ్నిలో మండించుము / వరాలతో నింపుము (2) / యెషయా పెదవులు కాల్చితివి / సేవకు నీవు పిలచితివి (4) / సౌలును పౌలుగా మార్చితివి / ఆత్మ నేత్రములు తెరచితివి (2) / మమునూ వెలిగించుము / మా పెదవులు కాల్చుము (2) / పాత్మజు దీవిలో పరవశుడై / శక్తిని చూచెను యోహాను (2) / షడ్రకు మేషకు అబేద్నగో / ధైర్యముతో నిను సేవించిరి (2) / మామునూ రగిలించుము / మాకు దర్శనమిమ్ము (2)