64 songs found
అందాల తార అరుదెంచె నాకై అంబర వీధిలో / అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ / ఆనందసంద్ర ముప్పొంగె నాలో అమరకాంతిలో / ఆది దేవుని జూడ ఆశింప మనసు పయనమైతిని ||అందాల తార|| / విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ దోచెను / వింతైన శాంతి వర్షించె నాలో విజయపథమున / విశ్వాలనేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో / విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నొసగుచున్ ||అందాల తార|| / యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు / ఎరిగిన దారి తొలగిన వేళ యెదలో కృంగితి / యేసయ్యతార యెప్పటివోలె యెదురాయె త్రోవలో / ఎంతో యబ్బుర పడుచు విస్మయ మొందుచు యేగితి స్వామి కడకు ||అందాల తార|| / ప్రభు జన్మ స్ధలము పాకయేగాని పరలోక సౌధమే / బాలుని జూడ జీవితమంత పావనమాయెను / ప్రభుపాదపూజ దీవెనకాగ ప్రసరించె పుణ్యము / బ్రతుకే మందిరమాయె అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్థన ||అందాల తార||
అందాల బాలుడు ఉదయించినాడు / లోకాలు వెలిగించు నీతి సూరీడు (2) / రండయ్యో మన కొరకు రారాజు పుట్టెను / ప్రేమను పంచేటి రక్షణను తెచ్చెను (2) ||అందాల|| / భీతిల్లి పోయాము ఆ వెలుగునే జూసి / ఎన్నడూ ఎరుగని తేజస్సునే గాంచి (2) / గొల్లలము మేము కల్లలు ఎరుగము (2) / కళ్లారా జూసాము తేజోమయుని మోము (2) ||రండయ్యో|| / తూరుపు జ్ఞానులము వెలిగే తారను జూసి / లెక్కలెన్నో వేసి మాహరాజు-నెతికాము (2) / దారి చూపే తార రారాజునే జేర (2) / మొక్కాము మోకరిల్లి బాలున్ని మనసారా (2) ||రండయ్యో|| / తనలోని వెలుగంత పంచేటి పావనుడు / మనలోని పాపమంత తీసేయు రక్షకుడు (2) / చీకట్లు తొలగించ ఉదయించినాడు నేడు (2) / నీ తప్పులెన్ని ఉన్నా మన్నించుతాడు రేడు (2) ||రండయ్యో||
అందాలు చిందే శుభ వేళ – అందుకో ఈ వేళ (2) / కోరుకున్నావు ఈ వరుని – చేరియున్నాడు నీ జతనే (2) ||అందాలు|| / చిననాటి పుట్టింటి నడకా / సాగాలి అత్తింటి దాకా (2) / ఎంత ఘనమైన బంధం / వెయ్యేండ్ల వివాహ బంధం (2) ||అందాలు|| / సంసార సాగర పయనం / తెర చాటు అనుభూతి వినయం (2) / సాగిపోవాలి పయనం / చేరుకోవాలి గమ్యం (2) ||అందాలు|| / యేసయ్య పాదాల చెంత / వదలాలి ఎదలోని చింత (2) / క్రీస్తు పుట్టాలి నీలో / చేర్చుకోవాలి హృదిలో (2) ||అందాలు||
అంధకార చెరసాలలో – బంధకాల ఇరుకులో / పౌలు సీలలు ప్రార్ధించిరి – కీర్తనలు పాడిరి – (2) / భూమియే కంపించెను – చెరసాల అదిరెను / వారి సంకెళ్లు ఊడిపోయెను – విడుదల దొరికెను – (2) / వ్యాధులు ఆవరించగా – మరణము తరుముచుండగా / రండి పారి పోదుము – ఇంక దాగి యుందుము / ఏ తెగులు దరిచేరని – ఏ దిగులు ఉండని / మన దాగు స్థలములో – యేసుని సన్నిధిలో ||అంధకార|| / ప్రార్ధన చేసెదము – దేవుని సముఖములో / ఈ శోధన సమయములో – విరిగిన హృదయముతో / ఈ లోక రక్షణకై – జనముల స్వస్థతకై / యేసుని వేడెదము – శోకము తొలగించమని ||అంధకార|| / మొరలను ఆలకించును – యేసు మనలను విడిపించును / ఈ లోకమును శుద్ధిచేయును – మరణమును తప్పించును / మన రక్షణ వలయముగా – తన రెక్కలు చాపును / దుఃఖమును సంతోషముగా – మార్చివేయును త్వరలో ||అంధకార||
లాల లాలలలా లాలలలా లా లా లా… లాల లాలలలాలా (2) / అంబరానికి అంటేలా మనమంతా సంబరాలు చేసేద్దాం (2) / సంగీత స్వరాలతో ఈ మాట అందరికి చక్కగ చాటి చెప్పుదాం (2) ||లాల|| / దివి నుండి దీనుడిగా భువికి ఏతెంచినాడు / దీనులను రక్షించే దేవ తనయుడు (2) / దీనుల శ్రమలు వ్యాధి బాధలలో విడుదలిచ్చె / విజయ వీరుడై ఉద్భవించెనే (2) / పశుల పాకలో పరుండియుండెనే ||లాల|| / ఆ నాడు ఒక తార జ్ఞానులకు తెలియజేసే / లోకానికి రక్షకుడు వెలిసెనని (2) / తార వెంబడి వెళ్లి వారు / కానుకలర్పించి ఆరాధించారు (2) / ఆత్మ పూర్ణులై తిరిగి వెళ్లిరి ||లాల|| / ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త / సమాధానమిచ్ఛే ఈ చిన్ని బాలుడే (2) / పొత్తి గుడ్డలలో చుట్టబడే పరమాత్ముడు / దూత గణములే జోల పాడగా (2) / సృష్టికి బహు సంబరమాయెగా ||లాల||
అంబరానికి అంటేలా / సంబరాలతో చాటాలా (2) / యేసయ్య పుట్టాడని / రక్షింప వచ్చాడని (2) / ప్రవచనాలు నెరవేరాయి / శ్రమ దినాలు ఇక పోయాయి (2) / విడుదల ప్రకటించే / శిక్షను తప్పించే (2) ||యేసయ్య|| / దివిజానాలు సమకూరాయి / ఘనస్వరాలు వినిపించాయి (2) / పరముకు నడిపించే / మార్గము చూపించే (2) ||యేసయ్య|| / సుమ వనాలు పులకించాయి / పరిమళాలు వెదజల్లాయి (2) / ఇలలో నశియించే / జనులను ప్రేమించే (2) ||యేసయ్య||
అంబరాన్ని దాటే సంబరాలు నేడు / నింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు (2) / రండయ్యో రండి రండి దావీదు పురముకు (2) / రారాజు పుట్టి ఇల పిలిచెను కొలువుకు (2) ||అంబరాన్ని|| / దేవుడు ఎంతగానో ప్రేమించి లోకము / ఏకైక తనయుని పంపెను ఈ దినము (2) / పశువుల పాకలో ఒదిగేను శిశువుగా (2) / అవతరించే నేడు లోక రక్షకునిగా (2) ||రండయ్యో|| / దేవాది దేవుడు మనిషిగా మారిన వేళ / శాపాలు పాపాలు రద్దయిన శుభవేళ (2) / లోకాల కారకుడు లోకమున పుట్టెను (2) / మనిషి మరణము ఆయువు తీరెను (2) ||రండయ్యో||
అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2) / పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2) / అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2) / ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2) ||అగ్ని|| / అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2) / ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2) ||అగ్ని|| / అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2) / నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2) ||అగ్ని|| / ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2) / నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2) ||అగ్ని||
అడగక ముందే అక్కరలెరిగి / అవసరాలు తీర్చిన ఆత్మీయుడా / ఎందరు ఉన్నా బంధువు నీవే / బంధాలను పెంచిన భాగ్యవంతుడా / పదే పదే నేను పాడుకోనా / ప్రతి చోట నీ మాట నా పాటగా / మరి మరి నే చాటుకోనా / మనసంతా పులకించని సాక్షిగా / నా జీవిత గమనానికి గమ్యము నీవే / చితికిన నా గుండెకు ప్రాణం నీవే (2) ||పదే పదే|| / మమతల మహా రాజా / (నా) యేసు రాజా (4) / అడగక ముందే అక్కరలెరిగి / అవసరాలు తీర్చిన ఆత్మీయుడా / ఎందరు ఉన్నా బంధువు నీవే / బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) / అవసరాలు తీర్చిన ఆత్మీయుడా / బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) ||మమతల|| / అడిగిన వేళ అక్కున చేరి / అనురాగం పంచిన అమ్మవు నీవే / నలిగిన వేళ నా దరి చేరి / నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) / అనురాగం పంచిన అమ్మవు నీవే / నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2) ||పదే పదే||
అడవి చెట్ల నడుమ / ఒక జల్దరు వృక్షం వలె / పరిశుద్ధుల సమాజములో / యేసు ప్రజ్వలించుచున్నాడు (2) / కీర్తింతున్ నా ప్రభుని / జీవ కాలమెల్ల ప్రభు యేసుని / కృతజ్ఞతతో స్తుతించెదను (2) / షారోను రోజా ఆయనే / లోయ పద్మమును ఆయనే / అతిపరిశుద్ధుడు ఆయనే / పదివేలలో అతిశ్రేష్టుడు (2) ||కీర్తింతున్|| / పరిమళ తైలం నీ నామం / దాని వాసన వ్యాపించెగా / నింద శ్రమ సంకటంలో / నను సుగంధముగా చేయున్ (2) ||కీర్తింతున్|| / మనోవేదన సహించలేక / సిలువ వైపు నే చూడగా / లేవనెత్తి నన్నెత్తుకొని / భయపడకుమని అంటివి (2) ||కీర్తింతున్|| / నా త్రోవకు దీపం నీవే / నా బ్రతుకుకు జీవం నీవే / నా సేవకు బలము నీవే / నా ఆత్మకాదరణ నీవే (2) ||కీర్తింతున్|| / ఘనమైన నా ప్రభువా / నీ రక్త ప్రభావమున / నా హృదయము కడిగితివి / నీకే నా స్తుతి ఘనత (2) ||కీర్తింతున్|| / నీవు నా దాసుడవనియు / ఏర్పరచుకొంటినని / నేనే నీ దేవుడనని / భయపడకు-మని అంటివి (2) ||కీర్తింతున్||
అడిగినది కొంతే అయినా / పొందినది ఎంతో దేవా / ప్రతిగా ఏమివ్వగలనయా / నిను స్తుతియించే హృదయము తప్ప / నా జీవితం నీకే అంకితమయ్యా – (4) ||అడిగినది|| / ఊహించలేని వివరింపజాలని / నీ కార్యములు ఆశ్చర్యమే / యోచించినా నా వర్ణనకందని / నీ కృపా కనికరములు అత్యున్నతమే / తరతరములకు మారని నీ ఉన్నత ప్రేమా / యుగయుగములకు నీకే ఘనతా మహిమా / సతతం నిను నే కొనియాడెదను / సకలం నీ నామముకే స్తోత్రము తగును ||అడిగినది|| / క్షణ భంగురం నా క్షయ జీవితం / కాచావయ్యా నను నీ రెక్కల నీడ / ఏ యోగ్యత లేని అల్పురాల నన్ను / హెచ్చించావయ్యా నీ ప్రేమ తోడ / నా ఆశ్రయ దుర్గము నీవే యేసయ్య / నా రక్షణ శృంగము నీవే మెస్సయ్య / నా స్తుతికి పాత్రుడవు నీవేనయ్యా / ఈ స్తోత్ర కీర్తన నీకేనయ్యా ||అడిగినది|| / మహిమోన్నతుడా నను మరువని విభుడా / ప్రణుతించెదను నిన్నే నిరతం / నిష్కలంకుడా నిర్మలాత్ముడా / ప్రకటించెదను నీ పావన చరితం / నా అతిశయము నీవే నా యేసయ్యా / నా ఆధారము నీవే నా మెస్సయ్యా / నా ఆరాధన ఆలాపన నీకేనయ్యా / ఈ దీన సేవను చేకొనుమయ్యా ||అడిగినది||
అడుగడుగున రక్త బింధువులే / అణువణువున కొరడా దెబ్బలే (2) / నా యేసుకు ముళ్ల కిరీటం / భుజములపై సిలువ భారం (2) / భుజములపై సిలువ భారం ||అడుగడుగున|| / సిలువ మోయుచు వీపుల వెంట / రక్త ధరలే నిన్ను తడిపెను (2) / నా ప్రజలారా ఏడవకండి / మీ కోసము ప్రార్ధించండి (2) ||అడుగడుగున|| / కలువరిలోన నీ రూపమే / నలిగిపోయెను నా యేసయ్యా (2) / చివరి రక్త బిందువు లేకుండా / నా కోసమే కార్చినావు (2) ||అడుగడుగున|| / మరణము గెలిచి తిరిగి లేచిన / మృత్యుంజయుడా నీకే స్తోత్రం (2) / మహిమ స్వరూపా మా యేసయ్యా / మహిమగా నన్ను మార్చినావా (2) ||అడుగడుగున||